MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anrf81eb9f3-5a62-40a2-b9f8-0dc6ef99f464-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anrf81eb9f3-5a62-40a2-b9f8-0dc6ef99f464-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ రంగంలో తొలి తరం స్టార్ హీరోలు ఎన్టీయార్ అక్కినేని అయితే మలి తరం హీరోలుగా క్రిష్ణ శోభన్ బాబులను చెప్పుకోవాలి. క్రిష్ణ ఎన్టీయార్ లా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకుంటే శోభన్ బాబు అక్కినేని బాటలో రొమాంటిక్ హీరోగా ఒక వెలుగు వెలిగారు. anr{#}Akkineni Nageswara Raoశోభన్ చేయాల్సిన మూవీ అక్కినేనితో... ?శోభన్ చేయాల్సిన మూవీ అక్కినేనితో... ?anr{#}Akkineni Nageswara RaoFri, 25 Jun 2021 20:00:00 GMTతెలుగు సినీ రంగంలో తొలి తరం స్టార్ హీరోలు ఎన్టీయార్ అక్కినేని అయితే మలి తరం హీరోలుగా క్రిష్ణ శోభన్ బాబులను చెప్పుకోవాలి. క్రిష్ణ ఎన్టీయార్ లా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకుంటే శోభన్ బాబు అక్కినేని బాటలో రొమాంటిక్ హీరోగా ఒక వెలుగు వెలిగారు.

దాంతో అక్కినేనికి శోభన్ బాబుకు మధ్య ఎపుడూ ఒక అందమైన పోటీ ఉండేది. అక్కినేనికి సూట్ అయిన పాత్రలన్నీ శోభన్ కి కూడా చాలా ఈజీగా నప్పేసేవి. అలా అక్కినేని చేయాల్సిన జెమినీ వారి మూవీ కన్న వారి కలలు మూవీని  శోభన్ బాబు చేశారని చెబుతారు. దాని వల్ల కొన్నాళ్ళ పాటు ఈ ఇద్దరు హీరోల మధ్య మాటలు కూడా లేవన్న ప్రచారం అప్పట్లో  జరిగింది. ఇదిలా ఉంటే అక్కినేని చేయాల్సిన సినిమా శోభన్ చేస్తే మరో సందర్భంలో శోభన్ చేయాల్సిన మూవీని అక్కినేని చేసి బదులు తీర్చుకున్నారు.

ఆ మూవీయే హేమాహేమీలు. ఇది విజయాక్రిష్ణా మూవీస్ పతాకం మీద నిర్మితం అయింది. విజయనిర్మల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ క్రిష్ణ, శోభన్ బాబులను హీరోలుగా పెట్టి హేమాహేమీలు తీయాలని విజయనిర్మల ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మూవీలో నటించడానికి శోభన్ కి కాల్షీట్ల సమస్య వచ్చిందని టాక్. దాంతో ఆయన ప్లేస్ లోకి చిత్రంగా అక్కినేని ఎంటర్ అయ్యారు. నిజానికి అక్కినేనికి క్రిష్ణకు మధ్య అప్పటికే కోల్డ్ వార్ ఉందని అంటారు. 1974లో దేవదాస్ మూవీని క్రిష్ణ తీశారు. దానికి విజయనిర్మల దర్శకత్వం వహించడమే కాదు పార్వతి పాత్ర పోషించారు.

దాంతో కొన్నాళ్ళు ఈ ఇద్దరి మధ్యన  మనస్పర్ధలు వచ్చాయి. అయితే హేమాహేమీలు తీసే  సమయానికి అవి సమసిపోయాయి. క్రిష్ణ విజయనిర్మల కోరిక మేరకు నాగేశ్వరరావు ఈ మూవీలో నటించేందుకు అంగీకరించారు. అలా 1979లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇందులో అక్కినేని క్రిష్ణల పాత్రల ప్రాధాన్యత ఎక్కడా దెబ్బతినకుండా బ్యాలన్స్ చేస్తూ విజయనిర్మల చక్కగా తీశారు.
   





తెలుగు సినీ రంగంలో తొలి తరం స్టార్ హీరోలు ఎన్టీయార్ అక్కినేని అయితే మలి తరం హీరోలుగా క్రిష్ణ శోభన్ బాబులను చెప్పుకోవాలి. క్రిష్ణ ఎన్టీయార్ లా మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకుంటే శోభన్ బాబు అక్కినేని బాటలో రొమాంటిక్ హీరోగా ఒక వెలుగు వెలిగారు.

‘క్యాలీఫ్లవర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..?

నామా కేసులో విచారణకు వెళ్ళింది ఎవరు...?

విచారణకు తెరాస ఎంపీ... నామా ఇంట్లో దొరికింది ఏంటీ...?

ఆయన బలవంతం చేస్తేనే.. రాజకీయాల్లోకి వచ్చానంటున్న మురళీమోహన్ ?

స్మరణ: గుమ్మడి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>