SportsSanjayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sara-tendulkar8728cd2f-dcdf-4e18-82a3-a54c87c76100-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sara-tendulkar8728cd2f-dcdf-4e18-82a3-a54c87c76100-415x250-IndiaHerald.jpgకోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌.. దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ డేటింగ్లో ఉన్నారంటూ గత కొద్దికాలంగా సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఐపీఎల్‌లో శుభ్‌మన్‌ మెరిసిన ప్రతిసారీ సారా అతడి ఫొటోలకు లవ్‌ ఎమోజీలతో క్యాప్షన్లు ఇచ్చి షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో అతడు ఫీల్డింగ్‌ చేస్తూ ఓ క్యాచ్‌ డ్రాప్‌ చేయగా ఆ వీడియోను ఇన్‌స్టాలో పెట్టి వెల్‌ ట్రై అంటూ సారా పోస్ట్‌ చేసింది. sara tendulkar{#}anjali;Sara Shrawan;Athadu;social mediaసారాతో శుభ్‌మన్ గిల్‌ డేటింగ్‌?సారాతో శుభ్‌మన్ గిల్‌ డేటింగ్‌?sara tendulkar{#}anjali;Sara Shrawan;Athadu;social mediaSat, 26 Jun 2021 10:25:35 GMTకోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌.. దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ డేటింగ్లో ఉన్నారంటూ గత కొద్దికాలంగా సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఐపీఎల్‌లో శుభ్‌మన్‌ మెరిసిన ప్రతిసారీ సారా అతడి ఫొటోలకు లవ్‌ ఎమోజీలతో క్యాప్షన్లు ఇచ్చి షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో అతడు ఫీల్డింగ్‌ చేస్తూ ఓ క్యాచ్‌ డ్రాప్‌ చేయగా ఆ వీడియోను ఇన్‌స్టాలో పెట్టి వెల్‌ ట్రై అంటూ సారా పోస్ట్‌ చేసింది. 

ప్రస్తుతం ఇంగ్లండ్‌ టూర్‌లో ఉన్న గిల్‌ ఇటీవల ముగిసిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. క్రికెట్‌ సంగతి పక్కనపెడితే గిల్‌ కంటే సారా వయసులో రెండేళ్లు పెద్దది. ప్రస్తుతం గిల్‌కు 21 ఏళ్లు కాగా, సారాకు 23 సంవత్సరాలు. అయినా వారిద్దరికి ఇష్టముంటే వయసుతో సంబంధమేముంది? సచిన్   కంటే సారా తల్లి అంజలి పెద్దది కాదా? అంటూ కూడా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల్లో చర్చ సాగుతోంది.

 తాజాగా సోషల్‌ మీడియాలో సారా.. గిల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల అకౌంట్లను కూడా ఫాలో అవడం ప్రారంభించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న చర్చ మళ్లీ ఊపందుకుంది. గిల్‌ సోదరిలు షానీల్‌ గిల్‌, సిమ్రాన సిద్ధును సారా ఇన్ స్టాలో అనుసరిస్తుండడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ కొందరు ట్రోలర్లు సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే ముందు అభిమానులతో గిల్ ఇన్ స్టాలో ముచ్చటించాడు. ఆ టైమ్‌లో ఓ అభిమాని మీరు ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అని అడగగా అతడు తాను సింగిల్‌ అని జవాబిచ్చాడు. అయినా ట్రోలర్లు సారా-గిల్‌ డేటింగ్‌ రూమర్లను ఆపకపోవడం కొసమెరుపు. గిల్ సింగిల్ అని చెప్పాక కూడా ట్రోల‌ర్లు సారాతో అత‌డికి లింక్ పెట్ట‌డ‌మేంట‌ని స‌చిన్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.



నేచ‌ర్ ల‌వర్ గా ధోనీ!

బీహార్‌లో టీచర్ కాబోతున్న అనుపమ.. నిజమేనా..?

పరువు హత్య: భర్తను చంపి, భార్యను 5 సార్లు తుపాకీతో కాల్చి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sanjay]]>