
ఈటల వ్యాఖ్యలకు సమాధానంగానా..
జిల్లాల పర్యనటలో ఒక కార్యక్రమంలో తనతో ఎవరూ పెట్టుకోవద్దని…. ఎవరు పెట్టుకున్నా అంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా అది ఈటల గురించే చేసిన వ్యాఖ్యలంటూ ప్రచారం సాగింది. అదే సమయంలో సరిగ్గా నీటి ప్రాజెక్టుల పైన ఏపీ ప్రభుత్వాన్ని..వైఎస్సార్ ను మంత్రులు టార్గెట్ చేయటం మొదలు పెట్టారు. తెలంగాణ నుండే కాదు.. ఢిల్లీలోనూ మంత్రి ఏపీ ప్రాజెక్టుల అంశాలను..వైఎస్సార్ ను టార్గెట్ చేస్తూ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏడేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతలకు ఎప్పడూ దొరకని అప్పాయింట్ మెంట్ అడిగిన 15 నిమిషాల్లోనే ఖరారైంది. అందునా ప్రగతి భవన్ లోనే కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేవమయ్యారు. అంతే కాదు..వారిచ్చిన వినతి మీద వెంటనే స్పందించారు. ఆదేశాలు ఇచ్చారు.

లెక్క పక్కా అంటున్న గులాబీ నేతలు..
కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక పక్కా లెక్క ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కేబినెట్ నుండి ఈటల రాజేందర్ బహిష్కరణకు గురయ్యారు. ఆ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..బీజేపీలో చేరారు. త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాబోతోంది. కేసీఆర్ ప్రగతి భవన్ లోకి మంత్రులకే కొన్ని సందర్భాల్లో ఎంట్రీ లేదని..అది బానిస భవన్ అంటూ ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి ఉంటే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ లో ఉంటారంటూ విమర్శలు ఉన్నాయి. వీటికి సమాధానంగానే కేసీఆర్ కొత్త కార్యాచరణ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని మంత్రులు ఒకే సారి ఏపీ నీటి ప్రాజెక్టుల పైన టార్గెట్ చేస్తున్నారు.

సెంటిమెంట్…రాజకీయ వ్యూహం
దీని ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను ఓన్ చేసుకోవటం…షర్మిల పార్టీ ప్రకటన దగ్గర పడుతున్న వేళ…రాజకీయంగా ఇరకాట పరిస్థితులు క్రియేట్ చేయటం… కేసీఆర్ పైన సహజంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈటల అండ్ బీజేపీ టీం ను ట్రాప్ చేయటం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ నేతలు ఒక దళిత మహిళ లాకప్ డెత్ గురించి ఫిర్యాదు -న్యాయం చేయమని కోరేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. వెంటనే కేసీఆర్ స్పందించి..పరిహారంతో పాటుగా పోలీసుల పైన చర్యలకు ఆదేశించారు. దళితుల పైన దెబ్బ పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇక, దళిత సాధికారత మీద సడన్ గా అఖిలపక్షం ఏర్పాటు చేసారు. దీంతో..మరియమ్మ విషయంలో కాంగ్రెస్ నేతలకు తనను కలిసే అవకాశం ఇస్తూనే…క్రెడిట్ మాత్రం తన ఖాతాలో పడేలా నిమిషాల్లో నిర్ణయాలు తీసుకున్నారు.