AstrologyHareesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_horoscope/horoscope717d3612-80ca-4d9c-b592-b0d85a5a3591-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_horoscope/horoscope717d3612-80ca-4d9c-b592-b0d85a5a3591-415x250-IndiaHerald.jpgరాశి ఫలాలు మేషరాశి అనవసర వ్యయ ప్రయాసలు తప్పవు.సమయం వృధా.వృత్తి, ఉద్యోగాల్లో అధిక పనిభారం.పై అధికారులతో సమస్యలు.వ్యాపారపరంగా అధిక శ్రమ స్వల్ప లాభం. వృషభరాశి అన్ని విషయాల్లో ప్రతికూల ప్రభావం.ఆలోచనలు స్థిరంగా ఉండవు.వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు.బంధువులతో వివాదాలు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపలు. మిధునరాశి కోరుకున్న విధంగా అన్ని విషయాలు లాభసాటిగా ఉంటాయి.వృత్తి ఉద్యోగాల్లో ఊహించని లాభాలు.బంధువర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి.కుటుంబంలో శుభకరమైన వాతావరణం.horoscope{#}greeshma;nithya new;raasi;Nakshatram;Janagama;Anandam;prasad;sreeజూన్ 25 - శుక్రవారం రాశి ఫలాలు..జూన్ 25 - శుక్రవారం రాశి ఫలాలు..horoscope{#}greeshma;nithya new;raasi;Nakshatram;Janagama;Anandam;prasad;sreeFri, 25 Jun 2021 06:00:00 GMTచైతన్య గీత

శ్రీ గురుభ్యోననమః!
జ్ఞానం వలన సంస్కారం,
సంస్కారము వలన వ్యక్తి,
వ్యక్తి వలన సమాజము,
 సంస్కరింప బడతాయి.
సద్విద్యతో జ్ఞానాన్ని
అందించే సద్గురువును పొందండి.
మీ జీవన గమ్యాన్ని తన ఉపదేశ
చైతన్యంతో సాకారం చేస్తాడు సద్గురువు.
.

ఈనాటి పంచాంగం

శుక్రవారం

స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉత్తరఆయణం గ్రీష్మ ఋతువు జేష్ఠ మాసం

తిథి బ.పాడ్యమి రా8.59

నక్షత్రం : మూల ఉ6.40 పూర్వాషాఢ తె4.26

యోగం: బ్రహ్మ రా10.38

కరణం: బాలువ ఉ10.31 కౌలువ రా8.59

వర్జ్యం : శే.ప ఉ6.40కు తిరిగి మ3.22-4.49కు

దుర్ముహూర్తం : దు. ము ఉ8.24-9,16కు తిరిగి మ12.45-1.37కు

అమృతకాలం : అమ్మ రా12.04-1.31కు

సూర్యోదయం : 5.44

సూర్యాస్తమయం : 6.54



రాశి ఫలాలు
మేషరాశి
అనవసర వ్యయ ప్రయాసలు తప్పవు.సమయం వృధా.వృత్తి, ఉద్యోగాల్లో అధిక పనిభారం.పై అధికారులతో సమస్యలు.వ్యాపారపరంగా అధిక శ్రమ స్వల్ప లాభం.

వృషభరాశి
అన్ని విషయాల్లో ప్రతికూల ప్రభావం.ఆలోచనలు స్థిరంగా ఉండవు.వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు.బంధువులతో వివాదాలు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపలు.

మిధునరాశి
కోరుకున్న విధంగా అన్ని విషయాలు లాభసాటిగా ఉంటాయి.వృత్తి ఉద్యోగాల్లో ఊహించని లాభాలు.బంధువర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి.కుటుంబంలో శుభకరమైన వాతావరణం.

కర్కాటకరాశి
వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి.ఆకస్మిక ధనలాభం.
వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం.కుటుంబంలో వివాహాది శుభకార్యాలకు చేసే ప్రయత్నం శుభఫలితాలు ఇస్తుంది.

సింహరాశి
భాగస్వాములతో వివాదాలు.వృత్తి ఉద్యోగాల్లో పని భారం.వ్యవహారాలు నిరాశ కలిగించే అవకాశం.
ఆర్థిక లావాదేవీలు నిరాశాజకం.బంధువర్గంతో వివాదాలు.

కన్యారాశి
వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత లేదు.పనులు నెమ్మదిస్తాయి.అసహనంతో వివాదాలు ఏర్పడే అవకాశం.ఆర్థిక అంశాల్లో ప్రతికూలత.ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతాయి.పండిత వర్గాలకు కొంత ఊరట.శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగవు.

తులారాశి
వృత్తి ఉద్యోగాల్లో పురోగతి.ప్రమోషన్స్,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాల్లో నూతన ఒప్పందాలు. ఆర్థికంగా ప్రగతి.అప్రయత్నంగా పనులు పూర్తి అవుతాయి.కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికరాశి
అనుకోని సంఘటనలు.వ్యయ ప్రయాసలు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్యం సహకరించదు. మిత్రులతో మాటపట్టింపు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు.ఆర్థిక పరమైన అంశాలు కలిసిరావు.
కుటుంబం లో అనవసర వాదోపవాదాలు.

ధనస్సురాశి
అన్ని విషయాలూ అనుకూలం.నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి ఉద్యోగాల్లో పురోగతి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వివాహాది శుభకార్యాలకు సంబంధించి చేసే ప్రయత్నం లో శుభఫలితాలు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.

మకరరాశి
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.చేయని తప్పుకు మాటపడాల్సి వస్తుంది.వ్యాపార వ్యవహారాలు కలిసిరావు.వృధా ప్రయాణాలు,అనవసరమైన ఖర్చులు.ఆదాయాలు సమయానికి అందక ఇబ్బంది.
కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు.

కుంభరాశి
అవసరానికి మించి ఖర్చులు.ప్రయాణాల్లో ఆటంకాలు.వృత్తి ఉద్యోగాల్లో పని భారం.అవసరానికి డబ్బు చేతికి అందదు.ఆరోగ్య పరమైన సమస్యలు.పైఅధికారుల వేధింపులు.కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు.ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మీనరాశి
అప్రయత్న కార్యసిద్ధి.ఆర్థికంగా కలిసివస్తుంది.వృత్తి ఉద్యోగాల్లో పురోగతి.పదోన్నతులు,అనుకోని అవకాశాలు లభిస్తాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం.వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. గొప్పవారి ఆహ్వానాలు,స్నేహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.శుకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తాయి.


రాశి ఫలాలు మీ తలరాతను తెలుపుతాయ?
మేషం నుంచి మీనం వరకు జ్యోతిష్య పరంగా పన్నెండు రాశులు.మన జన్మ నక్షత్రం లేదా నామాక్షరం బట్టి మన జన్మ రాశి తెలుస్తుంది.చంద్రుడు సంచరించే నక్షత్రము నిత్య నక్షత్రం అవుతుంది.మనం పుట్టిన సమయానికి చంద్ర సంచార నక్షత్రము మన జన్మ నక్షత్రం అవుతుంది.ఆనక్షత్రం ఉన్న రాశే జన్మ రాశి.ఒక రాశిలో మూడు నక్షత్రాల తాలూకు 9పాదాలు ఉంటాయి.అంటే 12 raashulu ×9 పాదాలు=108. ముఖ్యంగా నక్షత్రాలు 27.ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే 27×4=108.
ఈ విధంగా రాశులు నక్షత్ర అమరిక.మన జన్మ లేదా నామాక్షరాన్ని బట్టి మన జన్మ రాశి నుండి రాశి ఫలం తెలుసుకోవాలనే రోజు నాటి నక్షత్రం ఉన్న రాశిలో చంద్ర సంచారము ఆధారంగా ఆరోజుకి చంద్రునితో పాటు మిగతా గ్రహాలు ఉన్న రాశులను బట్టి మన జన్మ రాశి యొక్క దిన ఫలం,వారఫలాలు,మాసఫలాలు,సంవత్సర రాశి ఫలాలు లెక్కింపు జరుగుతాయి.అంటే ఒక రాశిలో మూడు నక్షత్రాల తాలూకు 9పాదాలు కాబట్టి చెప్పబడే రాశి ఫలాల్లో 100/9 మాత్రమే మంచి కానీ,చెడు కానీ తీసుకోవాలి.రాశి ఫలాలు ఒక సూచన ప్రాయంగా తీసుకొని మన ప్రణాళికను దానికి అనుగుణంగా చేసుకుని కావాల్సిన జాగ్రత్తలు తీసకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.
ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా వారి భవిష్యత్తు తెలియాలంటే జన్మ జాతకం ఉండాలి.దానిని బట్టే వ్యక్తిగతంగా ఎవరికి వారు వారి భవిష్యత్తు తెలుసుకోవచ్చు.అయితే జన్మ జాతకాన్ని జ్యోతిష పరంగా పూర్తి పరిజ్ఞానం ఉన్న జ్యోతిష పండితుడితో చుపించుకుంటేనే మంచి,చెడులు తెలిసి, వారు సూచించే వేదోక్త పరిహారాలు పాటించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు.
కాబట్టి రాశి ఫలాలలో మంచి ఉంటే ఎక్కువ ఆనందం వద్దు.చెడు ఉంటే మానసికంగా కృంగి పోవద్దు.


సిద్దాంత శిరోమణి
 బ్రహ్మశ్రీ డా. ఎ. ప్రసాద్ శర్మ సిద్ధాంతి గారు, చండి, ప్రత్యంగిర, మహావిద్యా ఉపాసకులు, జ్యోతిష, వాస్తు నిపుణులు, పంచాంగకర్త, సిద్దాంతి
1 -12 -1, కామారెడ్డిగూడెం, దేవరుప్పుల మం,, జనగామ జి., తెలంగాణ.



చిరు @ 40 ఏళ్ళు.. ఊరికిచ్చినమాట..

రామ్ కి మంచి కిక్ ఇచ్చిన లింగుస్వామి

సంస్థాధినేతలకు భిన్నం.. మా 'కోటి' సర్

వావ్.. సూపర్ టాలెంట్.. తెలంగాణలో మరో మట్టిలోమాణిక్యం?

విజయశాంతి భర్తకు ఆ స్టార్ ఫ్యామిలీ తో గల చుట్టరికం ఏంటి .. ?

విజయశాంతి గురించి తెలియని కొన్ని విషయాలు..

ఉద్యోగుల పాలిట ఆశా దీపం DR. సరిపల్లి కోటి రెడ్డి ...

జాయ్ ఆఫ్ జ‌ర్నీ.. కోటి మందికి వెలుగునిచ్చే దిశగా ' కోటిరెడ్డి ' ఫార్ములా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>