QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaata8d2ec6cd-6f88-4b79-8b51-af58923042b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaata8d2ec6cd-6f88-4b79-8b51-af58923042b6-415x250-IndiaHerald.jpgప్రతి నిమిషం.. ప్రతి క్షణం.. ఎంతో విలువైనది.. సమయానికి ఎప్పటికప్పుడు ప్రాధాన్యమివ్వడం అత్యవసరం. ఇక సమయం తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోగలిగితే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం సులభం అవుతుంది. సమయాన్ని వృధా చేస్తే మన జీవితంలో ఏమి కోల్పోవలసి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం.. ఒకానొక ఊరిలో అనిత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏడవ తరగతి చదువుతూ వుండేది. ఎంతో తెలివైనది. చక్కగా చదవడమే కాకుండా అంతే తీయగా పాటలు కూడా పాడుతుంది. కానీ ఆమెకు కొంచెం బద్ధకం. ఎక్కువగా ప్రతి చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంMANCHIMAATA{#}anitha singer;Prize;Gift;Girl;Letter;Manamమంచిమాట: సమయాన్ని వృధా చేస్తే.. జీవితమే వృధా అవుతుంది..మంచిమాట: సమయాన్ని వృధా చేస్తే.. జీవితమే వృధా అవుతుంది..MANCHIMAATA{#}anitha singer;Prize;Gift;Girl;Letter;ManamMon, 28 Jun 2021 14:00:00 GMT
ప్రతి నిమిషం.. ప్రతి క్షణం.. ఎంతో విలువైనది.. సమయానికి ఎప్పటికప్పుడు ప్రాధాన్యమివ్వడం అత్యవసరం. ఇక సమయం తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోగలిగితే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం సులభం అవుతుంది. సమయాన్ని వృధా చేస్తే మన జీవితంలో ఏమి  కోల్పోవలసి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం..

ఒకానొక ఊరిలో అనిత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఏడవ తరగతి చదువుతూ వుండేది. ఎంతో తెలివైనది. చక్కగా చదవడమే కాకుండా అంతే తీయగా పాటలు కూడా పాడుతుంది. కానీ ఆమెకు కొంచెం బద్ధకం. ఎక్కువగా ప్రతి చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండేది. అంతేకాదు తను చేయాల్సిన ఏ పనినైనా సరే వాయిదా వేయడం అనితకు అలవాటు." ప్రతి చిన్న విషయాన్ని వాయిదా వేయవద్దు, నిర్లక్ష్యం వహించవద్దు".. అని వాళ్ళ అమ్మ ఎన్నో సార్లు చెప్పినా అనితకు ఆ మాటలేవీ పట్టేవి కాదు. అంతే కాదు నిర్లక్ష్యంతో ఏ పని సవ్యంగా చేసేది కాదు.

ఆ ఊర్లో ఒక సారి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూల్స్  విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత ఆటల పోటీల్లో పాల్గొని , అందులో ఆమెకు మొదటి బహుమతి కూడా వచ్చింది. ఇక కొద్ది రోజుల తర్వాత  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఈ నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు, మరుసటి రోజు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాసారు. నిర్లక్ష్యంతో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వెళ్దాంలే అనుకొని నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది.

ఇక ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణములో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడడానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్ అంతకు ముందు రోజు జరిగిన ఆటవి  అనిత అయ్యో .!కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా..! అని బాధపడింది. ఈ సంఘటనతో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యం ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవాలని ప్రారంభించింది. చూశారు కదా..! ఏ విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే  చాలా కోల్పోవాల్సి వస్తుంది.





ఆమె నిమ్మరసం అమ్మిన చోటే ఎస్సైగా విధులు..!

మీరా జాస్మిన్ ఇప్పుడు ఎంత అందంగా మరిపోయిందో చూడండి

సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా కోల్పోవాల్సి వస్తుంది.ఇక సమయం తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోగలిగితే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం సులభం అవుతుంది.

సల్మాన్ ఇపుడు పశ్చాత్తాపపడితే ఏం లాభం..!

వేరే అమ్మాయితో ఇమ్మానియేల్ పెళ్లి.. స్టేజ్ మీద ఏడ్చేసిన వర్ష?

మా వార్‌: మంచు విష్ణుకు ఫ్యామిలీ స‌పోర్ట్ ఎందుకు లేదు ?

జర్నలిస్టుల దుస్థితిపై రఘురామకృష్ణంరాజు రాసిన లేఖలో ఏముంది..?

టీచర్ కు బుద్ది చెప్పిన గ్రామస్తులు.. మ్యాటరేంటంటే?

ఎన్వీ రమణపై బార్‌ కౌన్సిల్‌ ప్రశంసల వర్షం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>