WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe4ed48309-4500-4a8c-93fe-10855975a91c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe4ed48309-4500-4a8c-93fe-10855975a91c-415x250-IndiaHerald.jpgకరోనా కారణంగా అందరి జీవితాలు తలకిందులైపోయాయి. రోజు వారి కూలీకి పని లేక అల్లాడుతున్నాడు. చిరు వ్యాపారి వ్యాపారం చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాడు. సగటు మధ్యతరగతి ఉద్యోగి కంపెనీ క్లోజ్ అవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నాడు. ఇవన్నీ ఒక బాధయితే నేటి బాలలే రేపటి పౌరులు అని మనము ఎప్పటి నుండో చెబుతూ వచ్చిన బాలల పరిస్థితి ఇంకా దారుణం. VIJAYAM MEEDHE{#}Kanna Lakshminarayana;students;Chiranjeevi;Andhra Pradesh;Coronavirusవిజయం మీదే: పరీక్షలు లేవని చింతిస్తున్నారా ?విజయం మీదే: పరీక్షలు లేవని చింతిస్తున్నారా ?VIJAYAM MEEDHE{#}Kanna Lakshminarayana;students;Chiranjeevi;Andhra Pradesh;CoronavirusFri, 25 Jun 2021 21:00:00 GMTకరోనా కారణంగా అందరి జీవితాలు తలకిందులైపోయాయి. రోజు వారి కూలీకి పని లేక అల్లాడుతున్నాడు. చిరు వ్యాపారి వ్యాపారం చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాడు. సగటు మధ్యతరగతి ఉద్యోగి కంపెనీ క్లోజ్ అవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నాడు. ఇవన్నీ ఒక బాధయితే నేటి బాలలే రేపటి పౌరులు అని మనము ఎప్పటి నుండో చెబుతూ వచ్చిన బాలల పరిస్థితి ఇంకా దారుణం. స్కూల్స్ కాలేజెస్ అన్నీ క్లోజ్ అవడంతో ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా పూర్తి స్థాయిలో విద్యారంగం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇది ఇలా ఉంటే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాల్సిన స్టూడెంట్స్ బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి. చిన్నప్పటి నుండి పోటీతత్వంతో ఎంతో కష్టపడి చదివి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు దిగ్విజయంగా దూసుకొచ్చిన పిల్లలకు, ఇంకొన్ని రోజుల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా ? మన జీవితంలో మొదటిసారిగా ఒక మెట్టు ఎక్కాము అన్న ఫీలింగ్ ఉంటుంది.

కానీ ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కరోనా పుణ్యమా అని ఈ సంవత్సరం జరగాల్సిన టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ రద్దు చేసినట్లుగా నిన్ననే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో విద్యార్థుల్లో రకరకాల భవనాలు కలిగి ఉంటాయి. కొందరు విద్యార్థులు హమ్మయ్య...ఇక పరీక్షల్లేవు హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు. ఇంకొంతమంది అరేయ్.... ఎగ్జామ్స్ పెట్టుంటే అంత బాగా రాసి ఉంటానా ? అన్న సందేహం కలగొచ్చు. కానీ ఎవ్వరైతే చదువే ప్రధాన లక్ష్యంగా మరియు ఆయుధంగా కష్టపడి పరీక్షలు ఎప్పుడొస్తాయా మన ప్రతిభను లోకానికి తెలియచేద్దామా అని కళలు కానీ ఉంటారో, వారు మాత్రం తీరని నిరాశకు లోనయి ఉంటారు. అలంటి వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.

* ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు చదువుల కన్నా బ్రతికి ఉండడమే ముఖ్యం.

* పరీక్షల కన్నా ఈ తరం ప్రాణాలతో ఉండడం ప్రధానం.

* ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ ప్రజలకు ఏదైతే మంచిదో అదే చేస్తాయి. మీకు నష్టం కలిగించే పని ఎప్పుడూ చెయ్యవు.

* మీరు ఇంకొంతకాలం మీ పుస్తకాలతో కుస్తీ పదండి. మీరు పూర్తి స్థాయిలో పరీక్షలకు సన్నద్ధం కాకపోయి ఉంటే, ఈ సమయాన్ని దానికి ఉపయోగించుకోండి.

* మీరు పరీక్షలు జరగలేదని బాధపడుతున్నారు కదా మీకు మీరే పరీక్షను పెట్టుకోండి, చదివిని విషయాలను మీరే చూడకుండా రాయడానికి ప్రయత్నించండి. ఇది మీకు మంచి అవకాశం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

* పరీక్షల ద్వారా వచ్చే మార్కులు మీకు సంఘంలో మంచి పేరును మరియు మంచి ఉద్యోగంన్ని సాధించ్ పెట్టగలవు. కానీ మొదట నిన్ను నువ్వు గెలువు, ఈ పరీక్షల రద్దు సమయంలో నీలో కలిగే వ్యతిరేక ఆలోచనలను చంపి వాటిపై గెలువు.

* ఆ భగవంతుడు కరుణిస్తే అతి త్వరలోనే మనమంతా ఈ కరోనా మహమ్మారి నుండి బయటపడుతాము. ఎప్పటి లాగే స్కూల్స్ కి వెళుతాము. పార్కులు, హోటళ్లు, సినిమాలు ఇలా అన్నింటినీ ఎంజాయ్ చేస్తాము.

* కానీ మనకు కలిగిన ఈ కఠినమైన సమయంలో మాత్రం కరోనా నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందాము.

కాబట్టి నిరాశ పడకండి. దైర్యంగా తరువాత ఎప్పుడు పరీక్షలు జరిగినా అందుకు సిద్ధంగా ఉండండి.  





ఎక్క‌డి లోపం.. ఎవ‌రు చేస్తున్నారు? జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం

సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన స్టార్ డైరెక్టర్.. కారణం అదేనా..?

ఆ తేదీలోగా ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా?

విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ అదిరిపోయే ఆఫర్..

కరోనా కారణంగా అందరి జీవితాలు తలకిందులైపోయాయి. రోజు వారి కూలీకి పని లేక అల్లాడుతున్నాడు. చిరు వ్యాపారి వ్యాపారం చేసుకునే అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాడు. సగటు మధ్యతరగతి ఉద్యోగి కంపెనీ క్లోజ్ అవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నాడు. ఇవన్నీ ఒక బాధయితే నేటి బాలలే రేపటి పౌరులు అని మనము ఎప్పటి నుండో చెబుతూ వచ్చిన బాలల పరిస్థితి ఇంకా దారుణం.

రాధే శ్యామ్ కోసం అంతపని చేసిన ప్రభాస్, పూజా హెగ్డే....

థియేటర్లు తెరిచినా పూర్వ వైభవం వచ్చేనా ?

ఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>