MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-nagarjuna-moviesdc765e72-bb2c-4289-8a62-b7722b49e447-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-nagarjuna-moviesdc765e72-bb2c-4289-8a62-b7722b49e447-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలకాలంలో హీరోలు ఒక సంవత్సరానికి ఒకటి , మహా అయితే రెండు సినిమాలను విడుదల చేయడం జరుగుతుంది.అయితే అవి కథా పరంగా బాగుండి ప్రేక్షకులను మెప్పించ గలిగితే ఆ రెండు సినిమాలు హిట్ అవుతాయి. ఒకవేళ ప్రేక్షకులను మెప్పించలేకపోతే డిజాస్టర్ గా మిగలాల్సిందే. కానీ అప్పట్లో మన తెలుగు హీరోలు ఇప్పటిలా కాదు.. ఏకంగా ఒకే సంవత్సరంలో పది నుంచి పదిహేను సినిమాలను రిలీజ్ చేసి దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. నాటి నుంచి నేటి వరMOVIES;NAGARJUNA MOVIES{#}Ilayaraja;Mani Ratnam;Vijayashanti;akkineni venkat;annapurna;geetanjali;raasi;tanikella bharani;tara;100 days;Maha;Ram Gopal Varma;March;lord siva;Shiva;Industry;Mass;Audience;Akkineni Nagarjuna;Reddy;January;Chitram;Telugu;Director;king;King;bollywood;Cinemaఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?ఒకే సంవత్సరంలో నాగార్జున ఎన్ని హిట్స్ కొట్టారో తెలుసా..?MOVIES;NAGARJUNA MOVIES{#}Ilayaraja;Mani Ratnam;Vijayashanti;akkineni venkat;annapurna;geetanjali;raasi;tanikella bharani;tara;100 days;Maha;Ram Gopal Varma;March;lord siva;Shiva;Industry;Mass;Audience;Akkineni Nagarjuna;Reddy;January;Chitram;Telugu;Director;king;King;bollywood;CinemaSat, 26 Jun 2021 17:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలకాలంలో హీరోలు ఒక సంవత్సరానికి ఒకటి , మహా అయితే రెండు సినిమాలను విడుదల చేయడం జరుగుతుంది.అయితే అవి కథా పరంగా బాగుండి ప్రేక్షకులను మెప్పించ గలిగితే ఆ రెండు సినిమాలు హిట్ అవుతాయి. ఒకవేళ ప్రేక్షకులను మెప్పించలేకపోతే డిజాస్టర్ గా మిగలాల్సిందే. కానీ అప్పట్లో మన తెలుగు హీరోలు ఇప్పటిలా కాదు.. ఏకంగా ఒకే సంవత్సరంలో పది నుంచి పదిహేను సినిమాలను రిలీజ్ చేసి దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. నాటి నుంచి నేటి వరకు మన్మధుడి గా పేరు పొందిన ఈయన ఒకే సంవత్సరంలో దాదాపు ఐదు సినిమాలను విడుదల చేసి, ఐదు సినిమాలలో నాలుగు సూపర్ హిట్ ,ఒకటి డిజాస్టర్ అయింది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విజయ్:
యాక్షన్ డ్రామాగా బి.గోపాల్ డైరెక్షన్ లో విజయశాంతి హీరోయిన్ గా, నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 జనవరి 19వ తేదీన విడుదల అయింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని వెంకట్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినప్పటికీ, నాగార్జునకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
2. విక్కీ దాదా:
క్రైమ్ చిత్రంగా  తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, కామాక్షి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. 1989 మార్చి 9వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో నాగార్జున హీరోగా, ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా, అలనాటి అందాల తార రాధ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది.
3. గీతాంజలి:
మొదటిసారి  మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ఇది. 1989 మే 10వ తేదీన విడుదలైన ఈ చిత్రం , అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసి ఏకంగా 7 సెంటర్లలో 100 రోజులు ఆడి విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక క్లాస్ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ,బెస్ట్ డైరెక్టర్ అవార్డు మణిరత్నం అందుకోగా, మరొక ఆరు నంది అవార్డులను కూడా దక్కించుకుంది.
4. శివ:
మరో ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన శివ మూవీ కి కూడా ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. గీతాంజలి సినిమా ద్వారా క్లాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నాగార్జున శివ మూవీ ద్వారా మాస్ ఆడియన్స్ కి  కూడా మరింత చేరువయ్యారు. ఇక ఇండస్ట్రీ హిట్ గా మిగిలిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ కు , తనికెళ్ల భరణి కి నంది అవార్డులు కూడా వచ్చాయి.
5. అగ్ని:
యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 ఆగస్టు 9వ తేదీన విడుదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, సౌభాగ్యలక్ష్మి ఫిల్మ్స్ బ్యానర్ పై కె.ఎస్. ప్రకాష్ నిర్మించడం జరిగింది. అంతే కాదు ప్రముఖ సీనియర్ నటి రాశి కూడా ఇందులో బాలనటిగా నటించింది. అయితే ఈ సినిమా నిరాశపరిచింది.




కొడాలిని పీకేస్తున్నారా... కొత్త క‌మ్మ మంత్రి ఆయ‌నేనా ?

కృతిసనన్ బ్యాగ్ విలువ తెలిస్తే షాకే..?

వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?

ప్రభాస్‌ని ఆకాశానికెత్తిన ఆ బాలీవుడ్ డైరెక్టర్..?

హృతిక్ కి క్రిష్ 4 చాలా స్పెషల్.. మ్యాజిక్ రిపీట్..!!

షారుక్ ఖాన్ తో రొమాన్స్ చేయనున్న నయనతార..!!

RRR కాదు.. అంతకుముందే ప్రేక్షకుల ముందుకు ఎన్.టి.ఆర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>