PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/46-years-since-indira-gandhi-declared-a-state-of-emergency-e2aed258-9981-4fa0-b421-79b78218d244-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/46-years-since-indira-gandhi-declared-a-state-of-emergency-e2aed258-9981-4fa0-b421-79b78218d244-415x250-IndiaHerald.jpgభారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయంగా జూన్ 25కు పేరుంది. ఎందుకంటే ఆ రోజు ప్రకటించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యంపై జరిగిన హేయమైన దాడిగా భావిస్తారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న ఏక పక్ష నిర్ణయం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. politics{#}kranthi;kranti;Pakistan;Election;Bareli;Nayak;Gujarat - Gandhinagar;Bihar;Congress;war;Government;Party;Prime Minister;Indira Gandhi;central government;India;Juneఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించి 46ఏళ్లు..!ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించి 46ఏళ్లు..!politics{#}kranthi;kranti;Pakistan;Election;Bareli;Nayak;Gujarat - Gandhinagar;Bihar;Congress;war;Government;Party;Prime Minister;Indira Gandhi;central government;India;JuneFri, 25 Jun 2021 07:00:42 GMTభారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి కాలంగా జూన్ 25ని భావిస్తారు. ఎందుకంటే ఉక్కుమహిళగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఇందిరాగాంధీ అధికారాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఒంటెద్దు పోకడలకు పోయారు. ప్రధాని పదవిలో ఉంటూ మంత్రివర్గాన్ని ఏ మాత్రం సంప్రదించకుండా జూన్ 25న అర్ధరాత్రి దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దాదాపు 21నెలల పాటు జరిగిన ఈ అత్యవసర పరిస్థిితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపి ఆనాడు విమర్శల పాలయ్యారు ఇందిరా గాంధీ. అంతేకాదు ఎలక్షన్స్ వాయిదా వేయడం.. ప్రభుత్వంపై వ్యతిరేకతను అణిచివేత, పత్రికలపై నిబంధనలను విధించడం లాంటివి చేశారు.

1971 జనరల్ ఎలక్షన్స్ లో ఇందిరా గాంధీ అధ్యక్షతన అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది హస్తం పార్టీ. 352స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేని విజయం సాధించింది. అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం ఉంది. ఇంత ఉన్నా ఇందిరా గాంధీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజల్లో విమర్శల పాలయ్యారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు శక్తిని కూడగట్టుకోవడం, రాజకీయ, ఆర్థిక విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇందిరా గాంధీని కలవరానికి గురిచేశాయి.

భారత్ లో అత్యవసర పరిస్థితి దీనికంటే ముందే రెండు సార్లు విధించారు. అదెప్పుడంటే 1962వ సంవత్సరంలో చైనాతో యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇందిరా గాంధీ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ..1973-75 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. అందులో భాగంగానే గుజరాత్ లో నవనిర్మాణ్ ఉద్యమం జరిగింది. గుజరాత్ లో ప్రభుత్వం గద్దె దిగడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ బీహార్ లో ఏబీవీపీ చేపట్టిన ఉద్యామానికి తన మద్దతు ప్రకటించారు. అంతేకాదు జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి పిలుపుతో ప్రజలు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు దిగారు.

1971 ఎన్నికల్లో రాయ్‌ బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిరకు పోటీగా.. యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ తరఫున రాజ్‌నారాయణ్‌ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ ఎలక్షన్స్ లో ఇందిర.. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడంతో పాటు.. అధికార  దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయన అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా 1975, జూన్‌ 12న తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. ఇందిర ఎన్నికను రద్దు చేయడమే కాకుండా..  మరో ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల బరిలోకి దిగొద్దని సూచించింది.  దీంతో ఆమె ప్రధాని పదవిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.



నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రండి.. కేసిఆర్ ఆదేశాలు?

మహా లో మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి.. థర్డ్ వేవ్ ఎఫెక్టా.. ?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

భర్తకు బుద్ది చెప్పాలనుకుంది ఓ భార్య.. చివరికి షాక్..?

2023 వార్‌... ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు మాత్రం టిక్కెట్లు లేవ్‌..!

హ్యాపీ బర్త్ డే : నటి ఊర్వశి శారద పుట్టిన రోజు నేడు..!

వ్యాక్సినేషన్ విషయంలో జగన్ పై ఒత్తిడి పెంచుతున్న కేసీఆర్..

మెగాస్టార్ ఎన్ని కోట్లకు అధినేతో తెలుసా..?

రాష్ట్రాలకు కూడా పెట్రో పాపం.. కేంద్రం మాస్టర్ ప్లాన్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>