PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7ec135ad-af9d-45cb-9ecb-99127fc4fde7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan7ec135ad-af9d-45cb-9ecb-99127fc4fde7-415x250-IndiaHerald.jpgనిజానికి 2014లో చంద్రబాబు అమరావతి ప్రాంతం ఏపీకి రాజధాని అని ప్రకటించినపుడు నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్‌ ఏ మాత్రం సందేహించకుండా మద్దతు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే మాట మార్చేశారు. జ‌గ‌న్ అమ‌రావ‌తి అభివృద్ధిని అదే స్పీడ్ తో ఈ రెండేళ్ల‌లో మ‌రి కాస్త ముందుకు తీసుకుని వెళ్లి ఉంటే అమ‌రావ‌తి రూపురేఖ‌లు మ‌రింత మారిపోయేవ‌ని విశ్లేష‌కులు, మేథావులు చెపుతోన్న మాట‌. రెండేళ్ల‌లో అమ‌రావ‌తిలో ఇటు పుల్ల అటు వేయ‌లేదు. ఇక జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల క‌ల కూడా ఇప్ప‌ట్లో Jagan Mohan Reddy{#}High court;CBN;Capital;Amaravathi;Andhra Pradeshమూడు రాజధానులపై జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టేనా ?మూడు రాజధానులపై జ‌గ‌న్ చేతులెత్తేసిన‌ట్టేనా ?Jagan Mohan Reddy{#}High court;CBN;Capital;Amaravathi;Andhra PradeshMon, 28 Jun 2021 10:30:00 GMTఏపీ రాజ‌ధానిగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని ఫిక్స్ చేసింది. చంద్ర‌బాబు అమ‌రావ‌తి విష‌యంలో కొంత వ‌ర‌కు గ్రాఫిక్ జిమ్మిక్కులు చేసినా చాలా వర‌కు అభివృద్ధి చేశారు. స‌చివాల‌య నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, కొన్ని శాఖ‌ల‌కు భ‌వ‌నాలు నిర్మించ‌డం లాంటి విష‌యాల్లో ఆయ‌న కొంత వ‌ర‌కు క‌ష్ట‌ప‌డ‌డంతో పాటు వారికి ఓ రూపు రేఖ‌లు తెచ్చారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏపీకి ఒక్క అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధాని కాద‌ని.. మూడు రాజ‌ధానులు ఉంటాయ‌ని చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత అస‌లు ఏపీ రాజ‌ధాని ఏంటి ? అనే విష‌యంలో పెద్ద గంద‌ర‌గోళం నెల‌కొంది.

నిజానికి 2014లో చంద్రబాబు అమరావతి ప్రాంతం ఏపీకి రాజధాని అని ప్రకటించినపుడు నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్‌ ఏ మాత్రం సందేహించకుండా మద్దతు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే మాట మార్చేశారు. జ‌గ‌న్ అమ‌రావ‌తి అభివృద్ధిని అదే స్పీడ్ తో ఈ రెండేళ్ల‌లో మ‌రి కాస్త ముందుకు తీసుకుని వెళ్లి ఉంటే అమ‌రావ‌తి రూపురేఖ‌లు మ‌రింత మారిపోయేవ‌ని విశ్లేష‌కులు, మేథావులు చెపుతోన్న మాట‌. రెండేళ్ల‌లో అమ‌రావ‌తిలో ఇటు పుల్ల అటు వేయ‌లేదు. ఇక జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల క‌ల కూడా ఇప్ప‌ట్లో నెర‌వేరేలా లేదు. ఆయ‌న విశాఖ‌కు రాజ‌ధానిని త‌ర‌లించుకుని వెళ్ల‌డం అనే తంతు యేడాది కాలంగా న‌డుస్తూనే ఉంది.

అస‌లు స‌చివాల‌య ఉద్యోగులు కూడా విశాఖ‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అమ‌రావ‌తి శాశ్వ‌త రాజ‌ధానిగా భావించిన ఉద్యోగుల్లో చాలా మంది అప్పులు చేసి మ‌రీ ప్లాట్లు, బిల్డింగులు కొనుక్కున్నారు. ఇప్పుడు వారి ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారిపోయింది. ఇక మూడు రాజ‌ధానుల అంశంపై అనేక విష‌యాలు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఓ కొలిక్కి వ‌చ్చే ట‌ప్ప‌ట‌కీ అవ్వాల్సిన పుణ్య కాలం కాస్తా అయిపోతుంది. ఏదేమైనా ఈ మూడేళ్లు ముగిసే స‌రికి కూడా మూడు రాజ‌ధానుల అంశం కొలిక్కి వ‌చ్చే ఛాన్సే లేదు.



ఈ ఒక్క ఇష్యూతో ఏపీలో లోకేష్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిందే..!

జ‌గ‌న్ రైట్ హ్యాండ్‌ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే... !

జగన్ పై మాటల తూటాలు.. మౌనం వీడని వైసీపీ నేతలు..

జ‌గ‌న్‌పై రెడ్ల‌లో కుత‌కుత‌.. మావాడే మాకు మైన‌స్ ?

జ‌గ‌న్‌పై సీమ రెడ్ల‌లో అస‌హ‌నం.. కుత‌కుతే..!

కేసీఆర్ సింగిల్ బుల్లెట్‌తో ష‌ర్మిల‌, బీజేపీ, కాంగ్రెస్ విల‌విలా...!

ఢాకాలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి... !

స్మరణ: పలువురు సీఎంలు సంతాపం తెలిపిన ప్రముఖ కమెడియన్..

స్టార్ హీరోల ఫ్యాన్స్ కు ఇక పండుగే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>