PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagananna-illue8a548f0-edcb-4063-a5b5-8f7f3a541944-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagananna-illue8a548f0-edcb-4063-a5b5-8f7f3a541944-415x250-IndiaHerald.jpgజగనన్న ఇళ్లు.. వైఎస్ జగన్ సర్కారు అందిస్తున్న పథకం. ఇది.. దీనికింద దాదాపు 30 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఈ ఇళ్ల పరిమాణంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి మరీ ఇరుకుగా ఉంటున్నాయన్న విమర్శలు పెరిగాయి. ఎవరో కాదు.. సొంత పార్టీ నేతలే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. జగనన్న ఇళ్లు ఇరుకు ఇళ్లు అంటున్న నల్లపురెడ్డి.. వాటిలjagananna illu{#}CPI;MLA;YCP;Nellore;Jagan;Reddy;Party;pragathiజగనన్న ఇళ్లలో కొత్త జంటకు శోభనం కష్టమేనట..?జగనన్న ఇళ్లలో కొత్త జంటకు శోభనం కష్టమేనట..?jagananna illu{#}CPI;MLA;YCP;Nellore;Jagan;Reddy;Party;pragathiSun, 27 Jun 2021 09:00:00 GMTజగనన్న ఇళ్లు.. వైఎస్ జగన్ సర్కారు అందిస్తున్న పథకం. ఇది.. దీనికింద దాదాపు 30 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఈ ఇళ్ల పరిమాణంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి మరీ ఇరుకుగా ఉంటున్నాయన్న విమర్శలు పెరిగాయి. ఎవరో కాదు.. సొంత పార్టీ నేతలే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన  వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. జగనన్న ఇళ్లు ఇరుకు ఇళ్లు అంటున్న నల్లపురెడ్డి..  వాటిలోని పడకగది కొత్త జంట కలిసి నిద్రించడం సాధ్యం కాదంటున్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి.. చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సమవేశంలో కలకలం రేపాయి. అధికారులతో సహ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.


నెల్లూరు జిల్లాలోని జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఈ కామెంట్ విపక్షాలకు ఆయుధంగా మారింది. ఈ ఇంటి బెడ్ రూము కొత్త జంటలకు కూడా పనికిరావని కోవూరు నల్లపురెడ్డి అభిప్రాయాన్ని కోట్ చేస్తూ వారు విమర్శలు చేస్తున్నారు. జగనన్న ఇళ్ల  పడక గదిలో కనీసం ఇద్దరు పడుకోవడం కూడా అసాధ్యమని సొంత ఎమ్మెల్యేనే చెబుతున్నారని.. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు.  


ఈ అంశంపై స్పందించిన సీపీఐ నేత నారాయణ.. యిపుడేమంటారు పెద్దిరెడ్డిగారు.. అంటూ మంత్రిని ప్రశ్నించారు. ఆనాడు యిండ్ల సౌకర్యాలపై కామెంట్ చేస్తే నాకు కులాలు ఆపాదించారు.. మరి యిపుడు మీ వైసీపీ శాసనసభ్యులేమన్నారో  విన్నారా ?..  పాపం  నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళ శోభనానికే యింత యిబ్బందయితే , జీవితమంతా యెలా కాపరం చేయాలో ? అంటూ నారాయణ సెటైర్లు పేల్చారు. కొత్త ఇళ్లు ఇవ్వడంతో పాటు నూతన వధూవరులు  పిల్లలు కనకుండా ఆపరేషన్ చేయించే పథకాన్నికూడా అనుసంధానం చేయించి పుణ్యం కట్టుకోండని సీపీఐ నారాయణ వ్యంగ్యంగా అన్నారు.





రేవంత్ తెలంగాణ విలన్ అయిపోయినట్టే...?

సీనియ‌ర్ల‌ను కాద‌ని రేవంత్‌ను రాహుల్ అందుకే న‌మ్మారా ?

రేవంత్ ను రవ్వంత చేసే కేసీఆర్ అస్త్రమిదేనా..?

రేవంత్ ముందు స‌వాళ్లు సీనియ‌ర్లేనా..?

రేవంత్ కు ప్రేమ పోటు పొడిచేది తమ్ముళ్లే...?

జగనన్న ఇళ్లు ఇరుకు ఇళ్లు అంటున్న నల్లపురెడ్డి.. వాటిలోని పడకగది కొత్త జంట కలిసి నిద్రించడం సాధ్యం కాదంటున్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి.. చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సమవేశంలో కలకలం రేపాయి.

తెలంగాణలో నేడు అఖిలపక్ష భేటీ.. !

సై అంటున్న ట్విట్టర్ : భారత ఐటి మంత్రినే ఇలా?

అఖిల్ ఏజెంట్.. రిలీజ్ డేట్ లాక్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>