SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality63482c49-9ec8-4adf-94ba-b8e0d175e1e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality63482c49-9ec8-4adf-94ba-b8e0d175e1e8-415x250-IndiaHerald.jpgప్రపంచానికి వెలుగును పంచే సూర్యదేవుడు జీవ కోటి మనుగడకి ప్రధాన ఆధారం. అన్ని దేవుళ్లలో సూర్య దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. సమస్త లోకానికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అటువంటి ఈ సూర్యభగవానుని ఆశీస్సులు పొందిన వ్యక్తి ధన్యుడు, మహా అదృష్ట శాలి.SPIRITUALITY{#}surya sivakumar;Maha;sundayసూర్యనమస్కారం చేయడం వలన ప్రయోజనాలివే ?సూర్యనమస్కారం చేయడం వలన ప్రయోజనాలివే ?SPIRITUALITY{#}surya sivakumar;Maha;sundaySun, 27 Jun 2021 08:00:45 GMTసూర్య దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. సమస్త లోకానికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. అటువంటి ఈ సూర్యభగవానుని ఆశీస్సులు పొందిన వ్యక్తి ధన్యుడు, మహా అదృష్ట శాలి. వారి యొక్క కుటుంబం వెయ్యి దీపాల కాంతులతో సంతోషమయమవుతుంది. అయితే సూర్య భగవంతుని అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేసుకోవడం అలవర్చుకోవాలి. ఇలా లేవగానే సూర్య భగవానుని దర్శనం చేసుకోవడం మరియు ఆయనకు నమస్కరించుట సూర్య దేవుని పూజించినట్లే అవుతుంది.

ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య నమస్కారం చేయడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది మరియు అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి రోజూ సూర్య నమస్కార స్తోత్రం పఠించడం ద్వారా జీవితంలో చీకటితో కూడుకున్న కష్టాలు తొలగిపోయి సుఖాలను పంచే వెలుగులు వెదజల్లుతాయి.  అందుకే ఆదివారాన్ని భానువారం అని కూడా అంటారు. సూర్యదేవుని ఉదయభానుడు, భానోదయుడు అని కూడా అంటారు. పొద్దున్నే సూర్యనమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  వివిధ భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు మంచి ఆరోగ్యపరమైన లాభాలు ఇస్తాయి. సూర్య నమస్కారం చేసే సమయంలో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పోవడం వలన చర్మం, ముఖం కాంతివంతంగా మారుతుంది.

అంతే కాకుండా శరీరంలోని అన్ని చర్యలు చక్కగా జరుగుతాయని ప్రతీతి. చిన్నపిల్లలకు కూడ సూర్య నమస్కారాలు అలవాటు చేయించడం చాలా ఉత్తమం. చిన్నప్పటి నుండే వారికి సూర్య నమస్కారాలు అలవాటు చేయడం వలన వారిలో భక్తి భావం పెరుగుతుంది. అదే విధంగా వారు  అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా ప్రతీరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వలన వివిధ ప్రయోజనాలు ఉన్నాయి.  



చక్కెర స్థాయిని నియంత్రించే అరుదైన మామిడి పండ్లు..

పెరిగిన పసిడి ధరలు.. పడి పోయిన వెండి..!!

జూన్ 27 - ఆదివారం రాశి ఫలాలు..

ఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?

గజినీ లో నయనతార పాత్ర కోసం ముందు ఎంపిక స్టార్ హీరోయిన్ ఆమెనటా

రైనా బయోపిక్ కి ఆ స్టారే కరెక్ట్ అంటా..!!

ఆ వర్గానికి కేసీఆర్ బిస్కెట్లు.. మరి బుట్టలో పడతారా..?

టాలీవుడ్ పై ధనుష్ దండయాత్ర.. శేఖర్ కమ్ముల సినిమాతో పాటు మరోకటి..!

శనివారం రోజున ఇవి కొంటున్నారా... జాగ్రత్త ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>