PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/scull-history-0fa6c01d-7723-4959-a307-0e5d88119748-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/scull-history-0fa6c01d-7723-4959-a307-0e5d88119748-415x250-IndiaHerald.jpgచైనాలో అరుదైన పుర్రె ఆసక్తి రేపుతోంది. ఆ పుర్రె గల వ్యక్తిని డ్రాగన్ మ్యాన్ గా పిలుస్తున్నారు. దాదాపు లక్షన్నర సంవత్సరాల క్రితం ఈ జాతి నివసించినట్టు చెబుతున్నారు. ఈ పుర్రెను అరుదైనదిగా చెబుతున్నారు. scull history {#}Tibet;Eastఆసక్తి రేపుతున్న పుర్రె చరిత్ర..!ఆసక్తి రేపుతున్న పుర్రె చరిత్ర..!scull history {#}Tibet;EastSun, 27 Jun 2021 11:51:29 GMTచైనాలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. చైనా శాస్త్రవేత్తలు ఒక కొత్త మానవ జాతికి చెందిన ప్రాచీన పుర్రెను గుర్తించారు. అప్పటి మానవ జాతులైన నియాండెర్తాల్స్, హోమో ఎరెక్టస్ తో ఈ పుర్రెకు దగ్గర సంబంధాలున్నట్టు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఈ పుర్రె గల మనిషిని డ్రాగన్ మ్యాన్ గా సంభోదిస్తున్నారు. లక్షా 46వేల ఏళ్ల క్రితానికి చెందిన స్కల్ గా భావిస్తున్నారు. తూర్పు ఆసియాలో ఈ జాతి నివసించినట్టు చెబుతున్నారు.

ఈ పుర్రె ఈశాన్య చైనాలోని  హెర్బిన్ లో 1933లో బయటపడగా.. ఈ మధ్యనే అది శాస్త్రవేత్తల పరిశోధనలకు వచ్చింది. ఇప్పటి వరకు బయటపడిన పురాతన అవశేషాల్లో ఇది చాలా ఆసక్తికరమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పుర్రెజాతి నుండి మానవుడు డెవలెప్ కాలేదనీ.. కానీ తూర్పుఆసియాలో డ్రాగన్ మ్యాన్ జాతి లక్షల ఏళ్లు జీవించినట్టు చెబుతున్నారు. తర్వాత కాలక్రమేణా అంతరించిపోయినట్టు వివరించారు.

కొత్తగా ఈ జాతికి హోమో లాంజ అని పేరు పెట్టారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ జాతి పుర్రె చెక్కుచెదరకుండా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇతర మానవ జాతులతో పోలిస్తే ఈ పుర్రె.. సైజులో కొంచెం పెద్దదిగా ఉంది. ఈ పుర్రెను గమనిస్తే.. పెద్ద కళ్లు, దట్టమైన కనుబొమ్మలు.. పెద్ద సైజులో నోరు.. దంతాలు ఉండేవని తెలుస్తోంది. ఇది ఒక అరుదైన పుర్రె అంటున్నారు శాస్త్రవేత్తలు. గతంలో ఇలాంటి అరుదైన పుర్రె టిబెట్ లో దొరికింది. అది కూడా ఏ మానవ జాతికి చెందనిదిగా పరిశోధకులు గుర్తించారు. అయితే టిబెట్ లో దొరికిన దవడ ఎముకకు.. డ్రాగన్ మ్యాన్ కు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. ఈ పుర్రెపై మరిన్ని పరిశోధనలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటున్నారు. ఏది ఏమైనా ఈ పుర్రె ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.





నేడు లద్ధాక్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి.. !

వైసీపీలో ఆ రెండు కులాలు ర‌గులుతున్నాయా ?

నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>