MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/spbddd3c714-ee8b-462b-835d-e2e9292dd39f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/spbddd3c714-ee8b-462b-835d-e2e9292dd39f-415x250-IndiaHerald.jpgఎస్పీ బాలు సినీ సీమలో తిరుగులేని గాయకుడు. అది అందరికీ తెలుసు. ఆయన అయిదున్నర దశాబ్దాల పాటు సినీ సంగీత సీమను శాసించారు. నలభై వేల పై చిలుకు పాటలను పాడారు. దేశంలో అన్ని భాషల్లోనూ పాడిన గాయకుడిగా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు. spb{#}Mohammed Rafiబాలూకి రఫీతో పాడే చాన్స్ అలా మిస్... ?బాలూకి రఫీతో పాడే చాన్స్ అలా మిస్... ?spb{#}Mohammed RafiSun, 27 Jun 2021 19:03:34 GMTఎస్పీ బాలు సినీ సీమలో తిరుగులేని గాయకుడు. అది అందరికీ తెలుసు. ఆయన అయిదున్నర దశాబ్దాల పాటు సినీ సంగీత సీమను శాసించారు. నలభై వేల పై చిలుకు పాటలను పాడారు. దేశంలో అన్ని భాషల్లోనూ పాడిన గాయకుడిగా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు.

అటువంటి బాలూకి ఆరాధ్య దైవం ఉన్నారు. ఆయనే అలనాటి బాలీవుడ్ సింగర్ మహమ్మద్ రఫీ. ఆయన గొంతు పాడే విధానం అంటే బాలూకి ప్రాణం. తన జీవితంలో మహమ్మద్ రఫీని కలుసుకోగలనా అని బాలూ అనుకునేవారుట. బాలూ గాయకుడిగా ఎంటరైన తరువాత డెబ్బై దశకంలో బిజీగా మారిపోయారు. అదే టైమ్ లో మహమ్మద్ రఫీ గాయకుడిగా  కొంత తగ్గారు. బాలీవుడ్ లో కిశోర్ కుమార్ పాటలు ఎక్కువగా పాడుతూ వచ్చారు.

ఈ టైంలొ సెలెక్టివ్ గా రఫీ పాటలు పాడేవారు. ఇదిలా ఉంటే   రఫీ తెలుగులో కూడా కొన్ని సినిమాలకు పాడారు. అప్పట్లో ఎన్టీయార్ తన సినిమాలకు ఆయన చేత పాడించుకున్నారు. అలా ఒకసారి మద్రాస్ లోని ఒక రికార్డింగ్ స్టూడియో లో రఫీ పాట పాడుతూండగా బాలూ కూడా ఆ పక్కనే మరో థియేటర్ లో పాట పాడుతున్నారు. తన పక్క థియేటర్ లోనే రఫీ ఉన్నారని తెలిసి బాబు షాక్ తిన్నారుట. వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళకు దండం పెట్టి వచ్చారుట.

ఆ రోజు రఫీ మాధవపెద్ది రమేష్ అనే తెలుగు గాయకుడితో కలసి యుగళ గీతం ఆలపిస్తున్నారు. అది రామ్ రహీం మూవీ. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఆ సినిమాలో బాలూ కూడా పాడారు. కానీ ఈ పాట చాన్స్ మాత్రం బాలూకి దక్కలేదు. దానికి కారణం ఆ మూవీలో బాలయ్యకు మాధవపెద్ది రమేష్ పాడారు. హరిక్రిష్ణకు రఫీ పాడారు. బాలయ్యకు మొదట్లో అన్ని పాటలూ రమేష్ పాడేవారు. అలా ఆ పాట చాన్స్ బాలూకి మిస్ అయ్యింది. మొత్తానికి తనకు రఫీతో కలసి పాడే చాన్స్ రాలేదని బాలూ బాధపడిన సందర్భం ఇదేనట.








ఎస్పీ బాలు సినీ సీమలో తిరుగులేని గాయకుడు. అది అందరికీ తెలుసు. ఆయన అయిదున్నర దశాబ్దాల పాటు సినీ సంగీత సీమను శాసించారు. నలభై వేల పై చిలుకు పాటలను పాడారు. దేశంలో అన్ని భాషల్లోనూ పాడిన గాయకుడిగా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>