MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nayanatara-bollywooda7962202-585d-4213-b709-19ece5f7fc60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nayanatara-bollywooda7962202-585d-4213-b709-19ece5f7fc60-415x250-IndiaHerald.jpgలేడీ సూపర్ స్టార్ నయనతార కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమయింది. అక్కడ షారుఖ్ ఖాన్ తో జతకడుతోంది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అక్కడ సినిమా చిత్రీకరణ మొదలు కాబోతోంది. అయితే ఆమె అక్కడికి వెళితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న సందేహం దక్షిణాది అభిమానుల్లో నెలకొంది. nayanatara bollywood{#}atlee kumar;nayana harshita;nayantara;Shahrukh Khan;Kollywood;bollywood;Tamil;BEAUTY;Success;Heroine;Cinemaనయనతార ఒప్పుకుంది కానీ.. తర్వాత ఏం జరుగుతుందో..!నయనతార ఒప్పుకుంది కానీ.. తర్వాత ఏం జరుగుతుందో..!nayanatara bollywood{#}atlee kumar;nayana harshita;nayantara;Shahrukh Khan;Kollywood;bollywood;Tamil;BEAUTY;Success;Heroine;CinemaSun, 27 Jun 2021 13:07:42 GMTనయనతార ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆమె బాలీవుడ్ కు రావాలని ఎంత మంది ప్రయత్నాలు చేసినా నో చెప్పింది. ఇక్కడే ఉండి తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలు చేసుకుంటూ సినీ జీవితం గడిపేసింది. అది నిన్నటి వరకు.. కానీ ఇప్పుడు మాత్రం నయనతార మనసు మార్చుకుంది. ఒక తమిళ దర్శకుడు ఆమె నచ్చజెప్పి బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కిస్తున్నాడు.

అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కు వెళుతున్న ఆ భామ.. షారుఖ్ ఖాన్ సరసన నటిస్తోంది. దీనికే నయనను ఒప్పించేందుకు అట్లీ చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు సక్సెస్ సాధించి.. షారుఖ్ ఖాన్, నయనతో సినిమా చేస్తున్నాడు.  నయనతార బాలీవుడ్ కు వెళ్లడం బాగానే ఉంది కానీ.. ఇక్కడ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఆమె అభిమానుల్లో మెదలాడుతోంది. కోలీవుడ్ లో నయనతార హవా కొనసాగుతున్న సమయం ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే సందేహం నెలకొంది. వరుస అవకాశాలతో యంగ్ హీరోయిన్ లకు గట్టి పోటీ ఇచ్చి తన ప్రతిభను చాటింది.. ఇపుడు ఈ లేడీ సూపర్ స్టార్ అక్కడికి వెళితే.. కుర్రహీరోయిన్ లకు మంచి ఛాన్స్ దొరికినట్టవుతుంది. స్టార్ హీరోయిన్ ప్లేస్ కొట్టేసేందుకు వారికి అవకాశం లేకపోలేదు.

మరోవైపు నయనతార రెమ్యునరేషన్ కూడా బాగా తీసుకుంటుంది. నిర్మాతలు ఈమెను తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో చెల్లించాలి. కానీ ఈ సీనియర్ బ్యూటీ బాలీవుడ్ కు వెళ్లడం ద్వారా కుర్రహీరోయిన్ లకు డిమాండ్ పెరుగుతుంది. కాకపోతే ఐదు పదులకు పైగా వయసున్న హీరోల సరసన నటించేందుకు నయనకు మంచి అవకాశాలున్నాయి.. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటోంది ఈ భామ. అయితే కుర్ర హీరోయిన్లు సీనియర్ హీరోల సరసన అంతగా సెట్ కారనే వాదన ఉంది. సౌత్ హీరోయిన్ లు బాలీవుడ్ లో తమ ప్రతిభ చాటుతుండటంతో ఉత్తరాదిన సత్తా చాటేందుకు ఇదే సరైన సమయమని నయనతార భావిస్తోంది. ప్రస్తుతం ఈ లేడీ సూపర్ స్టార్ తమిళంలో మూడు, తెలుగులో ఓ చిత్రంలో నటిస్తోంది.




బాలీవుడ్ కు వెళుతున్న నయనతార, అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తో జతకట్టనున్న నయన, దక్షిణాదిన సినిమా అవకాశాలపై అనుమానాలు

రామ్ పోతినేని, రామ్ చరణ్ ల సినిమా లకు ఈ మెలికలేంటి గురూ..!!

ఆ సినిమాలు ఇక థియేటర్ కి రావట ?

బుల్లిపిట్ట: పీఎఫ్ మనీ విత్ డ్రా చేయడం ఎలా..?

భద్ర చిత్రంలో రవితేజ మరదలు ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

థియేటర్ వద్దు డిజిటల్ ముద్దంటున్న సురేష్ బాబు?

నాన్న గారే ఆదర్శం.."మా"కు సేవ చేయడమే లక్ష్యం : మంచు విష్ణు

టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల రెమ్యునరేషన్ ఇవే!

'నారప్ప' డైరెక్ట్ ఒటీటీ రిలీజ్.. ఎప్పుడంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>