PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy5a797cfd-569b-4c84-983f-53a79b84ccf2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy5a797cfd-569b-4c84-983f-53a79b84ccf2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఏడేళ్లలో ఏ ఉప ఎన్నిక వచ్చిన అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాలు సాధిస్తోంది. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. దుబ్బాక‌ లాంటి చోట్ల కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి రావ‌డంతో పాటు డిపాజిట్లు సైతం కోల్పోయింది. ఇప్పుడు రేవంత్ ఇక్క‌డ‌ కాంగ్రెస్ను గెలిపిస్తే లేదా కనీసం రెండో స్థానంలో నిలిపినా కాంగ్రెస్ ప‌టిష్ట‌త‌కు, రేవంత్ సమర్థతకు నిదర్శనంగా నిలవనుంది. ఎందుకంటే ఇక్కడ అధికార టీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక బీజేపీ లోకి వెళ్లిన ఈటల రాజేందర్ రెండు దశాబ్దాలుగాRevanth Reddy{#}kaushik;Eatala Rajendar;Backward Classes;Congress;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Party;revanth;KCRతొలి ప‌రీక్ష‌లో రేవంత్ ఫెయిల్ అయిన‌ట్టే...!తొలి ప‌రీక్ష‌లో రేవంత్ ఫెయిల్ అయిన‌ట్టే...!Revanth Reddy{#}kaushik;Eatala Rajendar;Backward Classes;Congress;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Party;revanth;KCRSun, 27 Jun 2021 18:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి మొట్టమొదటి అగ్నిపరీక్ష సిద్ధంగా ఉంది. నిన్నటి వరకు కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సీనియర్ రాజకీయ నేత ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సెప్టెంబర్లో ఉప ఎన్నిక జరుగనుంది. తెలంగాణలో గత ఏడేళ్లుగా వరుస ఓటములతో అలా పడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక‌ చావోరేవో లాంటిది . పీసీసీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత వ‌స్తున్న ఎన్నిక కావ‌డంతో ఈ ఎన్నిక‌ను రేవంత్‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

తెలంగాణలో ఏడేళ్లలో ఏ ఉప ఎన్నిక వచ్చిన అధికార టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాలు సాధిస్తోంది. ఒక్క  దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రమే బిజెపి విజయం సాధించింది. దుబ్బాక‌ లాంటి చోట్ల కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి రావ‌డంతో పాటు డిపాజిట్లు సైతం కోల్పోయింది. ఇప్పుడు రేవంత్ ఇక్క‌డ‌ కాంగ్రెస్ను గెలిపిస్తే లేదా కనీసం రెండో స్థానంలో నిలిపినా కాంగ్రెస్ ప‌టిష్ట‌త‌కు, రేవంత్ సమర్థతకు నిదర్శనంగా నిలవనుంది. ఎందుకంటే ఇక్కడ అధికార టీఆర్ఎస్ బలంగా ఉంది. ఇక బీజేపీ లోకి వెళ్లిన ఈటల రాజేందర్ రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నారు.

ఈ ఉప ఎన్నికల్లో పోటీ టిఆర్ఎస్, ఈట‌ల‌ మధ్య ఉంటుందని కాంగ్రెస్ కు మూడో స్థానమే అన్న అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్‌ కాంగ్రెస్ పరువు ఎలా నిల పెడతారో చూడాలి. ఈటెల ఇప్ప‌టికే చాప‌కింద నీరులా ప‌నిచేసుకుంటూ వెళుతున్నారు. ఆయ‌న ఉద్య‌మ నేత‌, బ‌ల‌మైన బీసీ నేత కావ‌డంతో పాటు ఆయ‌న‌కు ఇప్పుడు సానుభూతి ఉంది. ఇక గ‌తంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. ఆ త‌ర్వాత ఇది టీఆర్ ఎస్ కు కంచుకోటా మారింది. ఇక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కౌశిక్ రెడ్డికి కూడా కొంత పేరుంది. ఏదేమైనా ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచినా లేదా క‌నీసం రెండో స్థానంలో ఉన్నా రేవంత్ ప‌రువు నిలిచి ఉంటుంది. లేదా మూడో స్థానంలో ఉంటే రేవంత్ ఫెయిల్ అయిన‌ట్టే లెక్క ?

 



హుజూరాబాద్ ఉప ఎన్నికే రేవంత్‌కు తొలి అగ్నిప‌రీక్ష‌

జ‌గ‌న్ ఈ కీల‌క ప‌ద‌వి క్ష‌త్రియుల‌కే ఇస్తున్నాడా... ర‌ఘుకు చెక్ ?

బండెన‌క 'బండి' క‌ట్టి... పాద‌యాత్ర‌ల ''బండి'' క‌ట్టి!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు రాష్ట్రంలోని అన్ని పార్టీల ద‌ళిత ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ ల‌తో అఖిలప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగింది. ఇక ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ....భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందని....మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలన్నారు. గోరేటి వెంకన్న.. గల్లీ చిన్నది.. పాటను మనసు పెట్టీ వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు.

ఆ పాట వింటే ద‌ళితుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది :కేసీఆర్

కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...జ‌న్మ‌లో కూడా...?

టిఆర్ఎస్ హుజురాబాద్ లో చేస్తున్న రహస్య సర్వేలో ఏం తేలింది..?

మోడీ కేబినెట్లో కొత్త ముఖాలు వీళ్లే...!

దళితులకు ఈ బాధ పోవాలె : కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>