PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-again-delta-variant-shaking-8d882fa9-52b9-40a2-8c76-11207b0cdc79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lock-down-again-delta-variant-shaking-8d882fa9-52b9-40a2-8c76-11207b0cdc79-415x250-IndiaHerald.jpgడెల్టావేరియంట్ ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తోంది. సిడ్నీలో ఆ వైరస్ కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే లాక్ డౌన్ ను ప్రకటించింది. వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. politics internantional{#}Driver;Australia;INTERNATIONAL;India;Government;Coronavirusమళ్లీ లాక్ డౌన్..! దడదడలాడిస్తున్న డెల్టావేరియంట్...!మళ్లీ లాక్ డౌన్..! దడదడలాడిస్తున్న డెల్టావేరియంట్...!politics internantional{#}Driver;Australia;INTERNATIONAL;India;Government;CoronavirusFri, 25 Jun 2021 11:00:00 GMTకరోనాను కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా మొదటి స్థానం సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ వైరస్ ను కంట్రోల్ చేసి.. ప్రజల ప్రాణాలను కాపాడగలిగింది. అయితే ఇపుడు ఆ దేశంలో డెల్టావేరియండ్ టెన్షన్ రేపుతోంది. ఆస్ట్రేలియాలోని ఫేమస్ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టావేరియంట్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. బాధితుల ఇంటి సమీపంలోని కుటుంబాలను వారం రోజుల పాటు బయటకు రావొద్దని అధికారులు ఆంక్షలు విధించారు.

అంతర్జాతీయ విమాన సిబ్బందిని సిడ్నీ ఎయిర్ పోర్ట్ నుంచి క్వారంటైన్ సెంటర్ కు తీసుకెళ్లే క్రమంలో బస్ డ్రైవర్ కు కరోనా సోకింది. ఈ ప్రభావంతో పదుల సంఖ్యలో కోవిడ్ బారినపడ్డారు. ఈ కారణంగా డెల్టావేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే సిడ్నీలో లాక్ డౌన్ అస్త్రాన్ని సంధించింది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 30వేల కేసులు నమోదు కాగా.. 910మంది మృతి చెందారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టించింది. లక్షలాది ప్రాణాలను బలిగొంది. ఎందరినో ఆస్పత్రిపాలు చేసి వారి ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేయగా.. ఇప్పుడు థర్డ్ వేవ్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇదిలా ఉంటే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యల్లో ఫంగస్ కరోనా నుంచి కోలుకున్న వారిని ఆస్పత్రిపాలు చేశాయి. పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి.. కరోనాను కట్టడి చేశాయి. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసి వైరస్ ను అంతు చూసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశాయి. అయితే ఇపుడు థర్డ్ వేవ్ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది.

ఇక భారత్ లో సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో తన ప్రతాపం చూపించింది. ఈ ప్రభావంతో కోవిడ్ కేసులు పెరగడంతో పాటు.. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి ఆందోళన రేకెత్తించింది. ఇలాంటి సందర్భంలో మన దేశంలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేశాయి. కరోనా కంట్రోల్ లోకి రావడంతో అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే భారత్ ను థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. ఆ ప్రమాదాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది.





దేశంలో చావులు ఆగవా...?

బ్రేకింగ్: హుజారాబాద్ బరిలో షర్మిల...?

బ్రేకింగ్: తెలంగాణా పోలీసులకు సంచలన ఆదేశాలు...?

మన ఇండియాలో వర్షాకాలంలో చూడవల్సిన ఆ ప్రాంతాలు ఇవే..!

టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దు స్టూడెంట్స్ కి నష్టమా లాభమా ?

బాలయ్య వినాయక చవితి సెంటిమెంట్ వెంటాడుతున్న యష్ భయాలు !

అమ్మకానికి టాలీవుడ్ హీరోల ఆస్తులు

నెక్స్ట్ సినిమాల కోసం అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న పూజా..?

కరోనా సోకిన వారిలో రక్తం అందుకే గడ్డ కడుతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>