MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sapthagiri-hero-new-movie6f41b4b6-69aa-4b0a-b97e-6ce34cf7323d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sapthagiri-hero-new-movie6f41b4b6-69aa-4b0a-b97e-6ce34cf7323d-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఇక సాధారణంగా హీరోలు, హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఎందుకంటే వారు సినీ ఇండస్ట్రీకి మెయిన్ రోల్ కాబట్టి. ఇక కమెడియన్ల విషయానికి వస్తే, నాటి నుంచి నేటి వరకు కొంతమంది సీనియర్ కమెడియన్స్ తమ స్థానాన్ని పదిలం చేసుకుంటే, మరికొంతమంది కమెడియన్లు హీరోలుగా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇక అలాంటి వారిలో కమెడియన్ సప్తగిరి కూడా ఒకరు. కమెడియన్ సప్తగిరి మొదట కమెడీయన్ గా తన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ తరువాత వరSAPTHAGIRI HERO NEW MOVIE{#}raghu kunche;saptagiri;Mini;Sangeetha;Thriller;Comedian;House;Kumaar;Heroine;Cinemaఈసారైనా కమెడియన్ సప్తగిరి హీరోగా రాణిస్తారా..?ఈసారైనా కమెడియన్ సప్తగిరి హీరోగా రాణిస్తారా..?SAPTHAGIRI HERO NEW MOVIE{#}raghu kunche;saptagiri;Mini;Sangeetha;Thriller;Comedian;House;Kumaar;Heroine;CinemaSun, 27 Jun 2021 10:30:00 GMT
సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.ఇక సాధారణంగా హీరోలు, హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఎందుకంటే వారు సినీ ఇండస్ట్రీకి మెయిన్ రోల్ కాబట్టి. ఇక కమెడియన్ల విషయానికి వస్తే, నాటి నుంచి నేటి వరకు కొంతమంది సీనియర్ కమెడియన్స్  తమ స్థానాన్ని పదిలం చేసుకుంటే, మరికొంతమంది కమెడియన్లు హీరోలుగా సినీ కెరీర్ ను  కొనసాగిస్తున్నారు. ఇక అలాంటి వారిలో కమెడియన్ సప్తగిరి కూడా ఒకరు. కమెడియన్ సప్తగిరి మొదట కమెడీయన్ గా తన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ తరువాత వరుస ఆఫర్లు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.


టైమింగ్ కి తగ్గ కామెడీతో ప్రేక్షకులను అలరించిన సప్తగిరి.. సప్తగిరి ఎక్స్ప్రెస్, వజ్రకవచధర గోవిందా, సప్తగిరి ఎల్ ఎల్ బి వంటి  సినిమాలలో హీరోగా నటించాడు. ఒకపక్క కమెడియన్ గా నటిస్తూనే మరోపక్క అవకాశాలు రావడంతో వాటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ, ముందడుగు వేస్తున్నాడు సప్తగిరి. అయితే ఇప్పుడు మరోసారి "ఏక్ మినీ కథ" ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి, మళ్లీ ఫామ్ లోకి  వచ్చాడు. ఇక ఇప్పటికే హౌస్ అరెస్ట్ అనే సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

 
ఇక అంతేకాకుండా " ఎయిట్" ది  త్రిభాషా ఇల్యూజన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇందులో" 90 ఎమ్ఎల్ " సినిమా హీరోయిన్ నేహా సోలంకి, సప్తగిరి సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇక ఈ చిత్రానికి కెఎం కుమార్ దర్శకత్వం వహించగా, ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో  ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచే విలన్ గా నటించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే సినిమా టైటిల్ ను విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమా హిట్ కొడితే సప్తగిరి మరొక కమర్షియల్ హిట్ కొట్టినట్టే..





షూటింగ్ వెళ్లాలంటేనే భయమేస్తుంది.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

అబ్బే.. సునీల్ మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడు.. సెట్ అవలే..!!

నా యాక్షన్ ప్లాన్ వేరే ఉంది.. !

జూనియర్ ప్రిపరేషన్ సెషన్ లో హాట్ టాపిక్ !

ఈ సంవత్సరం రహస్యంగా పెళ్లి చేసుకున్న 5 మంది భామలు వీళ్ళే..

టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్.. పూజా హెగ్దే రెమ్యునరేషన్ డబుల్ చేసిందా..?

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ల సినిమా పట్టాలెక్కేనా..!!

తండ్రి అంత్యక్రియలు చేశాడు.. కొడుకు మృతిచెందాడు..!

దళపతి విజయ్ తెలుగు సినిమా.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>