MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreya-823d0bcc-562a-4474-8873-579647ac1909-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreya-823d0bcc-562a-4474-8873-579647ac1909-415x250-IndiaHerald.jpgశ్రేయ శరణ్ అసలు పేరు శ్రేయ శరన్ భట్నాగర్. ఈమె 1982 సెప్టెంబర్ 11వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని హరిద్వార్ లో జన్మించింది. ఇక ఆమె తల్లి కెమిస్ట్రీ టీచర్ గా పని చేస్తున్నప్పుడు, తన తల్లి దగ్గరే ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న లేడీ శ్రీరామ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ సాహిత్యంలో డిగ్రీ పట్టా అందుకుంది. శ్రేయ నృత్యకారిణి కూడా.. పలు నృత్య బృందాలలో నృత్య ప్రదర్శనలు కూడా చేసింది. మొదటిసారిగా 2001లో వచ్చిన ఇష్టం సినిమా ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ సినిమాలోSREYA {#}sharan;Hardwar;dance;september;March;INTERNATIONAL;Degree;Akkineni Nagarjuna;Hollywood;Indian;sriram;Santosham;Ishtam;Hindi;Cricket;Tamil;Teluguపెళ్లి తర్వాత గ్లామర్ క్వీన్ గా మారిన శ్రేయ..పెళ్లి తర్వాత గ్లామర్ క్వీన్ గా మారిన శ్రేయ..SREYA {#}sharan;Hardwar;dance;september;March;INTERNATIONAL;Degree;Akkineni Nagarjuna;Hollywood;Indian;sriram;Santosham;Ishtam;Hindi;Cricket;Tamil;TeluguSun, 27 Jun 2021 17:00:00 GMT
శ్రేయ శరణ్ అసలు పేరు శ్రేయ శరన్ భట్నాగర్. ఈమె 1982 సెప్టెంబర్ 11వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని  హరిద్వార్ లో  జన్మించింది. ఇక ఆమె తల్లి కెమిస్ట్రీ టీచర్ గా పని చేస్తున్నప్పుడు, తన తల్లి దగ్గరే  ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న లేడీ శ్రీరామ్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ సాహిత్యంలో డిగ్రీ పట్టా అందుకుంది. శ్రేయ నృత్యకారిణి కూడా.. పలు నృత్య బృందాలలో నృత్య ప్రదర్శనలు కూడా చేసింది. మొదటిసారిగా  2001లో వచ్చిన ఇష్టం సినిమా ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన చరణ్ మరణించడం కూడా జరిగింది.
ఇక ఈ సినిమాతో మంచి ఆఫర్ ను అందుకున్న శ్రేయ , ఆ తర్వాత 2002లో నాగార్జున నటించిన సంతోషం సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిన ఈమె అతి తక్కువ కాలంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషలలో కలిపి మొత్తం 75 చిత్రాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2007లో అత్యధికంగా షేర్ వసూలు చేసిన తమిళ చిత్రం శివాజీలో కూడా నటించింది. అదే సంవత్సరం హిందీ లో అవరాపాన్ చిత్రంలో నటించి, తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు ఈమె హాలీవుడ్ లో కూడా నటించింది. అమెరికన్ -  ఇండియన్ కో ప్రొడక్షన్లో రూపొందించబడిన" ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్"  సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. అంతేకాదు పలు చిత్రాలలో నటించి, అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.
శ్రేయ తన సినీ జీవితంలో  వేశ్య పాత్రలో పవిత్ర, చంద్ర వంటి సినిమాలలో నటించి తన పారితోషికాన్ని కూడా మరింత పెంచేసింది. అంతేకాదు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ యొక్క మొదటి, రెండు సీజన్ లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. స్టార్ హీరోల సినిమాలలో ఐటెం సాంగ్ లో కూడా కనిపించింది. 2018 లో  రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్ ను మార్చి 12వ తేదీన వివాహం చేసుకుంది . ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న శ్రేయ , వివాహం తర్వాత కూడా వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి.





ముద్దు తెచ్చిన తంట.. ఆరోగ్యమంత్రి రాజీనామా..!

వింత టైటిల్స్ తో రాబోతున్న టాలీవుడ్ సినిమాలు

ఈ బాలీవుడ్ హీరోలు లు మళ్లీ సౌత్ నే నమ్ముకుంటున్నారు గా!!

బండెన‌క 'బండి' క‌ట్టి... పాద‌యాత్ర‌ల ''బండి'' క‌ట్టి!!

మ‌న భాష‌తోపాటు ఇత‌ర భాషా సంస్కృతుల‌ను కాపాడుదాం- ఉప‌రాష్ట్ర‌ప‌తి

మా ఎన్నిక‌ల్లో తెలంగాణ వాదం.. !

మరో రియల్ లైఫ్ కథతో వస్తున్న సూర్య..

వైరల్ : మైఖేల్ జాక్సన్ లాగే డాన్స్ ఇరగదీసాడు.. కాని చివరలో ట్విస్ట్?

జ‌మ్మూకో న్యాయం..? తెలుగు రాష్ట్రాల‌కో న్యాయ‌మా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>