MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavyana-teripati-bussines32b154c8-5886-44b5-b867-d6aecd49ddc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavyana-teripati-bussines32b154c8-5886-44b5-b867-d6aecd49ddc0-415x250-IndiaHerald.jpgలావణ్య త్రిపాఠి.. సినీ ఇండస్ట్రీలో అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి. లావణ్య 1990 డిసెంబర్ 15వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో జన్మించింది. మొదట మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి , ఆ తరువాత క్లాసికల్ డాన్స్ లో శిక్షణ కూడా పొందింది. భరతనాట్యానికి పెట్టింది పేరు. మొదట తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి ఒక ప్రకటనలో కూడా నటించింది. అందుకు ఈమె ఎటువంటి పారితోషికం కూడా తీసుకోకుండా ఉండడం విశేషం. ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, బినామీ సిమెంట్ వంటి కొన్ని ప్రసిద్ధ బ్రాండ్ ప్రకటనలకు కూడా పనLAVYANA TERIPATI BUSSINES{#}December;Ayodhya;Bhale bhale Magadivoy;Dehradun;Telangana;dance;Success;Traffic police;Telugu;Cinema;Tamil;Houseబిజినెస్ వైపు అడుగులు వేస్తున్న లావణ్య..బిజినెస్ వైపు అడుగులు వేస్తున్న లావణ్య..LAVYANA TERIPATI BUSSINES{#}December;Ayodhya;Bhale bhale Magadivoy;Dehradun;Telangana;dance;Success;Traffic police;Telugu;Cinema;Tamil;HouseSat, 26 Jun 2021 21:00:00 GMT
లావణ్య త్రిపాఠి.. సినీ ఇండస్ట్రీలో అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి. లావణ్య 1990 డిసెంబర్ 15వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో జన్మించింది. మొదట మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి , ఆ తరువాత క్లాసికల్ డాన్స్ లో శిక్షణ కూడా పొందింది. భరతనాట్యానికి పెట్టింది పేరు. మొదట తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి ఒక ప్రకటనలో కూడా నటించింది. అందుకు ఈమె ఎటువంటి పారితోషికం కూడా తీసుకోకుండా ఉండడం విశేషం. ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ, బినామీ సిమెంట్ వంటి కొన్ని ప్రసిద్ధ బ్రాండ్ ప్రకటనలకు కూడా పనిచేసింది.


ఇక 2012లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.ఇక ఈ సినిమాలో తను  నటించిన తీరుకు  విమర్శకుల ప్రశంసలు అందడం తో పాటు ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకుంది. ఇక తరువాత దూసుకెళ్తా సినిమాలో నటించి , అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. తెలుగులో మంచి విజయం అందుకోవడంతో , తనకు తమిళంలో కూడా ఆఫర్లు వచ్చాయి. 2014లో బ్రహ్మతో అనే సినిమా ద్వారా తమిళ  సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో భలే భలే మగాడివోయ్ చిత్రంలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఈ చిత్రంలో భరతనాట్యం కళాకారిణిగా తన నృత్య ప్రదర్శనలు అందరికీ తెలిసేలా చేసింది.


ఇక సినీ ఇండస్ట్రీలో తెలుగులో కేవలం రెండు మూడు హిట్ లతో సరిపెట్టుకుంది.ఆ తర్వాత ఏ సినిమా కూడా ఆమెకు అంత విజయాన్ని చేకూర్చలేకపోయింది. ఇటీవల విష్ణుతో కలిసి నటించిన చావు కబురు చల్లగా సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఇక దీంతో ఈమెకు అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవడంతో బిజినెస్ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకుందట. ఇక ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు బిజినెస్ వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక లావణ్య త్రిపాఠి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


డెహ్రాడూన్ కి దగ్గర్లో ఉన్న చమసారీ అనే ఒక గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో మొదట ఫామ్ హౌస్ నిర్మించాలనుకోని, ఇప్పుడు అదే ప్రాంతంలో ఒక కేఫ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటోందట. అందమైన, ఆకర్షణీయమైన చెట్లతో, మొక్కలతో నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లోనే ఉంటూ, ఆ కేఫ్ కు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటోంది లావణ్య. ఇక సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా కనీసం బిజినెస్ పరంగా అయినా సక్సెస్ కావాలని కోరుకుందాం.





బిగ్ బ్రేకింగ్ : పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి

కెరియర్ లో ఫస్ట్ టైం రామ్ అలా.. సెట్ అవుతాడా..?

‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..?

రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన దర్శకులు

అజిత్ ఫ్యాన్స్ కలవరం.. ఆ సినిమా కి ఏమైంది!!

మెగాస్టార్ ఆచార్యకు టార్గెట్ ఫిక్స్..!

కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>