MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode7d19722-bc86-458d-a25e-620cb947ad2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode7d19722-bc86-458d-a25e-620cb947ad2a-415x250-IndiaHerald.jpgటాస్క్ లు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి. జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటే ఇంకా కొత్త టాస్కులు అలా వచ్చి పడుతూనే ఉంటాయి. టాలీవుడ్ ఈ రోజు దేశంలో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉంది. అలాంటి చోట అంతా కలిపి దాదాపుగా యాభై మంది దాకా హీరోలు పనిచేస్తున్నారు. tollywood{#}Tollywoodఆ హీరోలకు బిగ్ టాస్క్ ?ఆ హీరోలకు బిగ్ టాస్క్ ?tollywood{#}TollywoodSat, 26 Jun 2021 18:59:43 GMTటాస్క్ లు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి. జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటే ఇంకా కొత్త టాస్కులు అలా వచ్చి పడుతూనే ఉంటాయి. టాలీవుడ్ ఈ రోజు దేశంలో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉంది. అలాంటి చోట అంతా కలిపి దాదాపుగా యాభై మంది దాకా హీరోలు పనిచేస్తున్నారు.

వీరిలో సీనియర్లు టాప్ ఫోర్  తో పాటు అగ్ర నటులు ఉన్నారు. న్యూ టాలెంట్ ఉంది. ఇక మిడిల్ రేంజ్ హీరోలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరే ఒక బిగ్ టాస్క్ ని చేదించాలని తెగ ఆరాటపడుతున్నారు. ఆ టాస్క్ ఏంటి అంటే యాభై కోట్ల రూపాయల కలెక్షన్లు వసూల్ చేయడం. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ఈజీగా వంద కోట్లను వసూల్ చేస్తున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాలు కూడా వందల కోట్లు పెట్టి తీస్తున్నారు. బాహుబలి అయితే రెండు వేల కోట్ల దాకా వసూల్ చేసింది.

అయితే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా మిడిల్ రేంజి హీరోలకు యాభై కోట్లు పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. దాని కోసం వారి శ్రమను ఎక్కడా తగ్గకుండా చూపిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజాతో మొదలు పెడితే నాచురల్ స్టార్ నాని వరకూ అందరికీ ఒక్కటే లక్ష్యం. ఒక్కటే గమ్యం. అదే యాభై కోట్ల మార్క్ ని దాటాలని, ఆ క్లబ్ లో మెంబర్ షిప్ తీసుకోవాలని.

మాస్ మహారాజా క్రాక్ మూవీ సూపర్ హిట్ అంటే వచ్చింది ముప్పయి కోట్లు మాత్రమే. అయితే  అప్పట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కాబట్టే ఇలా వచ్చింది అని అంటున్నారు. ఈసారి ఖిలాడీ మూవీతో కచ్చితంగా రవితేజా యాభై కోట్ల క్లబ్ లో చేరుతాడు అంటున్నారు. ఇక నాని అయితే వరసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. వీటితో కచ్చితంగా యాభై కోట్లను కొల్లగొడతాను అని ధీమాగా ఉన్నాడు. మరో యంగ్ హీరో శర్వానంద్ చేసిన మూవీ శతమానం భవతి మూవీ ముప్పయి అయిదు కోట్లు మాత్రమే వసూల్ చేసింది. దాంతో ఈ హీరో కూడా తరువాత సినిమా మీద ఆశలు పెట్టుకున్నాడు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా యాభై కోట్ల మార్క్ కి అడుగు దూరంలో నిలిచాడు. ఫిదా మూవీ 48 కోట్లు వసూల్ చేసింది. గని సినిమాతో కచ్చితంగా యాభై కోట్లను కొల్లగొడతాను అంటున్నాడు. ఇదే వరసలో రామ్ పోతినేని, నితిన్ వంటి యంగ్ హీరోలు ఆశతో ఉన్నారు. మరి వీరంతా టాస్క్ ని రీచ్ కావాలని వారి ఫ్యాన్స్ కూడా మొక్కుకుంటున్నారు.









టాస్క్ లు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి. జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటే ఇంకా కొత్త టాస్కులు అలా వచ్చి పడుతూనే ఉంటాయి. టాలీవుడ్ ఈ రోజు దేశంలో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉంది. అలాంటి చోట అంతా కలిపి దాదాపుగా యాభై మంది దాకా హీరోలు పనిచేస్తున్నారు.

‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ మూవీ నుంచి న్యూఅప్డేట్..?

రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తిన దర్శకులు

అజిత్ ఫ్యాన్స్ కలవరం.. ఆ సినిమా కి ఏమైంది!!

వైరలవుతున్న లిటిల్ క్వీన్ స్మైల్..!

టాలీవుడ్ మొత్తం నిండిపోయిన మలయాళీ ముద్దుగుమ్మలు

వైరల్ అవుతున్న టాలీవుడ్ స్టార్ హీరోస్ త్రోబ్యాక్ పిక్..?

ప్రభాస్‌ని ఆకాశానికెత్తిన ఆ బాలీవుడ్ డైరెక్టర్..?

ఆ బాలీవుడ్ హీరోయినే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>