MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tolly-woode76c5c77-ee71-4c0d-8710-8b1feaac0f4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tolly-woode76c5c77-ee71-4c0d-8710-8b1feaac0f4a-415x250-IndiaHerald.jpgనేడు ఊర్వశి శారద పుట్టిన రోజు. తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె.. జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లోనూ రాణించి ప్రజల పొగడ్తలు అందుకున్నారు. శారదకు ఇండియా హెరాల్డ్ బర్త్ డే విషెస్ చెబుతోంది. tolly wood{#}urvashi;Guntur;Loksabha;Natakam;Tenali;Elections;Chitram;Telugu Desam Party;MP;Sharada;Heroine;June;Telugu;Congress;Cinemaహ్యాపీ బర్త్ డే : నటి ఊర్వశి శారద పుట్టిన రోజు నేడు..!హ్యాపీ బర్త్ డే : నటి ఊర్వశి శారద పుట్టిన రోజు నేడు..!tolly wood{#}urvashi;Guntur;Loksabha;Natakam;Tenali;Elections;Chitram;Telugu Desam Party;MP;Sharada;Heroine;June;Telugu;Congress;CinemaFri, 25 Jun 2021 08:00:00 GMTకేవలం తెలుగు సినిమాలతోనే కాదు.. మలయాళంలోనూ అద్భుతమైన నటన ప్రతిభ కనుబరిచి.. ప్రేక్షకుల ఆదరణను పొందిన నటి శారద. ఆమె పుట్టిన రోజు ఈ రోజు. గుంటూరు జిల్లా తెనాలిలో.. 1945వ సంవత్సరం జూన్ 25న శారద జన్మించారు. ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. కన్యాశుల్కం అనే సినిమాలో బాల నటిగా తన సినీ కెరీర్ ను ఆరంభించారు. చిన్నతనంలో భరత నాట్యం నేర్చుకున్న శారదకు.. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కొన్ని నాటకాల్లో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. రక్తకన్నీరు అనే నాటకం శారద జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. నటుడు నాగభూషణం సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

1975లో మలయాళ వ్యక్తిని వివాహమాడి కేరళలో అడుగుపెట్టిన శారద.. అనేక మలయాళ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా  స్వయం వరం చిత్రంలో నటనకు జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో.. నాలుగు భాషల్లో తీశారు. దీంతో ఆమె నాలుగు భాషల్లోనూ నటించాల్సి వచ్చింది. అలాంటి సమయంలోనే మలయాళ చిత్రసీమలో వరుస అవకాశాలు అందుకొని తన ప్రతిభను కనుబరిచారు. అక్కడి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తులాభారం, స్వయం వరం లాంటి చిత్రాలతో జాతీయ స్థాయి ఉత్తమ నటిగా పేరు గాంచారు. అంతేకాదు మూడు సార్లు ఊర్వశి అవార్డు అందుకొని ఊర్వశి శారదగా అందరి నోళ్లలో నానారు. చండశాసనుడు అనే సినిమాతో తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు శారద.  

శోకరస, రౌద్రరస పాత్రల్లో నటించి తానేంటో నిరూపించుకున్నారు శారద. అంతేకాదు అత్త పాత్రలోనూ మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ప్రజల నుంచి ఆదరణ పొందారు. 1996లో తెలుగు దేశం పార్టీ తరఫున తెనాలి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఎంపీ పదవిలో ఉంటూ తన నియోజకవర్గానికి రైల్వే లైన్ మంజూరయ్యేలా చేసి ప్రజల నుంచి పొగడ్తలు అందుకున్నారు. రోడ్లు, పాఠశాలలు నిర్మించారు. అయితే కేవలం రెండు సంవత్సరాలకే లోక్‌సభ రద్దు కావడంతో 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. రెండోసారి లోక్ సభకు పోటీ చేసి ఓటమి చవిచూశారు.  2009వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సినిమాలకు కూడా న్యాయం చేశారు.



ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

మహా లో మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి.. థర్డ్ వేవ్ ఎఫెక్టా.. ?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

భర్తకు బుద్ది చెప్పాలనుకుంది ఓ భార్య.. చివరికి షాక్..?

నేడు ఊర్వశి శారద పుట్టిన రోజు, తెలుగు, మలయాళ చిత్రాల్లో ప్రతిభ కనుబరిచిన నటి. బాలనటిగా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శారద.

ఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..

రాజమౌళి 8 నిముషాల సాంగ్ పై అందరిలోనూ సందేహాలు !

ఇతనితోనా సినిమా అని ఎన్.టి.ఆర్ ను చూసి అనుకున్న డైరక్టర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>