PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgటీడీపీ అంటే.. ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ రాష్ట్ర సార‌థి సోము వీర్రాజు.. అశోక్‌ను వెనుకేసుకు వ‌చ్చారు. ఆయ‌న గురించి మాట్లా డే ముందు.. వారి వంశం ఈ ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌ల‌ను తెలుసుకోవాల‌ని.. అన్నారు. అంతేకాదు.. అశోక్ గ్రామాల్లో కి వెళ్తే.. చీర‌లు ప‌రిచి ఆయ‌న‌ను న‌డిపించుకుని తీసుకువెళ్తార‌ని కూడా చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ రాష్ట్ర సార‌థి సాకే శైల‌జానాథ్ కూడా.. ఇదే త‌ర‌హాలో అశోక్‌ను వెనుకేసుకు వ‌చ్చారు. అశోక్ గురించి ఏం తెలుసున‌ని వైసీపీ నేత‌లు మాట్లాడుతున్నారు. ఆయ‌న అనుభ‌వం ముందు.. Jagan ysrcp{#}salt;High court;Delhi;ashok;Minister;Bharatiya Janata Party;Congress;central government;TDP;YCPజ‌గ‌న్‌, వైసీపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతోన్న చేతులు.. ఇది 100 శాతం రాంగ్ స్టెప్‌..!జ‌గ‌న్‌, వైసీపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతోన్న చేతులు.. ఇది 100 శాతం రాంగ్ స్టెప్‌..!Jagan ysrcp{#}salt;High court;Delhi;ashok;Minister;Bharatiya Janata Party;Congress;central government;TDP;YCPFri, 25 Jun 2021 10:09:31 GMTవిజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు విష‌యంలో అనూహ్య‌మైన ప‌రిణా మం తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవ‌ల మాన్సాస్ ట్రస్ట్ విష‌యంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న నేరుగా వెళ్లి స‌ద‌రు ట్ర‌స్టు కు చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే.. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల నుంచి అశోక్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొంద‌రు నేత లు దూకుడుగా వ్యాఖ్య‌లు చేశారు. వీటిని టీడీపీ నేత‌లు ఖండించారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా ఎదురు దాడి చేసుకున్నా యి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఈ విష‌యంలో పార్టీల‌కు అతీతంగా నేత‌లు స్పందించ‌డ‌మే రికార్డ్‌.

టీడీపీ అంటే.. ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ రాష్ట్ర సార‌థి సోము వీర్రాజు.. అశోక్‌ను వెనుకేసుకు వ‌చ్చారు. ఆయ‌న గురించి మాట్లా డే ముందు.. వారి వంశం ఈ ప్ర‌జ‌ల‌కు చేసిన సేవ‌ల‌ను తెలుసుకోవాల‌ని.. అన్నారు. అంతేకాదు.. అశోక్ గ్రామాల్లో కి వెళ్తే.. చీర‌లు ప‌రిచి ఆయ‌న‌ను న‌డిపించుకుని తీసుకువెళ్తార‌ని కూడా చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ రాష్ట్ర సార‌థి సాకే శైల‌జానాథ్ కూడా.. ఇదే త‌ర‌హాలో అశోక్‌ను వెనుకేసుకు వ‌చ్చారు. అశోక్ గురించి ఏం తెలుసున‌ని వైసీపీ నేత‌లు మాట్లాడుతున్నారు. ఆయ‌న అనుభ‌వం ముందు.. మీ వ‌య‌సు చాల‌దు అన్నారు.

ఇక‌, క‌మ్యూనిస్టులు కూడా అశోక్‌కు అనుకూలంగా మాట్లాడారు. అదేస‌మ‌యంలో కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సైతం.. వైసీపీ వైఖ‌రిని ఎండ‌గట్టారు. అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఎంతో ప‌రువు, మ‌ర్యాద ఉన్నా యని.. అలాంటి నాయ‌కుడిని విమ‌ర్శించ‌డం ఏంట‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా.. పార్టీల‌కు అతీతంగా ఇలా ప్ర‌తి ఒక్క‌రూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం వెనుక ఏదైనా రీజ‌న్ ఉందా? అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతున్న ప్ర‌చారం. నిజానికి ఇలాంటి ప‌రిణామం.. గ‌తంలో ఎప్పుడూ క‌నిపించ‌లేదు. వినిపించ‌లేదు. ఇది జ‌గ‌న్‌కు నూటికి నూరు శాతం మైన‌స్సే..!

అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన‌ప్పుడు, ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను జైలుకు పంపిన‌ప్పుడు కూడా ఇలాంటి రియాక్ష‌న్ రాలేదు. కానీ, అశోక్ విష‌యంలో మాత్రం.. ఇలా రియాక్ట్ అవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతానికి అయితే.. ప్ర‌త్యేకంగా రీజ‌న్ ఏమీ లేక‌పోయినా.. జ‌గ‌న్‌కు వైసీపీ నేత‌ల‌కు వ్య‌తిరేకంగా.. నేత‌లు అంద‌రూ ఒక్క‌ట‌వుతున్నార‌న‌డానికి ఇది ప్ర‌ధాన సంకేతంగా భావించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. మ‌రి ఇదే బ‌లోపేతం అయి.. అంద‌రూ ఒకేతాటిపైకి వ‌స్తే.. జ‌గ‌న్‌కు వైసీపీ కి ఏమైనా న‌ష్ట‌మా?  చూడాలి.. ఏం జ‌రుగుతుందో!!

 



అశోక్ విష‌యంలో జ‌గ‌న్‌, వైసీపీ మైన‌స్ అయ్యాయా ?

ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఏమన్నారో తెలుసా?

జగన్ రాక్షస క్రీడ ముగిసింది.. ఇప్పుడు సంతోషంగా ఉంది : నారా లోకేష్

హైదరాబాద్ లో రెండో రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభించనున్న కేటీఆర్!

ఈ సారి జ‌గ‌న్‌కు కంచుకోట క‌రెంట్ షాక్ ఇస్తుందా ?

డెల్టా ప్లస్ వేరియంట్: మళ్లీ అదే తప్పు చేస్తున్నారా ?

మరి ఇంత దారుణమా.. శానిటైజర్ చల్లి పార్టీలోకి ఆహ్వానించారు?

పేదల ఇళ్లు.. జగన్ కి ప్లస్సా..? మైనస్సా??

వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేల‌పై జ‌గ‌న్ అసంతృప్తి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>