MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-social-service24678879-3b97-4cc7-a866-2296b179f138-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroes-social-service24678879-3b97-4cc7-a866-2296b179f138-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. నిజానికి చిరంజీవి కుటుంబ సభ్యులు తరతరాలుగా దానధర్మాలు చేస్తూ వస్తున్నారు. చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎందరో పేద ప్రజలకు దానాలు చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. నాగబాబు కూడా ఆర్టిస్టులకు సహాయం చేశారు. ఇటీవల చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి చాలామంది కరోనా రోగుల ప్రాణాలను నిలబెట్టారు. ఇందుకోసం ఆయన తన సొంతంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది.heroes-social service{#}Cinema;Chiranjeevi;Pawan Kalyan;kalyan;Nagababu;oxygen;Coronavirus;prakruti;jeevitha rajaseskhar;Bank;Andhra Pradeshభారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..?భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..?heroes-social service{#}Cinema;Chiranjeevi;Pawan Kalyan;kalyan;Nagababu;oxygen;Coronavirus;prakruti;jeevitha rajaseskhar;Bank;Andhra PradeshSat, 26 Jun 2021 10:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. నిజానికి చిరంజీవి కుటుంబ సభ్యులు తరతరాలుగా దానధర్మాలు చేస్తూ వస్తున్నారు. చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎందరో పేద ప్రజలకు దానాలు చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. నాగబాబు కూడా ఆర్టిస్టులకు సహాయం చేశారు. ఇటీవల చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి చాలామంది కరోనా రోగుల ప్రాణాలను నిలబెట్టారు.

ఇందుకోసం ఆయన తన సొంతంగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. కరోనా చికిత్సలో భాగమైన వైద్య సామాగ్రి కోసం ఆయన మరో 20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చిరు టాలీవుడ్ సెలబ్రిటీలలో ఎవరూ చేయలేనంత సాయం చేసి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఆయన గత నాలుగు శతాబ్దాలుగా ప్రకృతి విపత్తులలో బాధితులైన ప్రజలకు సాయం చేస్తున్నారు.

అయితే చిరంజీవి తన జీవిత కాలంలో ఇచ్చిన విరాళాల విలువ రూ.150 కోట్లకు పైగానే  ఉంటుందని అంటుంటారు. 1998 నుంచి చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్స్ నడుపుతున్నారు. 1988వ సంవత్సరంలో పంటలు బాగా దెబ్బతిని తీవ్రంగా నష్టాలు రావడంతో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే చనిపోయిన రైతు కుటుంబాలకు చిరంజీవి అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం చేశారు. చిరంజీవి ఇంకా మరెన్నో గుప్తదానాలు చేసి ఎందరో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు.

అయితే బ్లడ్ బ్యాంక్ మెయింటెనెన్స్ కాస్ట్ సంవత్సరానికి ఆరు కోట్ల వరకు అవుతుందని సమాచారం. 90 ఏళ్ల భారతీయ సినిమా చరిత్రలోకి తొంగి చూస్తే.. చిరంజీవి లాగా ఎవరూ కూడా వందల కోట్ల రూపాయల్లో దానం చేయలేదని తెలుస్తోంది. చిరంజీవి స్థాపించిన ఐబ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఇప్పటికే ఎన్నో లక్షలమంది పేషెంట్లు లబ్ధి పొందారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు "బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంకు" గా నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవార్డు గెలుచుకుంది.


టాలీవుడ్ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ దేవరకొండ..!!

నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా

టాలీవుడ్ పై ధనుష్ దండయాత్ర.. శేఖర్ కమ్ముల సినిమాతో పాటు మరోకటి..!

భారతీయ సినిమా చరిత్రలో చిరంజీవి ఓ గొప్ప దాత..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీస్ కేటగిరి లో చూడండి.

క్రికెట్ ఫాన్స్ కి అదిరిపోయే శుభవార్త.. టి20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే?

జూలై 1 నుంచి స్కూళ్లు కష్టమేనట?

వామ్మో.. సెకండ్ వేవ్ లో ఎంత మంది వైద్యులు చనిపోయారో తెలుసా?

సగం సినిమా పూర్తయ్యింది.. పవన్ సినిమా లో హీరోయిన్స్ ఒకే అవలేదేంటి?

టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>