MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/uday-kiran8efa2cff-ea0f-41bc-869c-42284b661a45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/uday-kiran8efa2cff-ea0f-41bc-869c-42284b661a45-415x250-IndiaHerald.jpgఉద‌య్ కిర‌ణ్ అంటే ఒక‌ప్పుడు మీడియం రేంజ్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో స‌త్తా చాటాడు. ల‌వ్ స్టోరీలంటే ఆయ‌న సినిమాలే చూడాలి అన్న‌ట్టుగా ఆయ‌న యూత్‌ను ఆక‌ట్టుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌న స‌త్తా చాటాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న గురించి ఎప్పుడో న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ఉద‌య్ కిర‌ణ్ నటించిన మూవీలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆక‌ట్టుకుంటూనే ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం ఉదయ్ కిరణ్ గురించిన ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని uday-kiran{#}you tube;Aaviri;Soggadu;Crush;Interview;kiran;uday kiran;Tarun Kumar;ravi anchor;Hero;Cinema;bollywoodఆ సినిమా ఛాన్స్ ఉద‌య్‌కిర‌ణ్ వదులుకున్నారా..?ఆ సినిమా ఛాన్స్ ఉద‌య్‌కిర‌ణ్ వదులుకున్నారా..?uday-kiran{#}you tube;Aaviri;Soggadu;Crush;Interview;kiran;uday kiran;Tarun Kumar;ravi anchor;Hero;Cinema;bollywoodSat, 26 Jun 2021 12:00:00 GMTఉద‌య్ కిర‌ణ్ అంటే ఒక‌ప్పుడు మీడియం రేంజ్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో స‌త్తా చాటాడు. ల‌వ్ స్టోరీలంటే ఆయ‌న సినిమాలే చూడాలి అన్న‌ట్టుగా ఆయ‌న యూత్‌ను ఆక‌ట్టుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి త‌న స‌త్తా చాటాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న గురించి ఎప్పుడో న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

ఉద‌య్ కిర‌ణ్ నటించిన మూవీలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆక‌ట్టుకుంటూనే ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం ఉదయ్ కిరణ్ గురించిన ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ర‌విబాబు చెప్పుకొచ్చాడు. రవి బాబు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో రీసెంట్‌గా పాల్గొని హీరో ఉదయ్ కిరణ్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను వివ‌రించాడు. అవేంటంటే తాను డైరెక్ష‌న్ చేసిన సోగ్గాడు అనే మూవీలో ఉదయ్ కిరణ్ ని తరుణ్ తో కలిసి రెండో హీరోగా నటింపజేయాలని అనుకున్నాడంట ర‌విబాబు. కానీ చివరి నిమిషంలో ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో చేయ‌లేన‌ని చెప్ప‌డంతో వెనుదిరిగాడు.

ఇక చేసేది లేక బాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ నటుడిని ఈ సినిమాలో రెండో హీరోగా పెట్టి తీసాన‌ని, కానీ సినిమా ఫ‌లితాలు పూర్తిగా తారుమారయ్యాయని వివ‌రించాడు. అయితే ఉదయ్ కిరణ్ మాత్రం ఎప్పుడైతే ఈ సినిమాలో నటించనని చెప్పాడో అప్పుడే తాను ఆ సినిమాను తీయ‌కుండా ఉండాల్సిందని ర‌విబాబు చెప్పాడు. అలా చేయ‌కుండా పట్టింపులకు పోయి మూవీ తీయ‌డం వల్ల ఆ ఎఫెక్ట్ సినిమా ఫ‌లితంపై పడిందని తెలిపాడు ర‌విబాబు.

తాను ఉదయ్ కిరణ్ కోసం రాసుకున్న క్లైమాక్స్ సీన్స్ కూడా పూర్తిగా మార్చేశామని ఆ విషయం కూడా సోగ్గాడు సినిమాకు పెద్ద మైనస్ గా త‌యార‌యిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు డైరెక్ట‌ర్ ర‌విబాబు. ఇదిలా ఉండగా అప్ప‌ట్లో రవి బాబు తెలుగులో ఆవిరి అనే సినిమాను దర్శకత్వం వహించాడు ర‌విబాబు. కాక‌పోతే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవ‌డం గ‌మ‌నార్హం. దాంతో ప్రస్తుతం రవి బాబు తెలుగులో క్రష్ అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే.



రామ్ అంత మాస్ ను మేనేజ్ చేయగలడా.. !!

హీరో నితిన్ వదులుకున్న 10 బ్లాక్ బాస్టర్ మూవీస్..

మెగాస్టార్ కు "ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్" లేఖ‌.. !

ఛాన్స్ ఇచ్చినా ఉద‌య్‌కిర‌ణ్ చేయ‌న‌న్నాడుః ర‌విబాబు

కరోనా సమయంలో అవాంతరాలు లేకుండా వైద్య సేవలు ఇస్తున్న బసవతారకం ఆసుపత్రి..!!

మనీ : ఈ బైక్ పై రూ.20వేలు తగ్గింపు..

పవన్ దాతృత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే..?

ధనుష్ రెండో తెలుగు సినిమా.. ఆయనతోనే?

పేరుకే స్టార్ హీరోలు.. పెళ్ళాం చాటు భర్తలు వీరు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>