MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tagb26b5061-8ea5-47fd-8f43-23515efc3cbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tagb26b5061-8ea5-47fd-8f43-23515efc3cbd-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వ‌ర్గం తెలివిగా పావులు క‌దుపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ మా ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఐదుగురు అధ్య‌క్షులు పోటీప‌డుతుండ‌టంతో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ‌కు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌ప్పుడు ఉండే వాతావ‌ర‌ణంక‌న్నా ఎక్కువ వేడి ఈ ఎన్నిక‌ల్లో క‌న‌ప‌డుతుండ‌టం విచిత్రం. అంత‌టి రాజ‌కీయాలు, అంత‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని వాతావ‌ర‌ణం రాజ‌కీయ రంగు పులుముకుంది. ప్ర‌కాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవtag{#}vishnu;Chiranjeevi;raj;jeevitha rajaseskhar;Cinema;Assembly;mediaమెగా క్యాంప్ "మెగా" రాజ‌కీయం?మెగా క్యాంప్ "మెగా" రాజ‌కీయం?tag{#}vishnu;Chiranjeevi;raj;jeevitha rajaseskhar;Cinema;Assembly;mediaSun, 27 Jun 2021 17:52:46 GMT
మెగాస్టార్ చిరంజీవి వ‌ర్గం తెలివిగా పావులు క‌దుపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ మా ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఐదుగురు అధ్య‌క్షులు పోటీప‌డుతుండ‌టంతో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ‌కు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌ప్పుడు ఉండే వాతావ‌ర‌ణంక‌న్నా ఎక్కువ వేడి ఈ ఎన్నిక‌ల్లో క‌న‌ప‌డుతుండ‌టం విచిత్రం. అంత‌టి రాజ‌కీయాలు, అంత‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని వాతావ‌ర‌ణం రాజ‌కీయ రంగు పులుముకుంది. ప్ర‌కాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత‌, హేమ‌, సీవీఎల్ న‌ర‌సింహారావు అధ్య‌క్ష స్థానాల‌కు పోటీప‌డుతున్నారు.

ప్ర‌కాష్‌రాజ్ వైపు ఫిరాయింపులు?
గ‌త ఎన్నిక‌ల్లో వీకే న‌రేష్‌కు చిరంజీవి వ‌ర్గం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఆ ప్యానెల్‌లో చిరంజీవి మ‌ద్ద‌తుదారులుకూడా ఉన్నారు. వారంతా చిరంజీవి ఎటువంటే అటువైపు వెళుతుంటారు. వారికి అధ్య‌క్షుడితో సంబంధం ఉండ‌దు. చిరంజీవి ఎటువైపు ఉంటే.. ఎవ‌రికి ఓటు వేయ‌మంటే అటు వేస్తారు. న‌రేష్ తాజాగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప్యానెల్‌లోనివారెవ‌రూ క‌న‌ప‌డ‌లేదు. వారంతా ప్ర‌కాష్ రాజ్ శిబిరంవైపు ఫిరాయించార‌ని క‌రాటే క‌ల్యాణి ఆరోపించారు. వీరంతా మెగా క్యాంప్‌న‌కు చెందిన‌వారే. అంటే ఈసారి చిరంజీవి మ‌ద్ద‌తు ప్ర‌కాష్‌రాజ్‌కేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఒక‌వైపు విష్ణుకు ఇవ్వాల‌ని ఉన్నా తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌కాష్ రాజ్‌వైపు మొగ్గుచూపుతుండ‌టంతో తాను కూడా అటువైపే నిల‌బ‌డ్డారు.

మీడియా స‌మావేశానికి జీవితా రాజ‌శేఖ‌ర్ గైర్హాజ‌రు
మీడియా స‌మావేశానికి జీవిత గైర్హాజ‌ర‌వ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. మంచు విష్ణుకు న‌రేష్ మ‌ద్ద‌తిస్తున్నారు కాబ‌ట్టి జీవిత రాలేద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విష్ణు కృష్ణ‌, కృష్ణంరాజులాంటివారిని ఇంటికి వెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు అడిగార‌ని, కానీ రాజ‌శేఖ‌ర్ సీనియ‌ర్ క‌థానాయ‌కుడైన‌ప్ప‌టికీ ఆయ‌న్ను ఫోన్‌లో మ‌ద్ద‌తివ్వ‌మ‌ని కోరిన‌ట్లు తెలుస్తోంది. దీంతో నొచ్చుకున్న రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తులు మీడియా స‌మావేశానికి రాలేద‌ని తెలుస్తోంది. సీవీఎల్ న‌ర‌సింహారావు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. జీవిత కూడా స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీచేస్తారా?  విష్ణు ప్యానెల్‌లో ఉంటారా? అనేదానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.







చిక్కుల్లో విజయ్ కొత్త సినిమా?

ఐకాన్ చేతులు మారిందా.. హీరో బన్నీనే కాని వాళ్లు మాత్రం..!

అత్యధిక టిఆర్పీ సాధించిన తెలుగు సినిమాలు

ప్రకాష్ రాజ్ సరే.. మంచు విష్ణు కి అంత సీన్ ఉందా..?

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!!

మెగాస్టార్ చిరంజీవి వ‌ర్గం తెలివిగా పావులు క‌దుపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ మా ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఐదుగురు అధ్య‌క్షులు పోటీప‌డుతుండ‌టంతో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ‌కు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల‌ప్పుడు ఉండే వాతావ‌ర‌ణంక‌న్నా ఎక్కువ వేడి ఈ ఎన్నిక‌ల్లో క‌న‌ప‌డుతుండ‌టం విచిత్రం. అంత‌టి రాజ‌కీయాలు, అంత‌టి వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని వాతావ‌ర‌ణం రాజ‌కీయ రంగు పులుముకుంది. ప్ర‌కాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత‌, హేమ‌, సీవీఎల్ న‌ర‌సింహారావు అధ్య‌క్ష స్థానాల‌కు పోటీప‌డుతున్నారు.

యూపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తున్న‌ట్లు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి వెల్ల‌డించారు. మజ్లిస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటోందంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఆమె మండిప‌డ్డారు. ఈ ర‌క‌మైన మీడియా కథనాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఐఎంతో పొత్తు ప్ర‌సక్తే లేద‌ని తేల్చిచెప్పారు. బీఎస్పీ మజ్లిస్ తో పొత్తు పెట్టుకుంటోందంటూ ఓ చానెల్ ప్ర‌సారం చేస్తున్న వార్త‌ల్లో నిజం లేదు. అవన్నీ బూటకపు వార్తలేన‌ని, పంజాబ్ లో ఒంట‌రిగా ఎలా అయితే పోటీచేశామో.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లోను అలాగే పోటీచేస్తామ‌ని, ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోమ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆ పార్టీ ఎవ‌రికోసం ప‌నిచేస్తుందో అంద‌రికీ తెలుసు?

ఒకే బెడ్ పై ముగ్గురు మెగా హీరోలు.. కొన్ని మారవంటూ తేజ్ అలా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>