MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakonda-cinema-careerf116742c-afcc-4712-af1b-d9de6c96e7da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakonda-cinema-careerf116742c-afcc-4712-af1b-d9de6c96e7da-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలతో బాగా ఫేమస్ అయినప్పటికీ, ఆ తరువాత ఆ రేంజ్ హిట్ అయితే మళ్లీ రాకపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. VIJAY DEVARAKONDA CINEMA CAREER{#}parasuram;Dear Comrade;Mahanati;World Famous Lover;Devarakonda;Geetha Govindam;Gita Govindam;Taxiwala;Arjun Reddy;vijay deverakonda;Joseph Vijay;Darsakudu;Director;Cinemaరౌడీ ఫ్యూచర్ ఏంటో తెలుసారౌడీ ఫ్యూచర్ ఏంటో తెలుసాVIJAY DEVARAKONDA CINEMA CAREER{#}parasuram;Dear Comrade;Mahanati;World Famous Lover;Devarakonda;Geetha Govindam;Gita Govindam;Taxiwala;Arjun Reddy;vijay deverakonda;Joseph Vijay;Darsakudu;Director;CinemaFri, 25 Jun 2021 12:00:00 GMT
విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాలతో బాగా ఫేమస్ అయినప్పటికీ, ఆ తరువాత  ఆ రేంజ్ హిట్ అయితే మళ్లీ రాకపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. అప్పటి నుండి విజయ్ నటించిన సినిమాలు చూస్తే, తనకు వచ్చిన స్టార్ డం ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడేమో అన్న భావనలు కలుగుతున్నాయి. అయితే ఎటువంటి కారణాల వలన విజయ్ మళ్లీ సరైన హిట్ కొట్టలేకపోయాడో చూద్దాం. 2017 లో అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఒక కొత్త డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కించాడు. కానీ ఇందులో ఉన్న బోల్డ్ కంటెంట్ మరియు యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో విజయ్ కి మరిన్ని అవకాశాలు వచ్చాయి. 

వెంటనే "ఏ మంత్రం వేశావే" సినిమా చేశాడు. ఇందులో ఏమి విషయం ఉందని చేశాడో ఎవ్వరికీ అర్ధం కాదు. రిలీజ్ అయినట్లు కూడా ఎవ్వరికీ తెలియలేదు. అలా వచ్చి వెళ్ళిపోయింది. ఈ సినిమా విషయంలో విజయ్ కొంచెం ఆలోచించి ఉండాల్సింది. అప్పుడప్పుడే స్టార్ హీరోగా మారుతున్న సమయంలో ఇటువంటి సినిమా చేయడం మూలాన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అంతలోనే మహానటి లాంటి అద్భుతమైన మూవీలో ఒక పాత్ర చేసి మెప్పించాడు. కానీ ఇందులో సహయకపాత్ర  కాబట్టి విజయ్ కి క్రెడిట్ ఇవ్వలేము. కానీ తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేశాడు.ఆ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన "గీత గోవిందం" ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఈ సినిమాలో విజయ్ రష్మిక  మందన్న ల మధ్య కెమిస్ట్రీ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమా తరువాత వరుస పెట్టి సినిమాలు చేశాడు కానీ ఆ రేంజ్ హిట్ అయితే లేదు. 

పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన నోటా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మళ్లీ టాక్సీవాలా మూవీతో కాస్త పరవాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమా సబ్జెక్ట్ కొత్తదే అయినా కొత్త దర్శకుడు కావడంతో కీలక సమయంలో చేతులెత్తేశాడు. ఆ తర్వాత విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ మాత్రం యావరేజ్ గా నిలువగా, వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం దారుణంగా నిరాశపరిచింది. అందుకే స్టార్ డం వచ్చినా సినిమాలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.  ఈ విధంగా విజయ్ దేవరకొండ కెరీర్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే తనను హీరోగా నిలబెట్టాయి. నెక్స్ట్ మూవీ ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇది అయినా విజయ్ కెరీర్ ని విజయాల బాట పట్టిస్తుందా చూడాలి.




ప్ర‌కాశ్ రాజ్ కే నా మ‌ద్ద‌తు: బండ్ల గ‌ణేశ్‌

ఆ హీరోలకు సాధ్యం కానిదీ ధనుష్ కి ఎలా సాధ్యమైంది.?

సింగర్స్ వచ్చి హీరోయిన్స్ గా దూసుకుపోతున్న నటీమణులు

ఈమె టాప్ డైరెక్టర్ భార్య అని తెలుసా..?

మన ఇండియాలో వర్షాకాలంలో చూడవల్సిన ఆ ప్రాంతాలు ఇవే..!

అయితే రామ్ గాల్లో దీపం పెట్టాడా.. లక్కీ గా వర్కౌట్ అయ్యింది!!

బాలయ్య వినాయక చవితి సెంటిమెంట్ వెంటాడుతున్న యష్ భయాలు !

అమ్మకానికి టాలీవుడ్ హీరోల ఆస్తులు

డెల్టా ప్లస్ చాలా డేంజర్.. పక్క నుండి వెళ్ళిన సోకుతుందట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>