PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ashok-gajapathi-raju8c737319-56cd-43e3-b0f9-4ec45ea1af2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ashok-gajapathi-raju8c737319-56cd-43e3-b0f9-4ec45ea1af2a-415x250-IndiaHerald.jpgఅలాగే టీడీపీలో అనేక కీలక పదవులు బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో రాజుగారు, విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి మంచి పనితీరు అందర్నీ మెప్పించారు. ఇక బీజేపీతో పొత్తు విడిపోవడంతో మంత్రి పదవికి తేలికగా రాజీనామా చేసి బయటకొచ్చేశారు. అయితే 2019 ఎన్నికల్లో అశోక్‌కు ఓటమి ఎదురైంది. మరోసారి ఎంపీగా నిలబడిన విజయం మాత్రం దక్కలేదు. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో అశోక్‌ని గట్టిగా టార్గెట్ చేశారు. వంశపారంపర్యంగా మాన్సాస్, సింహాచలంతో పాటు పలు దేవస్థానాలకు ఛైర్మన్‌గా బాధ్యతలAshok gajapathi Raju{#}Thief;Donga;Service;vidya;NTR;రాజీనామా;Cheque;District;Jagan;ashok;Vijayanagaram;Vizianagaram;central government;king;YCP;Hanu Raghavapudi;Minister;Partyపేరుకే రాజు కాదు...వ్యక్తిత్వంలో కూడా రారాజు....!పేరుకే రాజు కాదు...వ్యక్తిత్వంలో కూడా రారాజు....!Ashok gajapathi Raju{#}Thief;Donga;Service;vidya;NTR;రాజీనామా;Cheque;District;Jagan;ashok;Vijayanagaram;Vizianagaram;central government;king;YCP;Hanu Raghavapudi;Minister;PartySat, 26 Jun 2021 10:00:00 GMTవిజయనగరం జిల్లా అంటే మొదట గుర్తొచ్చేది గజపతి రాజుల వంశమే. ఇక గజపతి రాజులు చేసిన దానాలు ఎవరికి తెలియనవి కాదు. ప్రత్యర్ధుల చేత కూడా ఔరా అనిపించుకునేలా గజపతి రాజులు ప్రజలకు సేవ చేశారు. అలా ప్రజలకు సేవ చేస్తూ వచ్చిన గజపతిరాజులు, రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. పూసపాటి విజయరామ గజపతి రాజు చాలా ఏళ్ళు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశారు. ఓ వైపు రాజకీయాల్లో ఉన్నా కూడా స్వచ్ఛందంగా ప్రజలకు అనేక రకాలుగా సేవ చేస్తూ వచ్చారు.

ఇక విజయరామ పెద కుమారుడు ఆనంద గజపతి రాజు సైతం అదే బాటలో నడిచారు. ఈ ఇద్దరు తర్వాత అశోక్ గజపతి రాజు....దశాబ్దాల పాటు ప్రజా సేవలో ఉంటూ వస్తున్నారు. అలాగే రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తూ వచ్చారు. 1978లో జనతా పార్టీ ద్వారా విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్..తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వచ్చి 7 సార్లు విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచారు.

అలాగే టీడీపీలో అనేక కీలక పదవులు బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో రాజుగారు, విజయనగరం ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్‌లో  పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి మంచి పనితీరు అందర్నీ మెప్పించారు. ఇక బీజేపీతో పొత్తు విడిపోవడంతో మంత్రి పదవికి తేలికగా రాజీనామా చేసి బయటకొచ్చేశారు. అయితే 2019 ఎన్నికల్లో అశోక్‌కు ఓటమి ఎదురైంది. మరోసారి ఎంపీగా నిలబడిన విజయం మాత్రం దక్కలేదు.

పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో అశోక్‌ని గట్టిగా టార్గెట్ చేశారు. వంశపారంపర్యంగా మాన్సాస్, సింహాచలంతో పాటు పలు దేవస్థానాలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్‌ని వైసీపీ ప్రభుత్వం తప్పించి సంచయితని ఛైర్మన్ చేసింది. ఇక  ఈ సంచయిత బ్యాగ్రౌండ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే తనని ఛైర్మన్ పదవి నుంచి తొలగించడంపై అశోక్ కోర్టుకెళ్ళి, అక్కడ గెలిచి మళ్ళీ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి చెక్ పడింది.

అయినా సరే ఉత్తరాంధ్రకు అనధికార సీఎంగా హడావిడి చేస్తున్న విజయసాయిరెడ్డి, అశోక్‌పై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనని దొంగ అని, మాన్సాస్ భూములు కాజేశారని, జైలుకు వెళ్ళడం ఖాయమని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి, అశోక్ గురించి మాట్లాడటం కాస్త విడ్డూరంగానే ఉంది. మాన్సాస్ ట్రస్ట్ కింద ఉన్న వేల ఎకరాలు గజపతి ఫ్యామిలీ దానం చేసిన విషయం అందరికీ తెలుసు. అలాగే అనేక మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. ఇంకా అనేకరకాలుగా ప్రజలకు సేవ చేస్తున్న అశోక్‌పై విజయసాయి మరీ గుడ్డిగా విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అసలు ఆయన గురించి తెలిసినవారు ఎవరూ, ఆయనపై విమర్శలు చేయరు. ఆఖరికి ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ నేతలు సైతం అశోక్‌ని ఒక్క మాట కూడా అనరు. అలాంటిది విజయసాయి, మంత్రి వెల్లంపల్లిలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శలు చేయడం వల్ల వైసీపీకే నష్టం జరుగుతుంది తప్ప, రాజుగారి వ్యక్తిత్వానికి ఎలాంటి ఇబ్బంది రాదనే చెప్పొచ్చు. కాబట్టి ఆయన పేరుకే రాజు కాదు..వ్యక్తిత్వంలో కూడా రారాజు.

 



ఆ దేశ అధ్యక్షుడి హెలికాప్టర్ పై తుపాకీ కాల్పులు..!

టిడిపి నాయకుడి పై వైసీపీ నాయకుల దాడి!

కేసీఆర్ కు "ఈటల" భయం..!

టాలీవుడ్ యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ దేవరకొండ..!!

నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా

వామ్మో.. సెకండ్ వేవ్ లో ఎంత మంది వైద్యులు చనిపోయారో తెలుసా?

టెక్స్ట్ బుక్ లో ఆ బొమ్మలను తొలగించిన పాకిస్తాన్?

ఆ ఇన‌సొంపైన బూతులు వైసీపీ నేత‌ల‌కు విన‌ప‌డ‌లేదా ?

జగన్ పై ఐటీ ఉద్యోగులు గరం గరం.. ఎందుకంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>