EditorialGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tag1c2be0ef-a5a3-4963-9bf3-5fdbfbfc006f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tag1c2be0ef-a5a3-4963-9bf3-5fdbfbfc006f-415x250-IndiaHerald.jpgరాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన దిట్ట‌.. వాటిని అమ‌లు ప‌ర‌చ‌డంలో గండ‌ర గండ‌డు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఏ ప‌నిచేసినా, ఏ మాట మాట్లాడినా, ఒక అడుగు ముందుకేసినా, ఒక అడుగు వెన‌క్కి వేసినా అంతా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. వాటివెన‌క ఒక వ్యూహం ఉంటుంది. ప్ర‌త్య‌ర్థుల‌కే కాదు.. ప‌క్క‌నున్న‌వారికి కూడా అంతుప‌ట్ట‌ని వైనంగా ఉంటుంది ఆ వ్యూహం. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు. రాజ‌కీయాల్లో ఢ‌క్కామొక్కీలు తిన్న కేసీఆర్tag{#}Backward Classes;KCR;Dookudu;revanth;Congress;Telangana;Party;Teluguవ్యూహాత్మ‌కం... కేసీఆర్ వ్యూహం?వ్యూహాత్మ‌కం... కేసీఆర్ వ్యూహం?tag{#}Backward Classes;KCR;Dookudu;revanth;Congress;Telangana;Party;TeluguMon, 28 Jun 2021 14:52:58 GMT
రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన దిట్ట‌.. వాటిని అమ‌లు ప‌ర‌చ‌డంలో గండ‌ర గండ‌డు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఏ ప‌నిచేసినా, ఏ మాట మాట్లాడినా, ఒక అడుగు ముందుకేసినా, ఒక అడుగు వెన‌క్కి వేసినా అంతా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. వాటివెన‌క ఒక వ్యూహం ఉంటుంది. ప్ర‌త్య‌ర్థుల‌కే కాదు.. ప‌క్క‌నున్న‌వారికి కూడా అంతుప‌ట్ట‌ని వైనంగా ఉంటుంది ఆ వ్యూహం. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు. రాజ‌కీయాల్లో ఢ‌క్కామొక్కీలు తిన్న కేసీఆర్ ను ఢీకొట్ట‌డానికి ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి, భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ సిద్ధ‌మ‌వుతున్నారు. త‌మ శ‌క్తియుక్తుల‌న్నీ కూడ‌దీసుకుంటున్నారు. ఒక‌ర‌కంగా వారికి హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో ఒక అవకాశం కూడా ల‌భించింది. వీరిద్ద‌రిలో ఎవ‌రైనా కేసీఆర్ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాన్ని ర‌చించ‌గ‌లిగితే హుజూరాబాద్ వారి సొంత‌మైన‌ట్లే.! ఇప్పుడు వీరిద్ద‌రూ ఏం చేయ‌బోతున్నార‌నేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

చేతికి మ‌ట్టి అంట‌కుండా...
ఈటెల రాజేంద‌ర్ హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన బీసీ నేత‌. రాష్ట్ర‌వ్యాప్తంగా అనుచ‌ర‌గ‌ణం ఉంది. ఉద్య‌మ‌కారుడు. పార్టీ ఆవిర్భావం నుంచి కీల‌క‌పాత్ర పోషించిన వ్య‌క్తి అటువంటి వ్య‌క్తిని కూడా చేతికి మ‌ట్టి అంట‌కుండా పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపించ‌డంకానీ, మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించ‌డంకానీ స‌మోసా తిన్నంత సులువుగా కేసీఆర్ చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులుకానీ, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు కానీ భావిస్తుంటారు. అంత పెద్ద ప‌నిని కూడా సులువుగా చేసిన‌దాన్నిబ‌ట్టే అక్క‌డ కేసీఆర్ చాణ‌క్యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాంటి కేసీఆర్ ఎదుట ఒక‌ర‌కంగా చెప్పాలంటే రేవంత్‌కానీ, బండికానీ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో తేలిపోతారు. అయితే ఎప్పుడూ ముఖ్య‌మంత్రిపై ఒంటికాలిపై లేవ‌డ‌మే రేవంత్ బ‌లంగా మారింది. ప‌దునైన విమ‌ర్శ‌నాస్త్రాలు, వాగ్బాణాలు సంధించ‌డంలో ముందుంటారు. ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌ప‌డ్డారు.

బండి, రేవంత్ దూకుడు
బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత బండి సంజ‌య్ కూడా త‌న ధోర‌ణి మార్చుకున్నారు. దూకుడు పెంచారు.. స్వ‌రం పెంచారు.. మాట‌లు పెంచారు.. అయితే వీరిద్ద‌రూ దుందుడుకు స్వ‌భావం క‌లిగిన‌వారే. అవ‌స‌రం లేక‌పోయినా వంద అడుగులు ముందుకు వేస్తారుకానీ.. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఒక్క అడుగు కూడా వెన‌క్కి వేయ‌లేరు. అందుకు వారి స్వ‌భావం ఒప్పుకోదు. కానీ కేసీఆర్ అలాకాదుగా.. అవ‌స‌ర‌మైతే వంద అడుగులైనా వెన‌క్కి వేస్తారు.. వెయ్యి అడుగుల దూరాన్ని ఒకేసారి దూకేస్తారు. ఆ ప‌ట్టువిడుపులు రాజ‌కీయాల్లో ప్ర‌ద‌ర్శించ‌గ‌లిగే కొద్దిమంది నేత‌ల్లో కేసీఆర్ ఒక‌రు. ఇప్పటికే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బండి త‌న దూకుడు స్వ‌భావాన్ని ప్ర‌జ‌ల‌కు రుచిచూపించారు. రేవంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు పీసీసీ అధ్య‌క్షుడైన త‌ర్వాత ఆగే ప్ర‌స్తక్తే ఉండ‌దు. వీరిద్ద‌రూ ఇప్పుడు కేసీఆర్‌కు గ‌ట్టి స‌వాల్ విస‌ర‌గ‌లుగుతారా?  లేదంటే కేసీఆర్ వ్యూహం ముందు తేలిపోతారా? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపునుబ‌ట్టే కేసీఆర్‌పై వీరిద్ద‌రూ స‌వారీ చేస్తారా?  లేదంటే రేవంత్‌, బండిపై కేసీఆర్ స‌వారీ చేస్తారా? అనేది మ‌న‌కు స్ప‌ష్ట‌త రావాలంటే కొద్దికాలం ఓపిక ప‌ట్ట‌క త‌ప్ప‌దు.






కొడాలి కూడా అదేబాటలో..తగ్గి ఉన్నారా!

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఏ సినిమా అయినా సరే హిట్ కొట్టాల్సిందే..

పీవీ.. తెలుగు వారి ఠీవీ.. ఆయ‌న చ‌రిత్ర అద్భుతం!

రాజ‌కీయ వ్యూహాల్లో ఆరితేరిన దిట్ట‌.. వాటిని అమ‌లు ప‌ర‌చ‌డంలో గండ‌ర గండ‌డు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఏ ప‌నిచేసినా, ఏ మాట మాట్లాడినా, ఒక అడుగు ముందుకేసినా, ఒక అడుగు వెన‌క్కి వేసినా అంతా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. వాటివెన‌క ఒక వ్యూహం ఉంటుంది. ప్ర‌త్య‌ర్థుల‌కే కాదు.. ప‌క్క‌నున్న‌వారికి కూడా అంతుప‌ట్ట‌ని వైనంగా ఉంటుంది ఆ వ్యూహం. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు. రాజ‌కీయాల్లో ఢ‌క్కామొక్కీలు తిన్న కేసీఆర్ ను ఢీకొట్ట‌డానికి ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి, భార‌తీయ జ‌న‌తాపార్టీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ సిద్ధ‌మ‌వుతున్నారు.

సేతుపతి వదలట్లేదుగా... మరో తెలుగు సినిమాలో?

నాలుగు రాష్ట్రాల్లో ఎంపీగా గెలిచిన ఏకైక ప్ర‌ధాని పీవీ.. తిరుగులేని రికార్డు

ఎర్రగా కందిపోయిన ఈషా రెబ్బ చెయ్యి..గాయం ఎలా అయ్యింది

తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ అనాలేమో.. ?

ప్ర‌కాష్‌రాజ్‌కు జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ద్ద‌తు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>