PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan2df24692-76dc-4222-9f3e-ad205424643f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan2df24692-76dc-4222-9f3e-ad205424643f-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షలని రద్దు చేశాయి. ఆఖరికి కేంద్ర పరిధిలో ఉండే పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపించింది. ఎప్పటికప్పుడు పరీక్షలని వాయిదా వేసుకుంటూ వచ్చింది గానీ, రద్దు వైపు మొగ్గుచూపలేదు. అయితే పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ గట్టిగానే డిమాండ్ చేశారు.jagan{#}Supreme Court;Parents;Lokesh;Lokesh Kanagaraj;court;Nara Lokesh;central government;Andhra Pradesh;Coronavirus;Jagan;YCP;TDPజగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!jagan{#}Supreme Court;Parents;Lokesh;Lokesh Kanagaraj;court;Nara Lokesh;central government;Andhra Pradesh;Coronavirus;Jagan;YCP;TDPFri, 25 Jun 2021 13:32:10 GMTఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షలని రద్దు చేశాయి. ఆఖరికి కేంద్ర పరిధిలో ఉండే పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపించింది. ఎప్పటికప్పుడు పరీక్షలని వాయిదా వేసుకుంటూ వచ్చింది గానీ, రద్దు వైపు మొగ్గుచూపలేదు. అయితే పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ గట్టిగానే డిమాండ్ చేశారు.


ఈ విషయంపై ఎప్పటికప్పుడు విద్యార్ధులతో ఆన్‌లైన్‌లో సమావేశమై చర్చించారు. విద్యార్ధుల తల్లిదండ్రులతో కూడా లోకేష్ మాట్లాడుతూ వచ్చారు. మెజారిటీ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సైతం పరీక్షలని రద్దు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు. కానీ లోకేష్ దీనిపై పోరాటం చేస్తున్నారని అనుకున్నారో లేక నిజంగా పిల్లల భవిష్యత్ బాగుండాలనే చేశారో తెలియదు గానీ జగన్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది.


అయితే సుప్రీం కోర్టు పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. అలాగే జూలై నెలాఖరులోపు మొత్తం ప్రక్రియని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షల నిర్వహణకు సరైన సమయం లేదని చెప్పి, పరీక్షలని రద్దు చేసింది. అంటే సుప్రీం ఆదేశాలతో కోర్టు దిగొచ్చింది. కానీ ఈ అంశాన్ని టీడీపీ నేతలు బాగానే వాడుకుంటున్నారు. లోకేష్ పోరాటం వల్లే ఏపీ ప్రభుత్వం దిగొచ్చిందనే విధంగా హడావిడి చేసేస్తున్నారు. టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులైతే లోకేష్ ఫోటోకు పాలాభిషేకం కూడా చేసేస్తున్నారు.


విద్యార్ధులకు నిజమైన మేనమామ లోకేష్ మాత్రమే అని అంటున్నారు. జగన్ మెంటల్ మేనమామ అని విమర్శిస్తున్నారు. అయితే సుప్రీం ఇచ్చిన తీర్పుతోనే వెనక్కి తగ్గుతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది. కానీ టీడీపీ నేతలు మాత్రం లోకేష్‌ని పైకి లేపేస్తున్నారు. ఏదేమైనా చేయని పనులకు క్రెడిట్ దక్కించుకోవడం టీడీపీ నేతలకే చెల్లుతుందని వైసీపీ శ్రేణులు కౌంటర్లు వేస్తున్నాయి.  




జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌కు వంగ‌ల‌పూడి లేఖ‌

ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో దేశంలో చాలా రాష్ట్రాలు పరీక్షలని రద్దు చేశాయి. ఆఖరికి కేంద్ర పరిధిలో ఉండే పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపించింది. ఎప్పటికప్పుడు పరీక్షలని వాయిదా వేసుకుంటూ వచ్చింది గానీ, రద్దు వైపు మొగ్గుచూపలేదు. అయితే పది, ఇంటర్ పరీక్షలని రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ గట్టిగానే డిమాండ్ చేశారు.

పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం!

తెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులు

నేను నాన్ లోకల్ ఏంటి.. యూనివర్సల్ : ప్రకాష్ రాజ్

బుల్లి పిట్ట: ఈ ఫ్యాన్ తో ఇంట్లో ఉన్న క్రిములన్ని పరార్..

ఈ టీకాతో కరోనా అంతమవుతుందా..?

టీఆర్ఎస్‌లో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు... ఒక కొత్త‌ మంత్రి...!

బిగ్ బ్రేకింగ్: ఏపీ సిఎస్ ను జైలుకి పంపిస్తాం: ఎన్ జీ టి వార్నింగ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>