Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pvacc609a7-4bb2-4552-a850-6b53147bfeba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pvacc609a7-4bb2-4552-a850-6b53147bfeba-415x250-IndiaHerald.jpgపీవీ నరసింహారావు... తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు. దక్షిణాది నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు. సంక్షోభంలో కూరుకు పోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిన పెట్టి దేశం మొత్తం మహా మేధావి అని ప్రశంసించేలా చేసుకున్నా గొప్ప రాజకీయ చానిక్యుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ఎంతగానో పెంచిన తెలుగుతేజం పీవీ నరసింహారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా నర్సంపPv{#}kirti;Rajiv Gandhi;Lakshmi Devi;Petta;June;MP;రాజీనామా;Reddy;Warangal;Bhuma Akhila Priya;Telangana Chief Minister;Hyderabad;Prime Minister;Congress;Andhra Pradesh;Telugu;Mahaఆ సమయంలో పీవీ నరసింహారావు చేసిన పనికి.. టెక్నీషియన్ ఆశ్చర్యపోయాడట?ఆ సమయంలో పీవీ నరసింహారావు చేసిన పనికి.. టెక్నీషియన్ ఆశ్చర్యపోయాడట?Pv{#}kirti;Rajiv Gandhi;Lakshmi Devi;Petta;June;MP;రాజీనామా;Reddy;Warangal;Bhuma Akhila Priya;Telangana Chief Minister;Hyderabad;Prime Minister;Congress;Andhra Pradesh;Telugu;MahaMon, 28 Jun 2021 11:10:00 GMTపీవీ నరసింహారావు...  తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు. దక్షిణాది నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి పీవీ నరసింహారావు. సంక్షోభంలో కూరుకు పోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తన సంస్కరణలతో గాడిన పెట్టి దేశం మొత్తం మహా మేధావి అని ప్రశంసించేలా చేసుకున్నా  గొప్ప రాజకీయ చానిక్యుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ఎంతగానో పెంచిన తెలుగుతేజం పీవీ నరసింహారావు.



 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా నర్సంపేట పేట మండలం లక్ష్మీ పేట గ్రామంలో 1921 జూన్ 28 వ తేదీన రుక్నాబాయ్ సీతారామారావు దంపతులకు జన్మించారు పీవీ నరసింహ. ఆయన పూర్తిపేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఇక ఆయన చిన్నప్పటి నుంచి మృదుస్వభావి గానే ఉండేవారు. ఇక స్వాతంత్రోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటం లో కూడా కీలక పాత్ర పోషించారు పీవీ నరసింహారావు. ఇక 1951 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా చేరాడు. ఇక 1957లో మొదటిసారి మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు పీవీ.


 అదే నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1962లో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా వివిధ మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు పీవీ నరసింహారావు. ఇక ఆ తర్వాత ఎంపీ నుంచి ప్రధాని వరకు ఎదిగారు. 1977 లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన పీవీ నరసింహారావు కేంద్రంలో కూడా పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడంతో ఇక పీవీ నరసింహారావు ఆమోదయోగ్యంగా కనిపించారు అందరికీ   దీంతో ఆయనను ప్రధానిగా ఎంపిక చేశారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి చేయడానికి 1991 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన గంగుల ప్రతాప్ రెడ్డి చేత రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికల్లో పీవీతో పోటీ చేయించి గెలిపించారు. తర్వాత భారత ప్రధాని పగ్గాలు చేపట్టిన పి.వి.నరసింహారావు తన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడ్డారు.



 అయితే అప్పుడప్పుడే దేశంలోకి కంప్యూటర్ల వాడకం మొదలైంది. దీంతో చాలామంది లో కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగానే ఉంది.  ఆ సమయంలోనే ఎంతగానో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నా మహా మేధావి పి.వి.నరసింహారావు. అయితే ఒకానొక సమయంలో ఓసారి కంప్యూటర్ హార్డ్వేర్ సమస్య వచ్చింది. ఇక ఆ సమయంలో టెక్నీషియన్ అందుబాటులో లేడు. దీంతో పీవీ నరసింహారావు స్వయంగా తన కంప్యూటర్ పరిజ్ఞానంతో మాన్యువల్స్ పూర్తిగా తొలగించి ఆ కంప్యూటర్ మొత్తాన్ని తానే స్వయంగా బాగా చేసుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన టెక్నీషియన్  పీవీ నరసింహారావు పరిజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా  బహుముఖ ప్రజ్ఞాశాలిగా పీవీ నరసింహారావు ఎంతగానో పేరొందారు.



ఈ ఫొటోలో ఉన్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా..??

లింక్‌రోడ్ల‌తో క‌నెక్ట‌విటీ పెంచుతాం!

సీనియర్ల దేముంది రేవంతూ, ముందు ఈ సంగతి చూడు!

హాస్య కథలకు పెట్టింది పేరు ముళ్లపూడి..

కాంగ్రెస్ - చంద్ర‌బాబు క‌లిస్తే.. ఇద్దరూ భూస్థాపిత‌మే ?

వైఎస్ కుడి భుజంతో రేవంత్ భేటీ!

బ్ర‌హ్మాజీ సెటైర్‌: మా ఎలక్షన్స్ కోసం చైనా అధ్యక్షుడు..!!

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. మోస్ట్ వాంటెడ్ సినిమాల కోసం కొత్త మొహాలు

19 ఏళ్లకు బయటపడ్డ జయం సినిమా ప్రమాదం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>