MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya-ca4750f1-37ac-4350-8be5-8139179d117b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya-ca4750f1-37ac-4350-8be5-8139179d117b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ రంగాల కొందరు హీరోలతో హీరోయిన్ల జోడీ చూడాలని ఫ్యాన్స్ కి తెగ ముచ్చటగా ఉంటుంది. కానీ అది ఎందుకో సాధ్యపడదు. బాలయ్య శ్రీదేవి కాంబో కోసం అప్పట్లో పెద్ద చర్చే జరిగేది. అది నిజంగా వర్కౌట్ కావాల్సిందే. కానీ దానికి ఎంతగా అవకాశాలు వచ్చాయో అంతలా వెనక్కి పోయే పరిస్థితులు ఈ కాంబోకు వచ్చాయని చెబుతారు. soundarya {#}Soundaryaబాలయ్య..సౌందర్య... అలా మిస్సయ్యారు... ?బాలయ్య..సౌందర్య... అలా మిస్సయ్యారు... ?soundarya {#}SoundaryaFri, 25 Jun 2021 19:04:55 GMTతెలుగు సినీ రంగాల కొందరు హీరోలతో హీరోయిన్ల జోడీ చూడాలని ఫ్యాన్స్ కి తెగ ముచ్చటగా ఉంటుంది. కానీ అది ఎందుకో సాధ్యపడదు. బాలయ్య శ్రీదేవి కాంబో కోసం అప్పట్లో పెద్ద చర్చే జరిగేది. అది నిజంగా వర్కౌట్ కావాల్సిందే. కానీ దానికి ఎంతగా అవకాశాలు వచ్చాయో అంతలా వెనక్కి పోయే పరిస్థితులు ఈ కాంబోకు వచ్చాయని చెబుతారు.

ఇక టాలీవుడ్ లో అద్భుతమైన నటి సౌందర్య. ఆమె తొంబై దశకం నుంచి పద్నాలుగేళ్ల పాటు ఇండస్ట్రీలో తన హవా చాటారు. చేతిలో సినిమాలు ఉండగానే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో  2004 లో  కన్ను మూశారు. ఇదిలా ఉంటే సౌందర్య తెలుగులో అందరు అగ్ర హీరోలతో జంట కట్టింది. ఆమె 1994లో రిలీజ్ అయిన టాప్ హీరో మూవీలో బాలయ్యకు జతగా నటించింది. ఈ ఇద్దరి కాంబో మరిన్ని సార్లు రిపీట్  అవుతుందని అంతా భావించారు. ఈ మూవీలో సాంగ్స్ బాగుంటాయి. దానికి వారిద్దరి జోడీ కూడా బాగా సెట్ అయింది.

అయితే ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే టాప్ హీరో తరువాత బాలయ్య సౌందర్య జోడీతో మరికొన్ని మూవీస్ రావాలి. అయితే వివిధ కారణాల వల్ల అవి ఆగిపోయాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది నరసింహనాయుడు. ఈ మూవీలో సిమ్రాన్ పాత్రకు మొదట సౌందర్యనే అనుకున్నారు. ఎందుకంటే అది బరువైన పాత్ర. సెంటిమెంట్ ఆ పాత్ర చుట్టూ ఉంటుంది. అయితే కాల్షీట్లు సర్దుబాటు చేయలేక సౌందర్య ఈ చాన్స్ వదులుకుంది. ఇక వీవీ వినాయక్ రెండవ సినిమాగా వచ్చిన చెన్న కేశవరెడ్డి.

ఈ మూవీలో ఇద్దరు బాలయ్యకు ఉంటారు. పెద్ద బాలయ్య పక్కన నటించేందుకు సౌందర్యనే మొదట అనుకున్నారు. అయితే ఈసారి అదే సమస్య. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. చెన్నకేశవరెడ్డి ఫాస్ట్ గా తీసి రిలీజ్ చేయాల్సి ఉంది. దాంతో ఆమె ప్లేస్ లో టబుని తీసుకున్నారు. ఇక బాలయ్య సొంత దర్శకత్వంలో తీయాలనుకున్న నర్తనశాల మూవీలో ద్రౌపదిగా మాత్రం మరెవరూ లేరు ఒక్క సౌందర్య తప్ప అని డిసైడ్ అయి ఆమెను తీసుకున్నారు. అయితే ఈ సినిమా షూట్ ఇలా స్టార్ట్ అయిందో లేదో ఆమె అకాల మరణం పొందారు. మొత్తానికి బాలయ్య సౌందర్య జంట ఒకే ఒక్క సినిమాకు పరిమితం అయింది.









తెలుగు సినీ రంగాల కొందరు హీరోలతో హీరోయిన్ల జోడీ చూడాలని ఫ్యాన్స్ కి తెగ ముచ్చటగా ఉంటుంది. కానీ అది ఎందుకో సాధ్యపడదు. బాలయ్య శ్రీదేవి కాంబో కోసం అప్పట్లో పెద్ద చర్చే జరిగేది. అది నిజంగా వర్కౌట్ కావాల్సిందే. కానీ దానికి ఎంతగా అవకాశాలు వచ్చాయో అంతలా వెనక్కి పోయే పరిస్థితులు ఈ కాంబోకు వచ్చాయని చెబుతారు.

ఆ హీరో మహేష్ పేరును నిలబెడతాడా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>