PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp40d38c9a-744e-44ad-9bd9-9b788e964b2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp40d38c9a-744e-44ad-9bd9-9b788e964b2e-415x250-IndiaHerald.jpgపశ్చిమ గోదావరి జిల్లా...మొదట నుంచి టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లా. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు వెస్ట్‌లో సైకిల్ చిత్తు అయింది. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం రెండు చొట్లే గెలుచుకుంది. ఇక వైసీపీ 13 చోట్ల సత్తా చాటింది.tdp{#}WOMEN;Godavari River;Jagan;Chintamaneni Prabhakar;Assembly;MLA;D Ramanaidu;Cycle;Alla Ramakrishna Reddy;TDP;YCP;Eluru;Nimmala Ramanaiduవెస్ట్‌లో ‘సైకిల్‌’కు ఛాన్స్ ఇస్తున్న ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు...!వెస్ట్‌లో ‘సైకిల్‌’కు ఛాన్స్ ఇస్తున్న ‘ఫ్యాన్’ ఎమ్మెల్యేలు...!tdp{#}WOMEN;Godavari River;Jagan;Chintamaneni Prabhakar;Assembly;MLA;D Ramanaidu;Cycle;Alla Ramakrishna Reddy;TDP;YCP;Eluru;Nimmala RamanaiduSun, 27 Jun 2021 00:00:00 GMTపశ్చిమ గోదావరి జిల్లా...మొదట నుంచి టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లా. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు వెస్ట్‌లో సైకిల్ చిత్తు అయింది. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం రెండు చొట్లే గెలుచుకుంది. ఇక వైసీపీ 13 చోట్ల సత్తా చాటింది.


అయితే ఎన్నికలై రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్లలో వెస్ట్ టీడీపీ నేతలు బాగానే పుంజుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ఈ 13 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆళ్ళ నాని ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, వనిత కొవ్వూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రంగనాథరాజు ఆచంటలో పనిచేస్తున్నారు.


ఈ ముగ్గురు మంత్రులు సైతం తమ సొంత నియోజకవర్గాల్లో ఎఫెక్టివ్‌గా పనిచేయడంలో కాస్త వెనుకబడే ఉన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. కాకపోతే మంత్రులుగా ఉన్నారు కాబట్టి, వీరు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారు. అందుకే నియోజకవర్గాలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. అటు జిల్లాలో ఉన్న మిగిలిన పది మంది ఎమ్మెల్యేల్లో కొందరు ప్రజలకు అందుబాటులో ఉండటంలో బాగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.  అదే సమయంలో టీడీపీ నేతలు ప్రజలకు మరింతగా దగ్గరవ్వడం, ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయడం లాంటి అంశాలు కలిసొస్తున్నాయనే చెప్పొచ్చు.


టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాగా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మరో ఎమ్మెల్యే రామరాజు కాస్త వీక్‌గా ఉన్నా సరే, ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో మాత్రం టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఇటు దెందులూరులో టీడీపీ ఇన్‌చార్జ్ చింతమనేని ప్రభాకర్ బాగానే పుంజుకున్నారు. అలాగే తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరులో గన్నీ వీరాంజనేయులు బాగానే పనిచేస్తున్నారు. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు, గోపాలాపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావులు పర్వాలేదనిపిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వెస్ట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీ నేతలకు ఛాన్స్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.




వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ కండువా కప్పుకోకుండా వారు జగన్‌కు మద్ధతు తెలిపి అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా నడుస్తున్నారు. అంటే తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తెలివిగా, టీడీపీని వీడి, వైసీపీలో చేరకుండా, ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చారు.

టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గం....కమ్మ వర్గం అంటే టీడీపీ అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే టీడీపీ స్థాపించిందే కమ్మ వర్గానికి చెందిన ఎన్టీఆర్...ఇక ఆయన తర్వాత టీడీపీని నడిపిస్తున్నది అదే వర్గానికి చెందిన చంద్రబాబు. అందుకే టీడీపీలో కమ్మ నేతలు ఎక్కువగా ఉంటారు. అలాగే కమ్మ ఓట్లు టీడీపీకే ఎక్కువ పడతాయి.

ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుండటంతో కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. నెక్స్ట్ కేబినెట్‌లో కొనసాగుతామా లేదా అనే విషయంపై పలువురు మంత్రులు బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు చేసిన మొదట్లోనే రెండున్నర ఏళ్లలో మంత్రివర్గంలో మార్పులు చేస్తానని, అప్పుడు పలువురుకు ఉద్వాసన తప్పదని జగన్ చెప్పేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా...మొదట నుంచి టీడీపీకి కాస్త అనుకూలమైన జిల్లా. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లో మాత్రం జగన్ దెబ్బకు వెస్ట్‌లో సైకిల్ చిత్తు అయింది. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కేవలం రెండు చొట్లే గెలుచుకుంది. ఇక వైసీపీ 13 చోట్ల సత్తా చాటింది.

బెజ‌వాడ వెస్ట్ టీడీపీ టికెట్ ఆమెకేనా...? బాబు మ‌దిలో ఎవ‌రున్నారు..?

బ్ర‌హ్మంగారి మ‌ఠాధిప‌తి ఆయ‌నే..?

జ‌గ‌న్ ప‌రువు అడ్డంగా తీసేసిన వైసీపీ ఎమ్మెల్యే ?

వైసీపీలో ఆ రెండు కులాలు ర‌గులుతున్నాయా ?

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>