Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia7ab0a1c-e1b3-4c08-b2d5-64bc76bbce7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlia7ab0a1c-e1b3-4c08-b2d5-64bc76bbce7c-415x250-IndiaHerald.jpgకోహ్లీకి ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే దిగ్గజ బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎప్పుడూ తనదైన శైలిలో బ్యాట్ చేస్తూ పరుగుల వరద పారిస్తు ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే కోహ్లీ ని రికార్డుల రారాజు అని.. పరుగుల యంత్రం అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు అభిమానులు. కానీ గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ ఆట తీరు చూస్తే మాత్రం అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తోంది. ఒకప్పుడు భారీ స్కోరు చేస్తూ పరుగుల వరద పారించిన కోహ్లీ ఇప్పుడు మాత్రం కొKohli{#}VIRAT KOHLI;England;Hanu Raghavapudi;Cricketసెంచరీకి దూరమైన కోహ్లీ.. మాజీ బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడో తెలుసా?సెంచరీకి దూరమైన కోహ్లీ.. మాజీ బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడో తెలుసా?Kohli{#}VIRAT KOHLI;England;Hanu Raghavapudi;CricketFri, 25 Jun 2021 18:30:00 GMTకోహ్లీకి ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే దిగ్గజ బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.  ఎప్పుడూ తనదైన శైలిలో బ్యాట్ చేస్తూ పరుగుల వరద పారిస్తు ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే కోహ్లీ ని రికార్డుల రారాజు అని.. పరుగుల యంత్రం అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటారు అభిమానులు.  కానీ గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ ఆట తీరు చూస్తే మాత్రం అభిమానులను తీవ్ర నిరాశ పరుస్తోంది. ఒకప్పుడు భారీ స్కోరు చేస్తూ పరుగుల వరద పారించిన కోహ్లీ ఇప్పుడు మాత్రం కొన్ని పరుగులు చేయడానికి కూడా తడబడి పోతున్నాడు.



 అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతుంది. ఇక ఇంగ్లాండ్ సౌతాంప్టన్  వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ కేవలం రెండు ఇన్నింగ్స్ లో 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఎప్పుడు జట్టు విజయంలో కీలకపాత్ర వహించే కోహ్లీ చివరికి తడబడ్డాడు. దీంతో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే కెప్టెన్ కోహ్లి బ్యాట్మెన్గా.. కెప్టెన్గా కూడా విఫలం అయ్యాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్స్ కూడా తెర మీదకు వస్తున్నాయి.



 అయితే 2019 నవంబర్ లో సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేక పోయాడు. ఇక ఈ ప్రభావం టీమిండియాపై ఎక్కువగా పడుతుంది. అయితే తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటివరకు టెస్టు లో విరాట్ కోహ్లీ 7547 పరుగులు చేశాడు. వన్ డే, టీ20ల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ మిగతా ఫార్మట్ తో పోలిస్తే టెస్టుల్లో ఆడటం కష్టం.. ఇక ఇప్పుడు మారిన పరిస్థితుల్లో పరుగులు చేయడం మరింత కష్టం.. అందుకే కోహ్లీకి ప్రస్తుతం సవాళ్లు ఎక్కువవుతున్నాయి. అయితే కోహ్లీ సెంచరీ కరువుకి ఇప్పటికైనా స్వస్తి చెప్పడం బెటర్ అంటూ సూచించాడు.



అలా అయితే.. భవిష్యత్తులో రిషబ్ పంత్ కి ఇబ్బందులు తప్పవు?

ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే.. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆటగాడు?

జడేజా ఎంపీకే బెడిసికొట్టింది.. మరోసారి గెలికిన మంజ్రేకర్?

ఓటమి తో కోహ్లీ సీరియస్.. అతనిపై వేటు?

ఒక్క మ్యాచ్ తో విశ్వ విజేత ఎలా.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?

జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?

రాహుల్ ద్రావిడ్ పై నమ్మకం ఉంది : సచిన్

జూన్ 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు మైనస్ అదేనా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>