MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp540e5a55-b6c6-47b7-ac01-8a66324bd334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp540e5a55-b6c6-47b7-ac01-8a66324bd334-415x250-IndiaHerald.jpgఅంబటి రాంబాబు...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఎన్నో ఏళ్లుగా దివంగత వైఎస్సార్ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటున్న నాయకుడు. కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు పనిచేసిన నేత. అయితే ఇన్నేళ్లు రాజకీయాలు ఉన్నా సరే అంబటికి కీలకమైన పదవులు పెద్దగా రాలేదు. అలాగే ఎమ్మెల్యేగా ఎక్కువసార్లు గెలవలేదు. 1989లో ఒకసారి కాంగ్రెస్ తరుపున నిలబడి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్నిసార్లు ఓటమి పాలైన అంబటికి కొన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు.ysrcp{#}Kodela Siva Prasada Rao;Y. S. Rajasekhara Reddy;politics;Sattenapalle;Repalle;Congress;Party;television;Minister;media;MLA;TDP;Jagan;YCP;Hanu Raghavapudiహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అంబటికి ఛాన్స్ ఉందా?ysrcp{#}Kodela Siva Prasada Rao;Y. S. Rajasekhara Reddy;politics;Sattenapalle;Repalle;Congress;Party;television;Minister;media;MLA;TDP;Jagan;YCP;Hanu RaghavapudiSat, 26 Jun 2021 05:00:00 GMTఅంబటి రాంబాబు...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఎన్నో ఏళ్లుగా దివంగత వైఎస్సార్ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటున్న నాయకుడు. కాంగ్రెస్‌లో దశాబ్దాల పాటు పనిచేసిన నేత. అయితే ఇన్నేళ్లు రాజకీయాలు ఉన్నా సరే అంబటికి కీలకమైన పదవులు పెద్దగా రాలేదు. అలాగే ఎమ్మెల్యేగా ఎక్కువసార్లు గెలవలేదు. 1989లో ఒకసారి కాంగ్రెస్ తరుపున నిలబడి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్నిసార్లు ఓటమి పాలైన అంబటికి కొన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు.


ఇక వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్‌ని వీడి జగన్ వెంట నడిచిన అంబటి 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరుపున బరిలో దిగారు. కానీ ఊహించని విధంగా స్వల్ప మెజారిటీతో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. పైగా వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో అంబటికి రాజకీయంగా మంచి అవకాశాలు రాలేదు. కానీ పార్టీ తరుపున మీడియా సమావేశాల్లో గానీ, టీవీ డిబేట్లగానీ బలమైన వాయిస్ వినిపించేవారు. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారు.


ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి రాంబాబుకు అదృష్టం కలిసొచ్చింది. కోడెలపై మంచి మెజారిటీతో అంబటి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అటు వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో మంత్రి పదవి ఏమన్నా దక్కుతుందేమో అని అంబటి భావించారు. సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా రాంబాబుకు పదవి మిస్ అయింది. అయితే మరో ఐదు నెలల్లో కేబినెట్‌లో మార్పులు జరగనున్నాయి. అప్పుడు జగన్ ఏమన్నా అవకాశం ఇవ్వకపోరా అని ఎదురుచూస్తున్నారు.


ఎమ్మెల్యేగా అంబటి బాగానే పనిచేస్తున్నారు. సత్తెనపల్లి ప్రజలకు అండగానే ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు అమలులో ఎలాంటి ఇబ్బంది రావడం లేదు. ఇటీవల పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తెనపల్లిలో పార్టీని గెలిపించుకున్నారు. అటు టీడీపీ తరుపున కోడెల తనయుడు శివరాం పనిచేస్తున్నారు. కోడెల చనిపోవడంతో సత్తెనపల్లి బాధ్యతలు శివరాం చూసుకుంటున్నారు. శివరాం అంత దూకుడుగా పనిచేయడం లేదు. అంబటికి పోటీ ఇచ్చే స్థాయిలో శివరాం లేరనే చెప్పొచ్చు. అయితే ఈ మధ్య తన సొంత సామాజికవర్గం కాపులపై సంచలన వ్యాఖ్యలు చేసి అంబటి అడ్డంగా బుక్ అయ్యారు.


కాపులు ఆవేశపరులని, తాగుబోతులని, తెలివితక్కువారని మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంబటి గెలుపుకు కాపులు కూడా ప్రధాన కారణం. ఇప్పుడు ఇలా మాట్లాడి సొంత వర్గాన్నే కాస్త దూరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మరి నెక్స్ట్ ఎన్నికల్లో కాపులు అంబటికి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.




కారుతో ఈటల పోటీ... కాంగ్రెస్‌తో కూడా కష్టమేనా!

కరణం రూట్ అర్ధం కావట్లేదే...!

టీవీ : యాంకర్ మేఘన ఒక హీరోయిన్ అని మీకు తెలుసా..?

ఆ బ్యాచ్‌కు జగన్ చెక్ పెడతారా?

జాతీయ పార్టీలు ఇక ‘నోటా’ పార్టీ లేనా?

వంశీకి అర్జునుడు పోటీ ఇస్తున్నారా? చెక్ పెట్టగలరా?

జగన్ సిద్ధం.. మరి కేసీఆర్‌ సంగతేంటి..?

ఏపీలో ఆ రెండు కులాల మధ్య యుద్ధం.. ఎటు దారి తీస్తుంది..?

ఇప్పుడు ఏపీలో రెడ్డి, రాజు కులాల మధ్య ఘర్షణ వైఖరి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇది కేవలం అశోక్‌, రఘురామ కృష్ణం రాజుల వరకే పరిమితం అవుతుందని.. రాజు సామాజిక వర్గం వారంతా ఈ పరిణామాలపై ఆగ్రహం లేరని వైసీపీ నేతలు చెబుతున్నారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>