PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp8ad1f252-e25d-4e00-a5a0-c746074b636d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp8ad1f252-e25d-4e00-a5a0-c746074b636d-415x250-IndiaHerald.jpgచంద్ర‌గిరి, తిరుప‌తి, గంగాధ‌ర నెల్లూరు, పుంగ‌నూరు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు మాత్ర‌మే జిల్లాలో దూకుడుగా ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామిలు.. జిల్లాలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నారు. ``మేం ఏం చేయాల‌న్నా.. చేసేందుకు రెడీనే కానీ, చేయ‌నిస్తే క‌దా?`` అంటూ.. చాలా మంది ఎమ్మెల్యేలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎమysrcp{#}kuppam;Dookudu;Chittoor;CM;MLA;YCPఈ వైసీపీ ఎమ్మెల్యేల అగ‌చాట్లు మామూలుగా లేవే... పాపం ఎన్ని క‌ష్టాలు...!ఈ వైసీపీ ఎమ్మెల్యేల అగ‌చాట్లు మామూలుగా లేవే... పాపం ఎన్ని క‌ష్టాలు...!ysrcp{#}kuppam;Dookudu;Chittoor;CM;MLA;YCPFri, 25 Jun 2021 16:00:00 GMTరాయ‌ల‌సీమ జిల్లాల్లో అత్యంత కీల‌క‌మైన చిత్తూరు జిల్లాను గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చేజిక్కించుకుంది. ఒక్క కుప్పం నియోజ‌క‌వ‌ర్గం మిన‌హా.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను గెలుచుకుంది. దీంతో సంఖ్యాబ‌లంలో చిత్తూరు వైసీపీకి ఎంతో క‌లిసి వ‌చ్చింది. అయితే.. ఇది పార్టీకి సంతోషంగా ఉంటే ఉండొచ్చు.. కానీ,నేత‌ల ప‌రంగా చూసుకుంటే.. మాత్రం ఇక్క‌డ కొద్ది మంది మాత్ర‌మే సంతోషంగా ఉండ‌గా.. మిగిలిన వారు మాత్రం అగ‌చాట్లు ప‌డుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఎమ్మెల్యేలు.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పైకి చెప్పుకోలేక‌.. లోలోన దిగ‌మింగ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు.

చంద్ర‌గిరి, తిరుప‌తి, గంగాధ‌ర నెల్లూరు, పుంగ‌నూరు, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు మాత్ర‌మే జిల్లాలో దూకుడుగా ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, నారాయ‌ణ స్వామిలు.. జిల్లాలో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఎమ్మెల్యేలు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోతున్నారు. ``మేం ఏం చేయాల‌న్నా.. చేసేందుకు రెడీనే కానీ, చేయ‌నిస్తే క‌దా?`` అంటూ.. చాలా మంది ఎమ్మెల్యేలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎమ్మెల్యేల‌కు ప‌నిలేకుండా పోయింది.

అయిన‌ప్ప‌టికీ.. కొందరు ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో వారు సొంత డ‌బ్బులు ఖ‌ర్చు చేసుకుంటున్నారు. ఇదే ఇత‌ర ఎమ్మెల్యేల‌కు సాధ్యం కావ‌డం లేదు. ఏదైనా కార్య‌క్ర‌మం చేయాల‌ని జిల్లాకు చెందిన మంత్రుల‌కుచెప్ప‌గానే.. ఎందుకు?  ఇప్పుడు అవ‌స‌ర‌మా? అంటూ.. ప్ర‌శ్నిస్తుండ‌డంతో పాటు.. మీరు సొంత‌గా చేసుకుంటే అభ్యంత‌రం లేద‌ని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు.. ఖ‌ర్చుల‌కు వెనుకాడి ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

అయితే.. చంద్ర‌గిరి, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు కొంత మేర‌కు సొంత నిధులు ఖ‌ర్చు చేస్తూ.. ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. దీంతో ఇత‌ర నేత‌లు.. మౌనంగా ఉంటున్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు ముందు కొంత హ‌డావిడి చేసినా ఇప్పుడు గ‌ప్ చుప్ అయిపోయారు. ఇప్ప‌టికైనా.. ప్ర‌భుత్వం ఎమ్మెల్యే నిధుల‌విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల‌నేది వీరి కోరిక‌. మ‌రి సీఎం జ‌గ‌న్ వింటారా?  చూడాలి.

 



కేసీఆర్ చెప్పేవ‌న్నీ అంకాపూర్ ముచ్చ‌ట్లే - మాజీ ఎంపీ విజ‌య‌శాంతి

కోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!

ఉరితాడుతో టీడీపీ ఎమ్మెల్యే....కార‌ణం ఇదే..?

ఆ టీడీపీ నేతలను చంపింది వైసీపీ నేతలే!

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ ..!

వారి అండ‌తోనే ఆ మంత్రి అవినీతి చేస్తున్నారంటున్న జ‌న‌సేన నేత‌

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఆర్థిక క‌ష్ట‌న‌ష్టాలు..!

ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలే ప్లస్...!

రైతుకు రూ.5ల‌క్ష‌ల బీమా ఇచ్చేది తెలంగాణ మాత్ర‌మే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>