PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ నేత మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా నిన్ను పొద్దుపోయాక ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే రేవంత్ కు ప్రేమ పోటుగా మారేది తెలుగు తమ్ముళ్ళనే వాదన వినిపిస్తోంది.. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా తెలుగుదేశం శ్రేణులు రేవంత్ తమ మనిషి అనే భావన లోనే ఉంటాయి.. దానికి కారణం తెలుగుదేశం వీడి కాంగ్రెస్ లో చrevanth reddy{#}bhavana;Telugu Desam Party;prema;Telangana;MP;revanth;Revanth Reddy;Congress;Love;Andhra Pradesh;Party;Telugu;mediaరేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?రేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?revanth reddy{#}bhavana;Telugu Desam Party;prema;Telangana;MP;revanth;Revanth Reddy;Congress;Love;Andhra Pradesh;Party;Telugu;mediaSun, 27 Jun 2021 08:15:00 GMTకాంగ్రెస్ నేత మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా నిన్ను పొద్దుపోయాక ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను పీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే రేవంత్ కు ప్రేమ పోటుగా మారేది తెలుగు తమ్ముళ్ళనే వాదన వినిపిస్తోంది.. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా తెలుగుదేశం శ్రేణులు రేవంత్ తమ మనిషి అనే భావన లోనే ఉంటాయి.. దానికి కారణం తెలుగుదేశం వీడి కాంగ్రెస్ లో చేరుతున్నా ఎప్పుడూ రేవంత్ పార్టీని గానీ చంద్రబాబుని గానీ పల్లెత్తు మాట అనుకపోవడమే. 


తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు కాబట్టి మళ్ళీ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్ళాడు అనే సాఫ్ట్ కార్నర్ లో తెలుగుదేశం శ్రేణులు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డిని ఇప్పటికీ తెలుగుదేశం నేతలు గానీ తెలుగుదేశం కార్యకర్తలు గాని విమర్శించిన దాఖలాలు లేవు. తెలంగాణలో తెలుగుదేశం తరఫున కొద్ది మంది కార్యకర్తలు మాత్రమే ఉన్నా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్యకర్తలు సైతం రేవంత్ రెడ్డిని పొగుడుతూ రేవంత్ రెడ్డి టైగర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం రేవంత్ రెడ్డి కి చాలా మైనస్ అవుతాయి. 



ఇప్పుడు రేవంత్ ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. అదీగాక ఎమోషన్స్, సెంటిమెంట్ ఎక్కువగా భావించి తెలంగాణ రాష్ట్రానికి ఆయన కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ భావం అనేది నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది రేవంత్ ఫ్యాన్స్ గా ఉండడం అది తెలుగుదేశం తరుపున ఫ్యాన్స్ గా ఉండటం అనేది ఖచ్చితంగా మైనస్ గా భావించాల్సిన అంశం అనే చెప్పాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డిని, చంద్రబాబుని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలను కానీ విమర్శిస్తూ దూకుడుగా వెళ్లకపోతే వచ్చిన ఆ పీసీసీ చీఫ్ పదవి నిరుపయోగంగా మారే అవకాశం ఉంది.




రేవంత్ ను రవ్వంత చేసే కేసీఆర్ అస్త్రమిదేనా..?

రేవంత్ ముందు స‌వాళ్లు సీనియ‌ర్లేనా..?

ఆటో టీకా.. అదిరింది ఐడియా..

ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల ఆఫర్..!

రేవంత్ రూపంలో బాబోరి హవా ?

నేడు ప్రధాని మన్ కీ బాత్.. !

దేవి శ్రీ ప్రసాద్ ఈ బ్రేకప్ సాంగ్స్.. అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్..!

రికార్డు సృష్టించిన 'దిశ'..?

రష్మిక ఫ్యాన్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. ఎందుకంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>