PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-58fbbee2-8d52-4e2b-8b62-035640a99eed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-58fbbee2-8d52-4e2b-8b62-035640a99eed-415x250-IndiaHerald.jpgసకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తానని త్వరలోనే మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా నిచ్చారు షర్మిలక్క. తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. జులై 8వ తేదీన తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా పార్టీ పేరు ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను, కరోనాతో మరణించిన కుటుంబాలను ఆమె కలుస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ పర్యటనలో వైఎస్ అభిమానులు, కార్యకర్తలుPolitical {#}Doctor;Sircilla;Sharmila;dr rajasekhar;Karimnagar;Y. S. Rajasekhara Reddy;Telangana;prema;Love;District;Father;Minister;Reddy;Partyఅయ్యో: షర్మిల కష్టం బూడిదలో పోసిన పన్నీరే...?అయ్యో: షర్మిల కష్టం బూడిదలో పోసిన పన్నీరే...?Political {#}Doctor;Sircilla;Sharmila;dr rajasekhar;Karimnagar;Y. S. Rajasekhara Reddy;Telangana;prema;Love;District;Father;Minister;Reddy;PartyFri, 25 Jun 2021 14:53:00 GMT
సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు వెళ్తానని  త్వరలోనే మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా నిచ్చారు షర్మిలక్క. తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. జులై 8వ తేదీన తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా పార్టీ పేరు ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని  తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను, కరోనాతో మరణించిన కుటుంబాలను ఆమె కలుస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ పర్యటనలో వైఎస్ అభిమానులు,  కార్యకర్తలు ఆమెకు  ఘన స్వాగతం పలికారు. జిల్లా నేతలతో కొద్దిసేపు  ముచ్చటించిన షర్మిల  సిరిసిల్ల పట్టణంలోని  డాక్టర్ పెంచులయ్య ఇంటికి వెళ్లారు. ఆయన అగ్గిపెట్టలో ఇమిడి ఉండే చీరను షర్మిలకు బహుమతిగా ఇచ్చారు. పలువురిని పరామర్శించారుు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని త్వరలోనే మంచి రోజులు వస్తాయని ప్రజలకు భరోసా కల్పించారు.

షర్మిల పర్యటనను దృష్టిలో పెట్టుకొని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్ చేశారు. తెలంగాణకు  వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్యాయం చేశాడని అన్నారు. దొంగ, గజదొంగ అంటూ సంబోధించాడు. ఆనాడు పీజేఆర్ పోతిరెడ్డిపాడు మీద కొట్లాడితే ఆయనను ఎన్ని అవమానాలు పెట్టిడ్రు, వైయస్ సభలో ఆయన స్టేజి మీదికి పిలవకుండా పక్కన ఉంచితే ఆయనకు ఆవేదనతో గుండెపోటు వచ్చిందన్నారు. ఆ రోజు ఆయనను స్టేజి మీదకు పిలిచి ఉంటే ఆయన ఇవాళ బతికి ఉండేవారని, గుండెపోటు వచ్చిన సమయంలో  కనీసం అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా ఆయన ప్రథమ చికిత్స అందించలేదని మండిపడ్డారు.  ఆంధ్రప్రదేశ్లో  బడుగు బలహీన వర్గాలను మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మాకు తెలియదా అని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తే ఇక్కడి ప్రజలు ఊరుకో రని అన్నారు. వైయస్సార్ బ్రతికుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, అంటూ మీ ప్రాంత నాయకులు అంటున్నారని అది మీకు తెలియదా అని ప్రశ్నించారు.

 తెలంగాణలో ఎంతో మంది ఆంధ్రా బిడ్డలు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారని, మేము ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణలో మళ్లీ ఇలాంటి అలజడి సృష్టించిన ఊరుకునేది లేదని, వైయస్సార్ పచ్చి మోసగాడు అని అంటూ కామెంట్స్ వదిలారు. మంత్రి శ్రీనివాస్ మాటలను బట్టి చూస్తే  తెలంగాణ అంటే ఒక టిఆర్ఎస్ వాళ్లకు మాత్రమే హక్కు ఉంటుందని, వీరికి మాత్రమే  తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటుందని  తెలియజేస్తున్నట్లు ఉంది. ఈయన మాట్లాడిన మాటలు అన్నీ షర్మిల పర్యటన దృష్టిలో పెట్టుకొని అంటున్నారా అని అర్థమవుతుంది. వైఎస్ఆర్ ను ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు దూషించలేదని, ఇప్పుడు ఎందుకు ఆయన చేసిన అన్యాయం కనబడుతుందని పలువురు  ప్రజలు అనుకుంటున్నారు.



హుజూరాబాద్‌పై బీజేపీ ఉడుంప‌ట్టు?

పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్.. కిడ్స్ రియాలిటీ.. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది?

చిరంజీవి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా.. ?

బాబోరొదిలేశారు.. రెండేళ్ల‌లోనే అక్క‌డ టీడీపీ సీన్ సితారైపోయిందా..!

రాజుల రాజకీయం: చీలిక వచ్చినట్లేనా!

తెలంగాణ నాయకుల వాద‌న రాజ‌కీయ అవ‌స‌ర‌మే :పేర్నినాని

రజిని సినిమాలకి గుడ్ బై చెప్తున్నాడా ?

హైదరాబాద్ లో బోనాలు ఎక్కడ...? ఈ ఏడాది పరిస్థితి ఏంటీ...?

క్షమించు అన్నా... కేసీఆర్ కు ఈటెల లేఖ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>