EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandra-babu-revanth-reddyd9f938f6-32c6-49e2-a7f0-9085820d18d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandra-babu-revanth-reddyd9f938f6-32c6-49e2-a7f0-9085820d18d7-415x250-IndiaHerald.jpgరేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కే కాంగ్రెస్‌లోకి వెళ్లార‌న్న టాక్ అప్ప‌ట్లోనే ఉంది. ఆ త‌ర్వాత కూడా అదే రేవంత్ - చంద్ర‌బాబు క‌లిసి చ‌ర్చించుకునే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప‌రిస్థితి. చంద్ర‌బాబు ఆ ఎన్నిక‌ల్లో మొత్తం రేవంత్ గైడెన్స్ లోనే ముందుకు వెళ్లారు. ఎలాగైనా కేసీఆర్‌ను గ‌ద్దె దింపాల‌నే క‌లిసి ప‌నిచేశారు. అయితే కేసీఆర్ మ‌ళ్లీ ఆంధ్రోళ్ల పాల‌న వ‌స్తుంద‌న్న సెంటిమెంట్ ర‌గిల్చేసి చంద్ర‌బాబును బూచీగా పెట్టుకుని మ‌రోసారి సులువుగా గెలిచేసి.. Chandra Babu Revanth Reddy{#}Kumaar;TDP;rahul;Rahul Sipligunj;Telangana;CBN;revanth;KCR;CM;mediaరేవంత్ రూపంలో బాబోరి హవా ?రేవంత్ రూపంలో బాబోరి హవా ?Chandra Babu Revanth Reddy{#}Kumaar;TDP;rahul;Rahul Sipligunj;Telangana;CBN;revanth;KCR;CM;mediaSun, 27 Jun 2021 08:04:00 GMTతెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా ఊరించి ఊరించి ఉత్కంఠ‌కు తెర‌దించుతూ ఎట్ట‌కేల‌కు రేవంత్ రెడ్డిని ఎంపిక చేసింది ఏఐసీసీ. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టి నుంచి ఎవ్వ‌రూ ఊహించ‌ని పేర్లు కూడా టీ పీసీసీ రేసులో తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఇక కేసీఆర్‌, టీఆర్ ఎస్ పై ఒంటికాలితో లేచే రేవంత్‌కే ఈ ప‌గ్గాలు క‌ట్ట‌బెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో ఎంతో మంది సీనియ‌ర్లు రేవంత్ కు టీ పీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పినా కూడా చివ‌ర‌కు రేవంత్‌కే ప‌ద‌వి ద‌క్కింది. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో కూడా రేవంత్ రూపంలో టీడీపీ అధ్య‌క్షుడు హ‌వా ఉంటుందా ? అన్న సందేహాలు రాజ‌కీయ , మీడియా వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కే కాంగ్రెస్‌లోకి వెళ్లార‌న్న టాక్ అప్ప‌ట్లోనే ఉంది. ఆ త‌ర్వాత కూడా అదే రేవంత్ - చంద్ర‌బాబు క‌లిసి చ‌ర్చించుకునే 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప‌రిస్థితి. చంద్ర‌బాబు ఆ ఎన్నిక‌ల్లో మొత్తం రేవంత్ గైడెన్స్ లోనే ముందుకు వెళ్లారు. ఎలాగైనా కేసీఆర్‌ను గ‌ద్దె దింపాల‌నే క‌లిసి ప‌నిచేశారు. అయితే కేసీఆర్ మ‌ళ్లీ ఆంధ్రోళ్ల పాల‌న వ‌స్తుంద‌న్న సెంటిమెంట్ ర‌గిల్చేసి చంద్ర‌బాబును బూచీగా పెట్టుకుని మ‌రోసారి సులువుగా గెలిచేసి.. తెలంగాణకు వ‌రుస‌గా రెండోసారి సీఎం అయ్యారు.

ఆ తర్వాత కూడా చంద్ర‌బాబు రాహుల్ గాంధీకి రేవంత్ కే టీ పీసీసీ ప‌ద‌వి ఇవ్వాల‌ని సిఫార్సు చేశారు కూడా.. !  అయితే ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో చంద్ర‌బాబును జాతీయ స్థాయిలో ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇక కేసీఆర్‌పై ఎలా రివేంజ్ తీర్చు కోవాలా ? అని ఉన్న చంద్ర‌బాబు ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్ రూపంలో తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌రోక్షంగా వేలు పెడ‌తార‌న్న చ‌ర్చ‌లు అయితే స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ‌లో రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఇక్క‌డ చంద్ర‌బాబుకు చిన్న ప‌నులు కూడా జ‌ర‌గ‌డం లేదు.

ఇక ఇప్పుడు రేవంత్ లాంటి త‌న ప్రియ‌శిష్యుడు రాజ‌కీయంగా ముందుకు వ‌స్తే... ఇక్క‌డ టీడీపీ కేడ‌ర్‌, త‌న అనుచ‌ర‌గ‌ణంతో మ‌రోసారి త‌న‌దైన పాత్ర పోషించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక తెలంగాణ‌లో బాబు సామాజిక వ‌ర్గం, టీడీపీ కేడ‌ర్ సైతం రేవంత్ కు టీ పీసీసీ రావ‌డాన్ని స్వాగ‌తిస్తూ సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తోంది.



రేవంత్ ను రవ్వంత చేసే కేసీఆర్ అస్త్రమిదేనా..?

రేవంత్ ముందు స‌వాళ్లు సీనియ‌ర్లేనా..?

రేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?

ఆటో టీకా.. అదిరింది ఐడియా..

రేవంత్‌కు ప‌ద‌వి.. తెలంగాణ‌లో బాబు చ‌క్రం తిప్పుతారా ?

ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల ఆఫర్..!

నేడు ప్రధాని మన్ కీ బాత్.. !

తెలంగాణలో నేడు అఖిలపక్ష భేటీ.. !

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేకు టీడీపీతోనే ఇబ్బందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>