PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb2fa2aef-bce3-4878-8001-7b57b50b5fcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrb2fa2aef-bce3-4878-8001-7b57b50b5fcd-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో దళిత వర్గానికీ కీలక పాత్రే ఉంది. తరతరాలుగా వెనుకబడిన ఈ వర్గాలకు న్యాయం చేస్తామని కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి చెబుతున్నారు. కానీ.. ఆయన దళితులకు సంబంధించిన కీలక హామీలనే విస్మరించారు. తెలంగాణకు తాను కాపలా కుక్కగా ఉంటానని.. తెలంగాణ మొదటి సీఎం దళితుడే అవుతారని కేసీఆర్ ఉద్యమ సమయంలో తరచూ చెప్పేవారు. ఈ మాటలు విని అప్పట్లో దళిత నేతలు పొంగిపోయారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాటలు నీటి మూటలే అయ్యాయి. ఇక మరో కీలక హమీ ఏంటంటే.. ప్రతి దళిత కుటుంబానికీ మూడు ఎకరాల సాగుభూమి ఇస్తానని చెప్పారుKCR{#}sunday;Friday;pragathi;Aqua;KCR;Congress;Telangana;CM;prema;Loveఆ వర్గానికి కేసీఆర్ బిస్కెట్లు.. మరి బుట్టలో పడతారా..?ఆ వర్గానికి కేసీఆర్ బిస్కెట్లు.. మరి బుట్టలో పడతారా..?KCR{#}sunday;Friday;pragathi;Aqua;KCR;Congress;Telangana;CM;prema;LoveSat, 26 Jun 2021 10:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో దళిత వర్గానికీ కీలక పాత్రే ఉంది. తరతరాలుగా వెనుకబడిన ఈ వర్గాలకు న్యాయం చేస్తామని కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి చెబుతున్నారు. కానీ.. ఆయన దళితులకు సంబంధించిన కీలక హామీలనే విస్మరించారు. తెలంగాణకు తాను కాపలా కుక్కగా ఉంటానని.. తెలంగాణ మొదటి సీఎం దళితుడే అవుతారని కేసీఆర్ ఉద్యమ సమయంలో తరచూ చెప్పేవారు. ఈ మాటలు విని అప్పట్లో దళిత నేతలు పొంగిపోయారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాటలు నీటి మూటలే అయ్యాయి.


ఇక మరో కీలక హమీ ఏంటంటే.. ప్రతి దళిత కుటుంబానికీ మూడు ఎకరాల సాగుభూమి ఇస్తానని చెప్పారు. ఈ వాగ్దానం కూడా బుట్టదాఖలే అయ్యింది. ఇలాంటి చర్యలతో దళిత వర్గాలు కేసీఆర్‌ పట్ల కోపంగా ఉన్నాయి. దీనికి తోడు ఒకటి, రెండు ఆరోపణలకే దళిత నేతలను అవమానకరంగా  పదవుల నుంచి పంపారన్న విమర్శలూ ఉన్నాయి. అంత కంటే ఎక్కువ విమర్శలు వచ్చినా ఇతరులను మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.


మళ్లీ ఇప్పుడు కేసీఆర్ కొన్నాళ్లుగా దళిత రాగం ఆలపిస్తున్నారు. దళిత్ ఎంపవర్ మెంట్ పథకం తీసుకొస్తానంటున్నారు. ఎన్నడూ విపక్ష నాయకులను ప్రగతి భవన్‌లోకే రానివ్వని కేసీఆర్ నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురిని శుక్రవారం ఆహ్వానించి చర్చలు జరిపారు. ఇప్పుడు ఇలా దళిత ఎంపవర్‌మెంట్‘ పథకం విధివిధానాల రూపకల్పన కోసం చర్చించడానికి  వివిధ  పార్టీల్లోని  దళిత ఎమ్మెల్యేలతో పాటు వివిధ పార్టీల్లోని దళిత నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు.


ఆదివారం దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేసీఆర్ ప్రగతి భవన్‌ లో వారితో కలిసి కూర్చుని భోజనం చేయనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత మొదలయ్యే ఈ సమావేశం రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగుతుందని సీఎంవో కార్యాలయం తెలిపింది. మరి ఇన్నాళ్లకు తమపై కేసీఆర్  కురిపిస్తున్న ప్రేమ పట్ల దళిత నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.





కేసీఆర్ కు "ఈటల" భయం..!

నా సినీ కెరియర్ లో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం: రోజా

బర్త్ డే బాయ్ అర్జున్ కపూర్ కి.. హాట్ గర్ల్ ఫ్రెండ్ ఏం ట్రీట్ ఇస్తుందో?

జూలై 1 నుంచి స్కూళ్లు కష్టమేనట?

ఆ ఇన‌సొంపైన బూతులు వైసీపీ నేత‌ల‌కు విన‌ప‌డ‌లేదా ?

టాలీవుడ్ లో హ్యాట్రిక్ హీరో ఉదయ్ కిరణ్..!

తల స్నానం ఎప్పుడు చేయాలో తెలిస్తే షాక్ అవుతారు..?

తెలంగాణ కాంగ్రెస్ ఘోరమైన తప్పిదం చేసిందా..?

ఆదివారం దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేసీఆర్ ప్రగతి భవన్‌ లో వారితో కలిసి కూర్చుని భోజనం చేయనున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత మొదలయ్యే ఈ సమావేశం రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగుతుందని సీఎంవో కార్యాలయం తెలిపింది. మరి ఇన్నాళ్లకు తమపై కేసీఆర్ కురిపిస్తున్న ప్రేమ పట్ల దళిత నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>