PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pv-naraisimaha-rao-education067478f5-0bce-4491-9505-88c6f6e8ce82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pv-naraisimaha-rao-education067478f5-0bce-4491-9505-88c6f6e8ce82-415x250-IndiaHerald.jpgనేడు పాముల పర్తి వెంకట నరసింహారావు జయంతి. భారత ప్రధాని పదవిని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంస్కరణలు చేపట్టి గొప్ప ప్రధానిగా కీర్తికెక్కారు. అపరమేధావిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించున్నారు. pv naraisimaha rao education{#}vidya;Warangal;Congress;mandalam;Prime Minister;Degree;Parents;Karimnagar;Maha;P V Narasimha Rao;Juneపి.వి నరసింహారావుకు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి..!పి.వి నరసింహారావుకు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి..!pv naraisimaha rao education{#}vidya;Warangal;Congress;mandalam;Prime Minister;Degree;Parents;Karimnagar;Maha;P V Narasimha Rao;JuneMon, 28 Jun 2021 07:38:50 GMTపి.వి నరసింహారావు. పూర్తి పేరు పాముల పర్తి వెంకటనరసింహారావు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన తొలి తెలుగువాడు, దక్షిణాదిత్యుడు. కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తన ప్రతిభతో దారికి తీసుకొచ్చిన మహా మేధావి. అంతేకాదు ఐదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా నడిపిన గొప్ప వ్యక్తి. మృదు స్వభావం కలిగిన ఆయన తొమ్మిది భారతీయ భాషలతో పాటు.. ఎనిమిది విదేశీ భాషలను అనర్గళంగా మాట్లాడగల ప్రతిభావంతుడు. ఇలా పి.వి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నేడు పి.వి నరసింహారావు జయంతి.

పి.వి నరసింహారావు తల్లిదండ్రులు రుక్నాబాయి-సితారామారావు. ఈ దంపతులకు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921వ సంవత్సరం జూన్ 28వ తేదీన జన్మించారు. ఆయన మూడేళ్ల వయసులో ఉండగా.. ఆయన్ను కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకున్నారు. ఆ విధంగా పాములపర్తి వెంకట నరసింహారావు గా పిలువబడ్డారు.

పి.వి నరసింహారావు ప్రాథమిక విద్య వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పూర్తయింది. 1938వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్శిటీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందేమాతర గేయాన్ని ఆలపించారు. దీంతో ఆయన్ను ఉస్మానియా యూనివర్శిటీ నుంచి బహిష్కరించారు. తర్వాత ఒక స్నేహితుడి సహకారంతో 1940 నుండి 1944వరకు నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. ఆ సమయంలో తన మిత్రుడు తన ఇంట్లోనే పి.వికి ఆశ్రయం కల్పించారు. అలా ఆయన విద్యాభ్యాసం సాగింది. అలా పి.వి నరసింహారావు విద్యార్థి దశలో ఉన్నప్పుడే విప్లవ భావాలు కలిగిన వ్యక్తిగా నిలిచాడు. దేశభక్తి భావాలు మెండుగా ఉన్న గొప్పవాడు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో నిజాం ప్రభుత్వంపై.. ఆనాడు ఆయన ప్రదర్శించిన వ్యతిరేఖ భావం వార్తల్లో నిలిచింది. అలా ఆయన అందరి ధృష్టిలో పడ్డారు.



 



నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు.. టైమ్ ఇదే.. !

కేసీఆర్ సింగిల్ బుల్లెట్‌తో ష‌ర్మిల‌, బీజేపీ, కాంగ్రెస్ విల‌విలా...!

రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే నష్టం ఎవరికి..?

ఎక్కడ పెంచాలో కాదు.. ఎక్కడ తగ్గించాలో తెలిసినవాడు శర్వానంద్..!

ప్రధాని అత్యవసర క్యాబినెట్ భేటీ..వీటి పైనే చర్చ.. !

స్మరణ: పలువురు సీఎంలు సంతాపం తెలిపిన ప్రముఖ కమెడియన్..

ICAI Exams : సుప్రీం ఏం చెప్పనుంది?

కాంగ్రెస్ మొత్తానికి రిస్క్ చేస్తోంది. రొటీన్ నుంచి వెరైటీ వైపుగా సాగుతోంది. కొత్త వైపుగా సాగుతోంది. పాత లెక్కలు, రోత పుట్టించే సమీకరణలకు దూరంగా జరుగుతోంది. శతాధిక వృద్ధ పార్టీ ఈ విధంగా ఆలోచించడం ఇపుడు అవసరం. లేకపోతే మరింతగా దెబ్బ తింటుంది.

ఏపీ లోనూ కాంగ్రెస్ ఆపరేషన్ ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>