EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan4d871e42-5c02-4d82-929a-e94680c868ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan4d871e42-5c02-4d82-929a-e94680c868ff-415x250-IndiaHerald.jpgస‌ర‌స్వ‌తి సిమెంట్స్‌. ఇది జ‌గ‌న్ కుటుంబానికి ఉన్న వ్యాపార కంపెనీల్లో కీల‌క‌మైంది. భార‌తి సిమెంట్స్‌గా త‌ర్వాత పేరు మార్చారు. దీనికి క‌డ‌ప‌లోను, గుంటూరులోను.. సున్న‌పురాయి గ‌నుల‌ను లీజుకు తీసుకున్నారు. అయితే.. వీటిని గ‌త ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌..పున‌రుద్ధ‌రించుకున్నారు. దీనిపై వివాదం హైకోర్టుకువెళ్లింది. అక్క‌డ తేల్చుకుని అనుకూలంగా తీర్పు తెచ్చుకోగ‌లిగారు. అయితే.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. ఎంపీ ర‌ఘురామ మ‌ళ్లీ పిటిష‌న్ వేశారు. గ‌త సింగిల్ Jagan Mohan Reddy{#}mithra;MP;High court;police;CM;Andhra Pradeshఎక్క‌డి లోపం.. ఎవ‌రు చేస్తున్నారు? జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నంఎక్క‌డి లోపం.. ఎవ‌రు చేస్తున్నారు? జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నంJagan Mohan Reddy{#}mithra;MP;High court;police;CM;Andhra PradeshFri, 25 Jun 2021 21:00:00 GMTఒకే వారంలో మూడు రోజులు.. మూడు ప్ర‌ధాన విష‌యాలు... ఏపీ స‌ర్కారును మ‌ళ్లీ.. వార్త‌ల్లోకి లాగేశాయి. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రి పై విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేశాయి. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి?  ఎక్క‌డ లోపాలు ఉన్నాయి?  ఎవ‌రు చేస్తున్నారు?  భ‌విష్య‌త్తులో వివాదం అవుతాయ‌ని.. ఊహించ‌లేక పోతున్నారా?  లేక .. తెలిసే ఇలా చేస్తున్నారా?  ఇవీ.. సీఎం జ‌గ‌న్ స‌హా కీల‌క స‌ల‌హాదారు లను తొలిచేస్తున్న ప్ర‌శ్న‌లు. దీంతో ఆ మూడు అంశాల‌పై సీఎం జ‌గ‌న్ మ‌రింత లోతుగా దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

1- స‌ర‌స్వ‌తి సిమెంట్స్‌:
స‌ర‌స్వ‌తి సిమెంట్స్‌. ఇది జ‌గ‌న్ కుటుంబానికి ఉన్న వ్యాపార కంపెనీల్లో కీల‌క‌మైంది. భార‌తి సిమెంట్స్‌గా త‌ర్వాత పేరు మార్చారు. దీనికి క‌డ‌ప‌లోను, గుంటూరులోను.. సున్న‌పురాయి గ‌నుల‌ను లీజుకు తీసుకున్నారు. అయితే.. వీటిని గ‌త ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌..పున‌రుద్ధ‌రించుకున్నారు. దీనిపై వివాదం హైకోర్టుకువెళ్లింది. అక్క‌డ తేల్చుకుని అనుకూలంగా తీర్పు తెచ్చుకోగ‌లిగారు. అయితే.. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ.. ఎంపీ ర‌ఘురామ మ‌ళ్లీ పిటిష‌న్ వేశారు. గ‌త సింగిల్ జ‌డ్జి ఇచ్చిన తీర్పు స‌రైందే అయినా.. ఆయ‌న‌కు స‌మ‌ర్పించిన ప‌త్రాల్లో లోపం ఉంద‌ని, స‌రైన ప‌త్రాలు స‌మ‌ర్పించ‌లేద‌ని.. కొత్త వాద‌న తెర‌మీదికి తెచ్చారు. దీంతో మ‌ళ్లీ ఈ వ్య‌వ‌హారం మొద‌టి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

2. జ‌గ‌న్‌పై కేసులు
చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌తిపక్ష నేత‌గా జ‌గ‌న్‌పై పోలీసులు వివిధ జిల్లాల్లో 11 కేసులు న‌మోదు చేశారు. అయితే.. అప్ప‌ట్లో వీటిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. దీంతో జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే వాటిని ర‌ద్దు చేసుకుంటూ.. పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. వీటిలో లోపాలు ఉన్నాయ‌ని.. ఉద్దేశ పూర్వంగానే వెన‌క్కి తీసుకున్నార‌ని.. పేర్కొంటూ.. కొంద‌రు కోర్టుకు వెళ్లారు. వీటిని ఇప్పుడు హైకోర్టు మ‌ళ్లీ విచార‌ణ‌కు స్వీక‌రించింది.

3. ప‌రీక్ష‌ల ర‌ద్దు
ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి తీరాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. క‌రోనా నేప‌థ్యంలోనూ చ‌ర్య‌లు తీసుకుని.. విద్యార్థుల‌కు న‌ష్టం రాని విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది. అయితే.. సుప్రీం హెచ్చ‌రిక‌ల‌తో  వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అయితే.. ఈ మూడు ప‌రిణామాలు కూడా ఒకే వారంలో చోటు చేసుకున్నాయి. దీంతో ఇదే వారంలో జ‌గ‌న్ చేప‌ట్టిన చేయూత‌, వాహ‌న మిత్ర వంటి ప‌థ‌కాల‌కు ఫోక‌స్ లేక‌పోగా.. ఇవే హైలెట్ అయ్యాయి.

దీంతో ఆయా నిర్ణ‌యాలు తీసుకునే ముందు జ‌రిగిన ప‌రిణామాలు ఏంటి? ఎవ‌రు త‌న‌కు అనుకూలంగా నివేదిక‌లు ఇచ్చారు?  ఎందుకు ఇప్పుడు అవి వివాదం అయ్యాయి?  ప్ర‌భుత్వాన్ని ఉద్దేశ పూర్వ‌కంగానే ఇరుకున పెట్టాల‌ని `కొంద‌రు` నిర్ణ‌యించుకున్నారా? అనే భావ‌న సీఎం జ‌గ‌న్‌లో వ్య‌క్త‌మ‌వుతోంద‌ని దీనిపై ఆయన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 



మాస్కు ధరించలేదని బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం..!

విజయం మీదే: పరీక్షలు లేవని చింతిస్తున్నారా ?

ఆ మంత్రి త‌డ‌బాటు.. టీడీపీకి వ‌రం.. వైసీపీకి శాప‌మైందా.. ?

హీరోయిన్ పాయల్ అరెస్ట్!

జైలుకెళ్తూ.. ఇంకా నవ్వుతున్నావా?

హాజ‌రు కాకుండా త‌ప్పించుకున్న ఎంపీ?

అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

కేసీఆర్ చెప్పేవ‌న్నీ అంకాపూర్ ముచ్చ‌ట్లే - మాజీ ఎంపీ విజ‌య‌శాంతి

కోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>