Telangana
oi-Srinivas Mittapalli
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావును నియమించినట్లు చెబుతున్నారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక విషయంలో కేంద్రం చాలానే కసరత్తులు చేసింది.జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మితా దేవ్… ఇందుకోసం పార్టీకి చెందిన నలుగురు మహిళా నేతలను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసినట్లు తెలుస్తోంది. చివరకు సునీత ముదిరాజ్ వైపే సుశ్మితా దేవ్ మొగ్గుచూపినట్లు సమాచారం.పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడంతో పాటు మహిళా సమస్యలను పరిష్కరించే సత్తా ఉండటంతో సునీత్ ముదిరాజ్‌కే పదవి దక్కిందని అంటున్నారు.

సునీత ముదిరాజ్ గతంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐలో పనిచేశారు. నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా,పీసీసీ అధికార ప్రతినిధి గాను సేవలందించారు. పార్టీకి విధేయురాలు,కష్టపడే తత్వం ఉన్న నేత కావడంతోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద కొనసాగుతూ వచ్చారు. సుదీర్ఘకాలంగా ఆమె ఆ పదవిలో కొనసాగుతున్నారు. సునీత ముదిరాజ్ నియామకంతో నేరెళ్ల శారద ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు.
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలి ఎంపికతో ఇక పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది.ఎంపీలు రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల్లో ఒకరికి పదవి ఖాయమని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం రావట్లేదు. ఏ రోజుకారోజు తెరమీదకు ఒక పేరు రావడం… ఆ సాయంత్రానికే ప్రకటన ఉండొచ్చునని ఊహాగానాలు వినిపించడం కామన్‌గా మారిపోయింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పునర్వైభవం సాధించాలంటే కొత్త నాయకత్వం తప్పనిసరి. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో మీన మేషాలు లెక్కిస్తూనే ఉంది.
English summary
Sunita Mudiraj has been appointed as the President of the Telangana Women’s Congress. AICC general secretary Venugopal has issued orders to this effect. Sunita Rao is said to have been appointed as the new woman Congress president as part of the Congress party purge in the state.
Story first published: Saturday, June 26, 2021, 0:44 [IST]