PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5d591cb0-c8c1-403d-bb1e-15839c747f9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5d591cb0-c8c1-403d-bb1e-15839c747f9b-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొంత‌కాలం నుంచి అసంతృప్తితో ఉంటున్న నేత‌ల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు భార‌తీయ జ‌న‌తాపార్టీ వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు ఆ పార్టీ తెర‌లేపింది. అసంతృప్తుల‌కు గాలంవేసి సాధ్య‌మైనంత‌మేర సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించి అసెంబ్లీ ఎన్నిల‌కు గ‌ట్టి స‌వాల్ విస‌రాల‌నే కృత‌నిశ్చ‌యంతో బీజేపీ నేత‌లున్నారు. అవ‌స‌ర‌మైతే భారీ ఆక‌ర్ష‌ణ ప‌థ‌కాలు ప్ర‌క‌టించాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. కేంద్రంలో అధికారంలోtag{#}West Bengal - Kolkata;Assembly;Telangana;Party;Minister;Bharatiya Janata Party;MPటీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)టీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)tag{#}West Bengal - Kolkata;Assembly;Telangana;Party;Minister;Bharatiya Janata Party;MPFri, 25 Jun 2021 12:56:52 GMT


తెలంగాణ‌లో బెంగాల్ రాజ‌కీయాలు

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొంత‌కాలం నుంచి అసంతృప్తితో ఉంటున్న నేత‌ల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు భార‌తీయ జ‌న‌తాపార్టీ వ్యూహాల‌ను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఆరుగురు ఎమ్మెల్సీల ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఈ త‌ర‌హా రాజ‌కీయాల‌కు ఆ పార్టీ తెర‌లేపింది. అసంతృప్తుల‌కు గాలంవేసి సాధ్య‌మైనంత‌మేర సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించి అసెంబ్లీ ఎన్నిల‌కు గ‌ట్టి స‌వాల్ విస‌రాల‌నే కృత‌నిశ్చ‌యంతో బీజేపీ నేత‌లున్నారు. అవ‌స‌ర‌మైతే భారీ ఆక‌ర్ష‌ణ ప‌థ‌కాలు ప్ర‌క‌టించాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్నాంకాబ‌ట్టి ప‌నులు చేసిపెడ‌తామ‌ని, వీలైతే కాంట్రాక్టులిప్పిస్తామ‌నే ఆశ చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈటెల ప్ర‌క‌ట‌న‌ను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం!
తాజాగా ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం ముగిసిన‌వారిలో గుత్తా, క‌డియం, ఫ‌రీదుద్దీన్‌, విద్యాసాగ‌ర్‌, ఆకుల ల‌లిత‌, బి.వెంక‌టేశ్వ‌ర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానాల‌కు పోటీప‌డుతున్న ఆశావ‌హుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలో చాలామంది అస‌మ్మ‌తి నేత‌లున్నారంటూ మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు ఎమ్మెల్సీ ప‌ద‌వులు పొందేవారెవ‌రు?  పొంద‌నివారెవ‌రు? అంటూ ఒక జాబితా సిద్ధం చేసుకున్న‌ట్లు తెలిసింది. మాజీ మంత్రులు మండవ వెంక‌టేశ్వ‌ర‌రావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి, కోటిరెడ్డి, ర‌వీంద‌ర్‌రావు త‌దిత‌రులు ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా రానుండ‌టంతో వీటిని భ‌ర్తీ చేయ‌డం ముఖ్య‌మంత్రికి క‌త్తిమీద సాములా మారింది. ఈ ద‌ఫా ప‌ద‌వులు పొంద‌నివారినంద‌రినీ పార్టీలోకి లాగేసుకోవాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో క‌మ‌లం పార్టీ నేత‌లున్నారు.

పారిశ్రామిక‌వేత్త‌ల‌పై దృష్టి
వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌ల‌పై క‌మ‌ల‌ద‌ళం దృష్టిసారించింది. వారికి కేంద్రంలోని సంస్థ‌ల‌తోనే ప‌నులు ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి అటునుంచి న‌రుక్కువ‌చ్చే దిశ‌గా ఆలోచిస్తున్నారు. న‌యానో భ‌యానో లొంగ‌దీసుకున్నామ‌నే యోచ‌న‌లో బీజేపీ ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర‌స‌మితికి ఆర్థికంగా అండ‌దండ‌లందిస్తోన్న పారిశ్రామిక‌వేత్త‌ల‌ను లొంగ‌దీసుకుంటే ఆ పార్టీని ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డంతోపాటు త‌మ‌కు గెలుపు కూడా సునాయాస‌మ‌వుతుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రి వారి ఆలోచ‌న‌లు ఎంత‌వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌వుతాయో తెలియాలంటే కొద్దికాలం వేచిచూడాల్సిందే..










తెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులు

తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తానంటున్న అమ‌రావ‌తి ఎంపీ

సుడిగాలుల దెబ్బకు ఆ దేశం వణికిపోయింది..!

టీఆర్ఎస్‌లో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు... ఒక కొత్త‌ మంత్రి...!

బిగ్ బ్రేకింగ్: ఏపీ సిఎస్ ను జైలుకి పంపిస్తాం: ఎన్ జీ టి వార్నింగ్

జాతీయ‌స్థాయిలో అత్యంత ప్ర‌తిభావంతుడైన న‌టుడిగా పేరుతెచ్చుకున్న ప్ర‌కాష్‌రాజ్ వ‌ర్త‌మాన రాజ‌కీయాలపై కూడా అంతే ప్ర‌తిభావంతంగా మాట్లాడ‌తారు. పాల‌కులైనా, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారైనా ఎవ‌రినైనా స‌రే.. వ‌దిలిపెట్ట‌రు. త‌ప్పు చేశార‌ని తెలిస్తే మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ విమ‌ర్శిస్తారు. స్థానిక రాజ‌కీయాల నుంచి అంత‌ర్జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కు ప్ర‌తి అంశంపై ఆయ‌న‌కు క్షుణ్నంగా ప‌ట్టుంది. ప్ర‌తి అంశంపై వివ‌రంగా మాట్లాడ‌గ‌ల‌రు

ప్ర‌కాష్‌రాజ్‌కు స‌మాధానం చెప్పేవారు లేరు?

బీటెక్, బీఫార్మసీ షెడ్యూల్ విడుదల.. !

సిబిఐ విచారణకు వైసీపీ నేత...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>