PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgఇక ఇప్పుడు కేసీఆర్ జ‌గ‌న్‌పై క‌మ్మ అస్త్రం కూడా ప్ర‌యోగిస్తున్న ప‌రిస్థితి ఉంది. ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గం జ‌గ‌న్ తీరుపై తీవ్రంగా ర‌గులుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ క‌మ్మ‌ల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తెలంగాణ‌లో క‌మ్మ‌ల‌ను త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంతో పాటు ఏపీలో క‌మ్మ‌ల్లో కూడా త‌న ప‌ట్ల మ‌రింత సానుకూల‌త వ‌చ్చేలా కేసీఆర్ కొత్త మైండ్ గేమ్‌కు తెర లేపిన‌ట్టే క‌నిపిస్తోంది.Jagan Kcr{#}Nijam;ajay;Reddy;Bharatiya Janata Party;KCR;Telangana;Father;Andhra Pradesh;Minister;Partyజ‌గ‌న్‌పై కేసీఆర్ క‌మ్మ అస్త్రం కూడా వేసేశారే ?జ‌గ‌న్‌పై కేసీఆర్ క‌మ్మ అస్త్రం కూడా వేసేశారే ?Jagan Kcr{#}Nijam;ajay;Reddy;Bharatiya Janata Party;KCR;Telangana;Father;Andhra Pradesh;Minister;PartySat, 26 Jun 2021 12:30:00 GMTతెలంగాణ‌, ఏపీ మ‌ధ్య జ‌ల జ‌గ‌డం స్టార్ట్ అయిన వెంట‌నే టీఆర్ ఎస్ పార్టీ వాళ్లు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఎలా టార్గెట్ చేస్తున్నారో ?  చూస్తూనే ఉన్నాం. జ‌గ‌న్‌ను టీఆర్ ఎస్ మంత్రులు, నేత‌లు తీవ్ర స్థాయిలో తిడుతున్నారు. ఇక జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తే మ‌ళ్లీ తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో టీఆర్ ఎస్ పై ఎక్క‌డ వ్య‌తిరేక‌త స్టార్ట్ అవుతుందో ఏమో అనుకున్నారేమో గాని వేముల ప్ర‌శాంత్ రెడ్డితో జ‌గ‌న్‌ను, జ‌గ‌న్ తండ్రి దివంత వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ప‌దే ప‌దే టార్గెట్ చేయిస్తూ వ‌చ్చారు. ప్ర‌శాంత్ రెడ్డి జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో.. దారుణ‌మైన ప‌ద‌జాలంతో విరుచుకు ప‌డ్డారు.

ఇక ఇప్పుడు కేసీఆర్ జ‌గ‌న్‌పై క‌మ్మ అస్త్రం కూడా ప్ర‌యోగిస్తున్న ప‌రిస్థితి ఉంది. ఏపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గం జ‌గ‌న్ తీరుపై తీవ్రంగా ర‌గులుతోంది. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ క‌మ్మ‌ల‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తెలంగాణ‌లో క‌మ్మ‌ల‌ను త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంతో పాటు ఏపీలో క‌మ్మ‌ల్లో కూడా త‌న ప‌ట్ల మ‌రింత సానుకూల‌త వ‌చ్చేలా కేసీఆర్ కొత్త మైండ్ గేమ్‌కు తెర లేపిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సారి జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు స్టార్ట్ చేశారు. అజ‌య్ క‌మ్మ వ‌ర్గం నేతే. అజ‌య్ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు అంశం పై ఆనాడే కేసీఆర్ పోరాటం చేశార‌ని..  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నీళ్ల తరలించ‌డం పరాకాష్టకు చేరింద‌ని.. బీజేపీ ఏపీలో ఒకలా తెలంగాణలో మరోలా మాట్లాడుతోంద‌ని అజ‌య్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్ తెలంగాణ స‌మాజాన్ని ఎప్పుడూ చిన్న చూపే చూశార‌ని కూడా అజ‌య్ ధ్వ‌జ‌మెత్తారు.

జ‌గ‌న్ విష‌యంలో వేముల ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడిన మాట‌లు 100 శాతం నిజం అని.. ఈయ‌న వ‌క‌ల్తా పుచ్చుకున్నారు. దీనిని బ‌ట్టి సామాజిక వ‌ర్గాల వారీగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేయిస్తూ వ‌స్తున్నార‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.



కేసీఆర్.. ఈటల కోసం సీక్రెట్‌గా ఆ పని చేయిస్తున్నారా..?

ప్ర‌కాష్‌రాజ్‌కు బ‌లం పెరుగుతోంది.. పొలిటిక‌ల్ స‌పోర్ట్ ఫుల్ ?

జ‌గ‌న్‌పై టీ మంత్రి పువ్వాడ అజ‌య్ విమ‌ర్శ‌లు

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ దందాపై ఎన్సీబీ నిఘా

జగన్ తాడేపల్లి బాలింత..అచ్చెన్న సంచలనం!

ప్రగతి కి ఇంత పెద్ద కూతురు ఉందా..?

జగన్‌ సర్కారుపై మావోయిస్టులు ఫైర్.. బంద్‌కు పిలుపు

స‌బ్బం ప్లేస్‌లో ఆ నేతను ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు ?

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటోన్న ర‌ఘురామ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>