PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag254bb800-9714-43e4-9615-0dc2711385b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag254bb800-9714-43e4-9615-0dc2711385b6-415x250-IndiaHerald.jpg ఏపీ పుర‌పాల‌క‌శాఖ మంత్రి బొత్స ఢిల్లీలో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌స్తినాపురంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని, పూర్తి వివ‌రాలు వెల్ల‌డికాలేదంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రి బొత్స కూడా ఇంత‌వ‌ర‌కు ఖండించ‌లేదు. దీనిపైనే అంద‌రిలో ఇప్పుడు సందేహం క‌లుగుతోంది. అయితే ఇప్పుడు ఇదే విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. tag{#}BOTCHA SATYANARAYANA;Delhi;Congress;Father;Ministerబీజేపీతో ఏపీ మంత్రి ర‌హస్య చ‌ర్చ‌లు?బీజేపీతో ఏపీ మంత్రి ర‌హస్య చ‌ర్చ‌లు?tag{#}BOTCHA SATYANARAYANA;Delhi;Congress;Father;MinisterSun, 27 Jun 2021 12:28:00 GMT
ఏపీ పుర‌పాల‌క‌శాఖ మంత్రి బొత్స ఢిల్లీలో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌స్తినాపురంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని, పూర్తి వివ‌రాలు వెల్ల‌డికాలేదంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రి బొత్స కూడా ఇంత‌వ‌ర‌కు ఖండించ‌లేదు. దీనిపైనే అంద‌రిలో ఇప్పుడు సందేహం క‌లుగుతోంది. అయితే ఇప్పుడు ఇదే విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వెళ్లిన విష‌యం వాస్త‌వ‌మేనా?
మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఎవ‌ర్ని క‌లిశారు? ఏ విష‌యం చ‌ర్చించారు?  లేదంటే ఆయ‌న అస‌లు ఢిల్లీ వెళ్ల‌లేదా? మంత్రి ప‌ద‌వి కోసం పోటీలో ఉన్న‌వారు ఆయ‌న‌పై వ్య‌తిరేక ప్ర‌చార‌మేమైనా చేస్తున్నారా? అస‌లు జ‌రుగుతోంది ఏమిటి?  ముఖ్య‌మంత్రిపై తిరుగుబాటు చేయ‌డానికి ఎవ‌రైనా బొత్స‌ను ఉప‌యోగించుకుంటున్నారా? ఆ స‌త్తా బొత్స‌కు ఉందా? అనే ప్ర‌శ్న‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఒక‌వేళ తిరుగ‌బాటు జ‌రిగితే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఎంత‌మంది మ‌ద్ద‌తిస్తారు? ఏ పార్టీలు మ‌ద్ద‌తిస్తాయి?  లేదంటే బొత్స‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రి స‌న్నిహితులెవ‌రైనా ఈ ప్ర‌చారం చేయిస్తున్నారా?  త‌దిత‌ర విష‌యాల‌పై వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

మంత్రి ప‌ద‌వి ఉంటుందా?  తిరిగి కొన‌సాగుతారా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవ‌ర్గాల్లో మాత్రం బొత్స‌కు మంత్రి ప‌ద‌వి ఉండ‌ట‌మ‌నేది అనుమానంటూ చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో కూడా ఇదే ప్ర‌చారం ఉంది. ముఖ్య‌మంత్రి బొత్స‌కు ఎంతో విలువ ఇస్తారు? ఆయ‌న‌కు సీఎంపై తిరుగుబాటు చేయాల్సిన అవ‌స‌రం లేదు?  విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంత్రికి తెలియ‌కుండా ఏదీ జ‌ర‌గ‌దు? ఆయ‌న అన్నీ జ‌గ‌న్‌కు చెప్పే చేస్తార‌ని మంత్రి అనుయాయులు చెబుతున్నారు. కేబినెట్‌లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న బొత్స‌ను తొల‌గించాలా?  వేరేవారికి అవ‌కాశం ఇవ్వాలా? అనే విష‌యంలో ముఖ్య‌మంత్రి సందిగ్ధంలో ఉన్నార‌ని, ఎందుకంటే త‌న తండ్రి వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యం నుంచి ఆయ‌న జ‌గ‌న్‌కు కానీ, జ‌గ‌న్ ఆయ‌న‌కుకానీ ప‌ర‌స్ప‌ర స‌హాయ స‌హ‌కారాలందించుకున్నారు. కొద్దికాలం వేచిచూస్తేకానీ ఈ ప్ర‌చారాల‌కు, వార్త‌ల‌కు తెర‌ప‌డే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌టంలేదు.







తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్‌రెడ్డికి మొట్ట‌మొద‌టి స‌వాల్ సిద్ధంగా ఉంది. హుజూరాబాద్ ఎప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డం. ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌వుతూ వ‌స్తోన్న కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక క‌త్తిమీద సాములా మారింది. పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత వ‌స్తున్న ఎన్నిక కావ‌డంతో ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

రేవంత్‌కు స‌వాల్ విసురుతున్న హుజూరాబాద్‌?

టీ కాంగ్రెస్ ఇప్పటికైనా పోరాటం చేస్తుందా అన్నట్టు 7 ఏళ్లలో టైం పాస్ చేశారు..!

బీజేపీ నిర్ణ‌యాన్ని ధిక్క‌రించిన సీనియ‌ర్ నేత‌...ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి...?

ఒక మ‌హిళా మంత్రిపై ఆ జిల్లాకు చెందిన ఎస్పీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేయ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆ జిల్లా రాజ‌కీయ చైత‌న్యానికి పెట్టింది పేరు. ఆ మంత్రి చేస్తున్న సిఫార్సులు ఇబ్బందిక‌రంగా ఉన్నాయ‌ని, అలాగే ఎస్పీ అనికూడా చూడ‌కుండా అధికార జులుం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన‌బోతార‌ని తెలిసింది. అన్ని జిల్లాల్లో మంత్రుల మ‌ధ్య‌కానీ, పోలీసు ఉన్న‌తాధికారుల మ‌ధ్య‌కానీ స‌త్సంబంధాలే ఉన్నాయి. మ‌రి ఈ ఇద్ద‌రి విష‌యంలో ఏం జ‌రిగింద‌నేది ప్ర‌భుత్వ వ‌ర్గాల‌కు కూడా అంతుప‌ట్ట‌డంలేదు.

ముఖ్య‌మంత్రికి ఎస్పీ ఫిర్యాదు?

నాన్న గారే ఆదర్శం.."మా"కు సేవ చేయడమే లక్ష్యం : మంచు విష్ణు

కేసీఆర్‌, చంద్ర‌బాబు ప‌నైపోయిందా.. ఏపీ, తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయం ?

ఏపీ పుర‌పాల‌క‌శాఖ మంత్రి బొత్స ఢిల్లీలో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌స్తినాపురంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ పెద్ద‌ల‌తో స‌మావేశ‌మ‌య్యార‌ని, పూర్తి వివ‌రాలు వెల్ల‌డికాలేదంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రి బొత్స కూడా ఇంత‌వ‌ర‌కు ఖండించ‌లేదు. దీనిపైనే అంద‌రిలో ఇప్పుడు సందేహం క‌లుగుతోంది. అయితే ఇప్పుడు ఇదే విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ దృష్టికి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>