PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kissing-brings-trouble-health-minister-resigns2526053d-7cb1-4278-948d-645fbcff9c09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kissing-brings-trouble-health-minister-resigns2526053d-7cb1-4278-948d-645fbcff9c09-415x250-IndiaHerald.jpgబ్రిటన్ ఆరోగ్య మంత్రి చిక్కుల్లో పడ్డారు. తన సహాయకురాలిని కౌగిలించుకొని.. ముద్దు పెట్టుకోవడంతో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఆ రాసలీలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. బ్రిటన్ అధ్యక్షుడు బోరిన్ జాన్సన్ క్షమించినా.. ప్రతిపక్షాలు ఆరోగ్యమంత్రి రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. దీంతో చేేసేదేం లేక హాంకాక్ తన పదవికి రాజీనామా చేశారు. britton health minister {#}contract;Letter;Prime Minister;Father;marriage;రాజీనామా;News;Minister;septemberముద్దు తెచ్చిన తంట.. ఆరోగ్యమంత్రి రాజీనామా..!ముద్దు తెచ్చిన తంట.. ఆరోగ్యమంత్రి రాజీనామా..!britton health minister {#}contract;Letter;Prime Minister;Father;marriage;రాజీనామా;News;Minister;septemberSun, 27 Jun 2021 17:07:10 GMTబ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ తన పదవికి రాజీనామా చేశారు. కారణం తన కార్యాలయంలోని ఒక సహాయకురాలిని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకోవడమే. ఇంకోసారి ఇలాంటి తప్పిదం జరుగదని ఆయన చేసిన విజ్ఞప్తిని బోరిస్ జాన్సన్ మన్నించారు కానీ ప్రతిపక్షాలు మాత్రం ఊరుకోలేదు. ఆరోగ్యమంత్రి సహాయకురాలికి ముద్దు పెట్టడంపై గందరగోళం సృష్టించాయి. హెల్త్ మినిస్టర్ రాజీనామా చేయాలని గట్టిగా పట్టుబట్టాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో బ్రిటన్ ఆరోగ్యమంత్రి మాట్ హాంకాక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్ ను ప్రధాని బోరిస్ జాన్సన్ కు సమర్పించారు.

42ఏళ్ల వయసున్న హాంకాక్ 15ఏళ్ల క్రితం మార్తను వివాహం చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. ఆక్స్ ఫర్డ్ విద్యాలయంలో తోటి విద్యార్థిగా ఉన్న హాంకాక్ ఒక మహిళను సహాయకురాలిగా నియమించుకున్నాడు. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకున్నట్టు సమాచారం ఉందని ఓ పత్రిక తెలిపింది. ఆమెకు హాంకాక్ ముద్దు పెట్టడం.. ఆ వ్యవహారం వివాదాస్పదం కావడంతో.. హాంకాక్ సహాయకురాలు తనకంటే ముందే రాజీనామా చేసినట్టు సమాచారం.  

హాంకాక్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆరోగ్యశాఖలో ఆమెకు నాన్-ఎగ్జిక్యూటివ్ హోదాను కట్టబెట్టారు. సెప్టెంబర్ నెలలో హాంకాక్ ఈ పని చేశారు. సంవత్సరం మొత్తం మీద 15 నుంచి 20 రోజులు మాత్రమే పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 15వేల పౌండ్ల జీతం కట్టబెట్టి ఆమెను హాంకాక్ నియమించుకున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

మ్యాట్ హంకాక్ స్థానంలో హెల్త్ మినిస్టర్ గా సాజిద్ జావేద్‌ను నియమిస్తారనే వార్తలు అక్కడ చక్కర్లు కొడుతున్నాయి. జావేద్ గతంలో రెండుసార్లు బ్రిటన్ మంత్రి వర్గంలో పనిచేశారు. ఆర్ధిక, హోం శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారనే పేరు ఆయనకుంది. మరోవైపు బ్రిటన్‌లో డెల్టా వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 35 వేలకుపైగా కేసులు  నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయడమేంటని బ్రిటన్ వాసులు అనుకుంటున్నారు.



ఆ పార్టీ ఎవ‌రికోసం ప‌నిచేస్తుందో అంద‌రికీ తెలుసు?

పెళ్లి తర్వాత గ్లామర్ క్వీన్ గా మారిన శ్రేయ..

కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...జ‌న్మ‌లో కూడా...?

14 ఏళ్ల బాలుడు చేసిన కొంటె పని.. పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది?

గదిలో మూత్రం పోసాడని తిట్టిన మహిళ.. చివరికి ఆ వ్యక్తి ఏం చేసాడో తెలుసా?

అభిమానులు డిమాండ్ చేస్తున్న తెలుగు సినిమాల పార్ట్ 2

టిఆర్ఎస్ హుజురాబాద్ లో చేస్తున్న రహస్య సర్వేలో ఏం తేలింది..?

లిప్ లాక్ ఎఫెక్ట్.. చివరికి మంత్రి పోయింది?

రానా సినిమాకి రిలీజ్ టెన్షన్.. టెంప్ట్ అవుతారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>