Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death-dd389187-47ec-4c6c-a32e-589adb7840d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/death-dd389187-47ec-4c6c-a32e-589adb7840d9-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే అభం శుభం తెలియని చిన్నారులు కఠిన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని ఎంతో మంది చిన్నారులు అర్థంతరంగానే ముగిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న ఎంతో మంది యువత.. పిచ్చివాళ్ళలా గా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వారికి స్తోమత లేక పోయినప్పటికీ కరోనా సమయంలో తమ 12 ఏళ్ళ కొడుకు చదువుకి ఆటంకం ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో తల్లిదండDeath {#}Audi;Sangeetha;Parents;Smart phone;Hyderabad;Coronavirusఆన్లైన్ క్లాసు కోసం ఫోన్ ఇస్తే.. అలా చూసి ఆత్మహత్య చేసుకున్నాడు?ఆన్లైన్ క్లాసు కోసం ఫోన్ ఇస్తే.. అలా చూసి ఆత్మహత్య చేసుకున్నాడు?Death {#}Audi;Sangeetha;Parents;Smart phone;Hyderabad;CoronavirusSat, 26 Jun 2021 14:50:00 GMTఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే అభం శుభం తెలియని చిన్నారులు కఠిన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని ఎంతో మంది చిన్నారులు అర్థంతరంగానే ముగిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న ఎంతో మంది యువత.. పిచ్చివాళ్ళలా గా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 వారికి స్తోమత లేక పోయినప్పటికీ కరోనా సమయంలో తమ 12 ఏళ్ళ కొడుకు చదువుకి ఆటంకం ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనిచ్చారు.  అయితే ఆ మొబైల్ ఫోను ఆన్లైన్ క్లాసుల కోసం ఉపయోగించకుండా.. ఆన్లైన్ లో గేమ్స్ ఆడటానికి వినియోగించాడు ఆ 12 ఏళ్ల బాలుడు  ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి పబ్జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతూ వస్తున్నాడు. చివరికి ఆ మాయదారి గేమ్స్ ఆ పన్నెండేళ్ళ అభం శుభం తెలియని బాలుడిని బానిసగా మార్చేసుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇక ఇటీవల అభం శుభం తెలియని వయసులో ఏకంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.



 ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది చిన్నారులు ఆన్లైన్ క్లాసులు అర్థం కాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.  ఇప్పుడు ఈ బాలుడు ఆన్లైన్ గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి సంగీత నగర్లో 12 ఏళ్ల వయస్సు ఉన్న మణికంఠ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ తరగతుల కోసం తమ కొడుకు కి ఫోన్ కొనిచ్చాము అంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తరచూ ఫోన్లోనే కాలం గడిపే వాడని కానీ ఇంత ఘోరం జరిగి పోతుంది అని ఊహించలేదు అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.



నకిలీ వ్యాక్సిన్ తో ఎంపీకి షాక్.. వెంటనే ఆరోగ్యం క్షీణించి?

ఉదయకిరణ్ ఆత్మహత్యకు అదే కారణమా ?

ఆన్లైన్ పరిచయం.. ప్రేమ.. చివరికి?

క్రికెట్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ కు ముందే.. మరో దేశవాళీ లీగ్?

త‌మిళ‌నాడులో మ‌మ్మ‌ల్ని పోటీ చేయ‌నిస్తారా..కరాటే క‌ళ్యాణి ఫైర్.. !

అమెజాన్ అడవుల్లో గోల్డ్ స్మగ్లర్ల అరాచకాలు ..!

ప్రాణాలు కాపాడుతున్న వ్యాక్సిన్లు.. ఇదిగో ప్రూఫ్?

పోలీసులు చేయలేనిది.. కరోనా చేసి చూపించింది?

రంగంలోకి దిగిన కమలా హ్యారీస్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>