HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-0f0061c2-e2f6-494b-8112-48f0aa965175-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-0f0061c2-e2f6-494b-8112-48f0aa965175-415x250-IndiaHerald.jpgఉంగరాల జుట్టు అయినా, అలల్లాంటి ముగ్గురులైనా, సిల్కీ జుట్టు అయినా ఏ రకం జుట్టు అయినా సరే అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే, కొంతమంది వారం రోజులకు ఒకసారి మాత్రమే తల స్నానం చేస్తారు. కానీ జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుడు తెలుపుతున్నారు. దీని ఫలితంగా జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, కుదుళ్ళు బలహీనపడడం, ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తHealth {#}oil;Aquaతల స్నానం ఎప్పుడు చేయాలో తెలిస్తే షాక్ అవుతారు..?తల స్నానం ఎప్పుడు చేయాలో తెలిస్తే షాక్ అవుతారు..?Health {#}oil;AquaSat, 26 Jun 2021 09:05:00 GMTఉంగరాల జుట్టు అయినా, అలల్లాంటి ముగ్గురులైనా, సిల్కీ జుట్టు అయినా ఏ రకం జుట్టు అయినా సరే అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  కొంతమంది మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే, కొంతమంది వారం రోజులకు ఒకసారి మాత్రమే తల స్నానం చేస్తారు. కానీ జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుడు తెలుపుతున్నారు. దీని ఫలితంగా జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, కుదుళ్ళు బలహీనపడడం, ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

**సెమీ కర్లింగ్  హెయిర్ **
 ఈ రకమైన జుట్టు ఉన్నవారు వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలని నిపుణులు తెలుపుతున్నారు. మీ జుట్టు బాగా ఒత్తుగా ఉన్నట్లయితే వారానికి రెండు సార్లు చేసిన సరిపోతుందంటున్నారు. ఈ సమయంలో షాంపూలను, నూనె ఆధారిత షాంపులను  పెట్టుకోకపోవడమే మంచిదని, పెట్టుకోవడం వల్ల జుట్టుకు సహజమైన కర్లేసును కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. అందుకని గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలని వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలియజేస్తున్నారు.

 **పొడి జుట్టు **
 పొడి జుట్టు ఉండే వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. వీరు వారి జుట్టుకు హెయిర్ డ్రాయింగ్ వాడిన, రంగు వేసుకున్న జుట్టు గడ్డిలా మారడం మాత్రం మారదు. వీరికి కుదుళ్లలో ఎలర్జీలు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా జుట్టు చివర్లు చిట్లిపోవడం, జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు నిర్జీవమై పోవడం సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ సమస్యలన్నింటిని దూరం చేయాలంటే సహజమైన షాంపూలను ఎంచుకోవాలి. వీటిలో హానిచేసే రసాయనాలు ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి ప్రమాదం అయ్యే అవకాశం ఉండదు అందుకే పొడి జుట్టు ఉన్నవారు వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం మంచిది. అలాగే నీళ్లు బాగా వేడిగా ఉన్నవి కాకుండా, గోరువెచ్చని నీళ్లతో తల స్నానం చేయాలి. అలాగే మంచినీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే కాయగూరలు పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

 **ఆయిల్ హెయిర్ **
 కుదుళ్లలో ఉండే నూనె గ్రంధులు ఎక్కువగా నూనెలను ఉత్పత్తి చేయడంతో జుట్టు జిడ్డుగా మారుతాయి. ఫలితంగా దురద, చుండ్రు సమస్యలు అధికమవుతాయి. కాబట్టి ఆయిలీ హెయిర్ వున్నవారు ఒకరోజు తప్పించి మరొక రోజు తలస్నానం చేయడం తప్పనిసరి. వీళ్లు నూనె ఆధారిత షాంపూలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కండిషనర్ ను కూడా జుట్టు చివర్లకు రాసుకోవాలి. దీని ద్వారా జుట్టులో నూనె ఉత్పత్తి కాకుండా చేయవచ్చు.

 **కర్లీ హెయిర్**
 ఇలాంటి జుట్టు కావాలని ఈ అమ్మాయికైనా ఉంటుంది. కర్లీ హెయిర్ ఉంటే జుట్టు కొద్దిగా పల్చగా ఉంటుంది. అలాగే ఒత్తుగా కనిపిస్తుంది.  వీరి కురులు అలల్లా ఎగురుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉంగరాల జుట్టు ఉన్న వారికి ఎదురయ్యే సమస్య జుట్టు తొందరగా పొడిబారడం. కావున గాఢత తక్కువగా ఉండే శ్యాంపూలతో వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది.



జగన్ సిద్ధం.. మరి కేసీఆర్‌ సంగతేంటి..?

అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ ..!

తెలంగాణ నాయకుల వాద‌న రాజ‌కీయ అవ‌స‌ర‌మే :పేర్నినాని

వంకాయతో ఈ కాంబినేషన్ అదరహో...!

పిల్లలకు 2021లో ముప్పు తప్పదా...?

జ‌గన్‌కు కేసీఆర్ శుక్ర‌వారం షాక్ ఇదే... 60 టీంఎసీలు హ‌రి...!

జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?

ఏపీ కి మరో భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>