MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush1f2ae592-9fbc-4fc6-b486-8cddf47829ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush1f2ae592-9fbc-4fc6-b486-8cddf47829ed-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా మూవీస్ చేస్తున్నారు. ఆయన సినిమాల కోసం ఓ వైపు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల కాలం వృధా అయింది. దాంతో ఈసారి కచ్చితంగా వరసపెట్టి సినిమాలు తన నుంచి వస్తూనే ఉంటాయని ప్రభాస్ అంటున్నాడు. adipurush{#}Okkadu;kriti sanon;Coronavirus;bollywood;Prabhas;India;Director;Heroine;Cinemaఆదిపురుష్ లో భారీ మిస్టేక్ చేస్తున్న ఓం రౌత్.... ?ఆదిపురుష్ లో భారీ మిస్టేక్ చేస్తున్న ఓం రౌత్.... ?adipurush{#}Okkadu;kriti sanon;Coronavirus;bollywood;Prabhas;India;Director;Heroine;CinemaMon, 28 Jun 2021 20:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా మూవీస్ చేస్తున్నారు. ఆయన సినిమాల కోసం ఓ వైపు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల కాలం వృధా అయింది. దాంతో ఈసారి కచ్చితంగా వరసపెట్టి సినిమాలు తన నుంచి వస్తూనే ఉంటాయని ప్రభాస్ అంటున్నాడు.

దానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేస్తున్నారు. అందులో ఆదిపురుష్ సినిమా ఒకటి. ఈ పాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్ అద్భుతమైన పాత్ర చేస్తున్నారు. ఇక సీతగా కృతిసనన్ నటిస్తోంది. రావణాసురుడిగా సైఫ్ ఆలీఖాన్ ని తీసుకున్నారు. ఇక హనుమంతుడుగా మరాఠీ నటుడు దేవతద్ద నాగెను ఎంపిక చేశారు అంటున్నారు.

దీంతో ఒక్క ప్రభాస్ తప్ప మొత్తం కీలకమైన పాత్రలు అన్నింటికీ ఉత్తరాది వారినే ఎంపిక చేయడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం కలుగుతోంది. పాన్ ఇండియా మూవీగా ఇది ఉంది. మరి సౌత్ లో ఆదిపురుష్ ఆడాలి అంటే కచ్చితంగా ఇక్కడ నుంచి కూడా కొందరికి చాన్స్ ఇవ్వాలి కదా. కేవలం ప్రభాస్ ఉంటే సరిపోదు కదా. కానీ డైరెక్టర్ ఓం రౌత్ మాత్రం కంప్లీట్ నార్త్ మూవీగా ఆదిపురుష్ ని మార్చేశారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ సీత కృతి సనన్ టాలీవుడ్ లో  నటించినా  కూడా రెండు మూవీస్ ఫ్లాప్ కిందనే లెక్క. దాంతో ప్రభాస్ ని చూస్తే సౌత్ ఈ మూవీకి అట్రాక్ట్ కావాలి. మరి పాన్ ఇండియా మూవీ అంటే సౌత్ నార్త్ ఆర్టిస్టులు కనిపించాలిగా. బహుశా ఈ లెక్కలు ఏవీ ఓం రౌత్ కి పట్టవేమో.  మరి ఆదిపురుష్ లో ప్రభాస్ ఒక్కడు చాలు. పైగా శ్రీరాముడు. ఆయనే మొత్తం అంతా నడిపిస్తారు అని ఓం రౌత్ కి గట్టి నమ్మకం ఉండి ఉంటుంది. ఏది ఏమైనా తాను ఒక్కడు తప్ప‌ మొత్తం నార్త్ కాస్టింగ్ తో ప్రభాస్ చేయడం కూడా కొత్త అనుభవమే.






ఆ ఇద్దరు నాతో రొమాన్స్ చేసేందుకు భయపడ్డారు : తాప్సీ

'ఆచార్య' నుంచి మరో సర్ ప్రైజ్.. ఈసారి చరణ్ వంతు..?

రవితేజ మూవీ @ 8 ఏళ్లు..

'స్వర్ణాల' దీపిక... మహేష్ ఆసక్తికర ట్వీట్!

యూపీ ఎలక్షన్స్ : ఎఐఐఎంఐఎం ఎం కీలక ప్రకటన

తమిళ్ లో మరో క్రేజీ కాంబినేషన్... ఇక తగ్గేదేలే ...

చిరు కోసం తమన్ : రచ్చ రంబోలా స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా మూవీస్ చేస్తున్నారు. ఆయన సినిమాల కోసం ఓ వైపు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల కాలం వృధా అయింది. దాంతో ఈసారి కచ్చితంగా వరసపెట్టి సినిమాలు తన నుంచి వస్తూనే ఉంటాయని ప్రభాస్ అంటున్నాడు.

ఎడ్యుకేషన్ : ఆ రెండు తరగతులకు మాత్రం ఆగస్టు నుంచి ఆన్లైన్ క్లాసులు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>