MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tag82a4476f-c00c-48a7-9e02-f688de16fbec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tag82a4476f-c00c-48a7-9e02-f688de16fbec-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల 2020 మార్చి నెల నుంచి షూటింగ్ లకు బ్రేక్ ప‌డిన విషయం తెలిసిందే. దాంతో చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్ట్ లు షూటింగ్ లేక రోజు గడవ‌క ఎన్నో కష్టాలు అనుభవించారు. వారి క‌ష్టాల‌ను చూసిన చిరంజీవి కొంతైనా సహాయం చేయాలనే సంకల్పంతో సిసిసి (సినీ చారిటబుల్ ట్రస్ట్) ను ప్రారంభించారు. అంతేకాకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవలు చేశాడు. లాక్ డౌన్ వేళ కార్మికుల ఆక‌లి తీర్చి వారికి అండ‌గా నిలిచారు. ఈ సేవలకు కృతజ్ఞతగా తెలుగు 'ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషchiranjeevi{#}Jr NTR;2020;Chiranjeevi;Coronavirus;Cinema;Telugu;Industryమెగాస్టార్ కు "ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్" లేఖ‌.. !మెగాస్టార్ కు "ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్" లేఖ‌.. !chiranjeevi{#}Jr NTR;2020;Chiranjeevi;Coronavirus;Cinema;Telugu;IndustrySat, 26 Jun 2021 11:52:03 GMTకరోనా వల్ల 2020 మార్చి నెల నుంచి షూటింగ్ లకు బ్రేక్ ప‌డిన విషయం తెలిసిందే. దాంతో చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది కార్మికులు, జూనియర్ ఆర్టిస్ట్ లు షూటింగ్ లేక రోజు గడవ‌క ఎన్నో కష్టాలు అనుభవించారు. వారి క‌ష్టాల‌ను చూసిన చిరంజీవి కొంతైనా సహాయం చేయాలనే సంకల్పంతో  సిసిసి (సినీ చారిటబుల్ ట్రస్ట్) ను ప్రారంభించారు. అంతేకాకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవలు చేశాడు. లాక్ డౌన్ వేళ కార్మికుల ఆక‌లి తీర్చి వారికి అండ‌గా నిలిచారు. ఈ సేవలకు కృతజ్ఞతగా తెలుగు 'ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్' చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఓ ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో... మీరు దశాబ్దాలుగా 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. 

దీని ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంది  సినిమా కార్మికులు ప్రయోజనం పొందారు. కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నెల నుంచే షూటింగులు లేక జనాలు బయట తిరిగే పరిస్థితులు లేక ఎన్నో కష్టాలు అనుభవించారు. తినడానికి నిత్యావ‌సరాలు కూడా లేక బాధ పడిన సమయంలో సిసిసి (సినీ చారిటబుల్ ట్రస్ట్) ఏర్పాటు చేసి అందులో సినీ పెద్దలను భాగస్వామ్యం చేసి, ప్రతి ఒక్క సినీ కార్మికుడి యొక్క ఆకలి తీర్చాలని... మంచి ఉద్దేశంతో మూడు దఫాలుగా ఇంటింటికి సరుకులు తరలించిన మీ సాహృదయానికి వందనాలని పేర్కొన్నారు.

కరోనా రెండవ వేవ్ సమయంలో ప్రతి కార్మికుడికీ ఆరోగ్య భద్రత చేయించాలని మీకు ఆలోచ‌న రావడం.... ప్రతి ఒక్క కార్మికుడికి వ్యాక్సినేషన్ చేయిస్తానని మీరు ప్రకటించడం చాలా సంతోషాన్నిచ్చింది. వ్యాక్సినేషన్ కొర‌త‌ ఉన్నా గానీ అపోలో 24/7 సౌజన్యంతో కార్మికులంద‌రికీ వ్యాక్సినేషన్ వేయించి... వారికి ఆరోగ్య భద్రత కల్పించడానికి ప్రముఖ పాత్ర పోషించినందుకు మీకు ధన్యవాదాలు. ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ఎప్పుడు మీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటుంద‌ని మీకు తెలుపుతున్నాం. అంటూ మెగాస్టార్ రాసిన లేఖ‌లో ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ స‌భ్యులు పేర్కొన్నారు.



జగన్‌ సర్కారుపై మావోయిస్టులు ఫైర్.. బంద్‌కు పిలుపు

రామ్ అంత మాస్ ను మేనేజ్ చేయగలడా.. !!

హీరో నితిన్ వదులుకున్న 10 బ్లాక్ బాస్టర్ మూవీస్..

ఆ సినిమా ఛాన్స్ ఉద‌య్‌కిర‌ణ్ వదులుకున్నారా..?

తెలుగు 'ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్' చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఓ ఒక లేఖను విడుదల చేసింది.

'మా' వార్: నాగబాబుపై నరేశ్‌ ఫైర్..?

ఫ్యామిలీ మ్యాన్ -2 తెలుగులో వచ్చేది ఎప్పుడంటే.. ?

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే మరి ఎన్టీఆర్, ఏఎన్ఆర్.. ?

మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు కరోనా పాజిటివ్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>